E-Paper
Advertisement

రిమోట్‌తో నడిచే ప్రీమియం BLDC ఫ్యాన్లు.. అమెజాన్ సేల్లో సగం ధరకే, పవర్ బిల్లు కూడా తక్కువే!

రిమోట్‌తో నడిచే ప్రీమియం BLDC ఫ్యాన్లు.. అమెజాన్ సేల్లో సగం ధరకే, పవర్ బిల్లు కూడా తక్కువే!
Advertisement

Best BLDC Ceiling Fans: ఎండలు మండిపోతున్న వేళ కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవాలనుకునే వారికి ఒక సూపర్ గుడ్ న్యూస్. Amazon Great Summer Sale మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఈ చివరి రోజైనా ఈ సేల్‌లో విద్యుత్ ఆదా చేసే ప్రీమియం BLDC సీలింగ్ ఫ్యాన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హావెల్స్, ఆటమ్‌బర్గ్, క్రాంప్టన్, ఓరియంట్, గోల్డ్‌మెడల్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఫ్యాన్లు భారీ తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. పాత కాలపు ఎక్కువ కరెంట్ వినియోగించుకునే ఫ్యాన్లను మార్చడానికి ఇంత కంటే మంచి అవకాశం మళ్లీ రాదు.

విద్యుత్ ఆదాలో నెంబర్ వన్:

సాధారణ సీలింగ్ ఫ్యాన్లు దాదాపు 75 నుండి 80 వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తాయి. కానీ ఈ ఆధునిక బీఎల్‌డీసీ టెక్నాలజీ ఫ్యాన్లు కేవలం 28 నుండి 35 వాట్ల పవర్‌తోనే నడుస్తాయి. దీంతో దాదాపు సగం కరెంట్ ఆదా అవుతుందన్నమాట. ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా సరే, ఇవి అద్భుతమైన గాలిని ఇస్తూనే కరెంట్ బిల్లులను సగానికి పైగా తగ్గిస్తాయి. అందుకే ఇప్పుడు ఈ ఫ్యాన్లకు డిమాండ్ బాగా పెరిగింది. రిమోట్ కంట్రోల్, టైమర్ సెట్టింగ్స్, స్లీప్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉండటం వల్ల వీటిని వాడుకోవడం కూడా ఎంతో సులువు.

ట్రెండింగ్‌లో ఉన్న స్మార్ట్ మోడల్స్:

Advertisement

ఈ సేల్‌లో ఓరియంట్ ఎలక్ట్రిక్ జెనో మోడల్ అందరినీ ఆకట్టుకుంటోంది. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉన్న ఈ ఫ్యాన్‌ను బెడ్ మీద నుంచి కదలకుండానే రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు. అలాగే కలర్‌బాట్ హెలిక్స్ మోడల్ కూడా స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. అలాగే ఇందులో రివర్స్ మోడ్ ఫీచర్ ఉండటం వల్ల చలికాలంలో కూడా గదిలో గాలి సమానంగా విస్తరించేలా చేయవచ్చు. ఇక క్రాంప్టన్ ఎనర్జీయాన్ హైపర్‌జెట్ ఫ్యాన్ అయితే ఆర్‌ఎఫ్ రిమోట్ టెక్నాలజీతో వస్తుంది. దీనికోసం రిమోట్‌ను ఫ్యాన్ వైపే తిప్పాల్సిన అవసరం లేదు, ఎటువైపు నుంచి అయినా ఆపరేట్ చేయవచ్చు. అంతేకాదు.. బడ్జెట్ ధరలో కావాలనుకునే వారి కోసం టీవీఎస్ గ్రీన్ ఫ్రీడమ్ మ్యాక్స్, అలాగే ఆఫీసులు, ఇళ్లకు ప్రీమియం లుక్ ఇచ్చేందుకు గోల్డ్‌మెడల్ ఒరిజో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

Also Read: ఇదేందయ్యా ఇది.. ఫోన్ ముందు 15 సెకెండ్లు గొంతు చించుకు అరిస్తే ఐస్‌క్రీమ్ ఫ్రీ అంట!

ఎక్కడికైనా తీసుకెళ్లే పోర్టబుల్ ఫ్యాన్:

Advertisement

ఇంట్లోనే కాకుండా ప్రయాణాల్లో లేదా ఆఫీస్ డెస్క్ దగ్గర వాడుకోవడానికి నూక్ లిట్ ప్రో వైర్‌లెస్ ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది. ఇది రీఛార్జబుల్ బ్యాటరీ, టైప్-సి చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. పవర్ కట్ అయినప్పుడు లేదా కరెంట్ సప్లై లేని ఆరుబయట ప్రదేశాల్లో కూడా దీని ద్వారా చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. దీనికి డిమాండ్ కూడా మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది.

లాభాలతో పాటు ఇవీ గమనించాలి:

సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే బీఎల్‌డీసీ ఫ్యాన్ల ధరలు కాస్త ఎక్కువే అయినప్పటికీ.. ఇవి ఆదా చేసే కరెంట్ బిల్లుల ద్వారా ఆ డబ్బులు వడ్డీతో సహా తిరిగి వచ్చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిలో అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ఉండటం వల్ల, ఏదైనా రిపేర్ వస్తే ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటి విడిభాగాలు స్థానిక మార్కెట్లలో అంత సులభంగా దొరకకపోవచ్చు. ఈ ఫ్యాన్లు ఎక్కువగా రిమోట్ మీదే ఆధారపడి పనిచేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త:

ఫ్యాన్లు ఎంత చల్లటి గాలిని ఇచ్చినప్పటికీ, వాటి రెక్కలపై పేరుకుపోయే దుమ్మును క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దుమ్ము వల్ల గదిలో అలర్జీలు వ్యాపించి, సైనస్ సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే రాత్రంతా ఒకేలా వచ్చే పొడి గాలి వల్ల కొంతమందికి గొంతు ఎండిపోవడం లేదా ముక్కులో అసౌకర్యంగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్త అవసరం. ప్రస్తుతం అమెజాన్ సేల్ ముగిసేలోపు బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుని నచ్చిన ఫ్యాన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: AC యూజర్స్‌కు అలర్ట్.. ఈ 6 మ్యాజిక్ సీక్రెట్స్ తెలిస్తే.. పవర్ బిల్లు సగానికి తగ్గడం ఖాయం!

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×