E-Paper
Advertisement

AC యూజర్స్‌కు అలర్ట్.. ఈ 6 మ్యాజిక్ సీక్రెట్స్ తెలిస్తే.. పవర్ బిల్లు సగానికి తగ్గడం ఖాయం!

AC యూజర్స్‌కు అలర్ట్.. ఈ 6 మ్యాజిక్ సీక్రెట్స్ తెలిస్తే.. పవర్ బిల్లు సగానికి తగ్గడం ఖాయం!
Advertisement

Save Electricity Bill: సమ్మర్ మొదలైందంటే చాలు.. హైదరాబాద్ వంటి రద్దీ ఎక్కువగా ఉండే నగరాల్లో ఉక్కపోతతో ఊపిరాడదు. ఈ క్రమంలో ఇంట్లో ఏసీ ఆన్ చేసినా కూడా ఏంటో అస్సలు చల్లబడట్లేదు అని చాలామంది తలలు పట్టుకుంటారు. దీనికి తోడు నెలాఖరున కరెంట్ బిల్లు ఎక్కడ కొంప ముంచుతుందోననే టెన్షన్ ఇంకొకటి. అయితే, పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. ఏసీ సూపర్ కూలింగ్ ఇవ్వడమే కాకుండా కరెంట్ బిల్లు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఆ సింపుల్ ఐడియాలు ఏంటో ఇప్పుడు చూద్దామా..

అవుట్‌డోర్ యూనిట్‌ను శుభ్రం చేయడం:

ఎంతసేపూ మనం ఇంట్లో ఉండే ఏసీని మాత్రమే తుడుస్తుంటాం కానీ, అసలైన కూలింగ్ అంతా బయట ఎండలో వేలాడే అవుట్‌డోర్ యూనిట్ (కంప్రెషర్ బాక్స్) లోనే జరుగుతుంది. బయట ఉండే దుమ్ము, ధూళి, దీనికి తోడు పక్షుల ఈకలు అన్నీ కలిసి ఆ మిషన్ వెనుక ఉండే నెట్ లాంటి భాగంలో ఒక గట్టి నల్లటి పొరలా పేరుకుపోతాయి. దీనివల్ల లోపల ఉండే వేడి గాలి బయటకు వెళ్లలేక మిషన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ నేపథ్యంలో మీరు చేయాల్సిందల్లా.. ఒక వాటర్ పైప్ తీసుకుని, ఆ మిషన్ వెనుక ఉండే మెటల్ రెక్కలపై సున్నితంగా నీళ్లు చల్లి క్లీన్ చేయడం. ఇలా చేస్తే మిషన్ ఫ్రీగా గాలి పీల్చుకుని.. గది ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తుంది.

ఫిల్టర్లను కాపాడుకోండిలా..

Advertisement

సాధారణంగా వంటింట్లో తాలింపుల ఘాటు, నూనె వాసనలు ఎక్కువ. వంటగది నుంచి వచ్చే ఈ జిడ్డు పొగ ఇళ్లంతా తిరిగి ఏసీ లోపలికి వెళ్లిపోతుంది. ఈ జిడ్డుకు దుమ్ము తోడై ఫిల్టర్ల మీద ఒక బంక పొరలా తయారవుతుంది. దీన్ని ఊరికే దులిపితే అస్సలు పోదు. అందుకే ఏసీ మూత తెరిచి, లోపల ఉండే నెట్ ఫిల్టర్లను బయటకు తీసి.. కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ లేదా షాంపూ వేసి గోరువెచ్చని నీటితో కడిగితే జిడ్డు వదిలిపోతుంది. ఈ ఫిల్టర్లు క్లీన్‌గా ఉంటేనే చల్లటి గాలి రూమ్‌లోకి వస్తుంది.

Also Read: మన ఏసీల వాడకం చూసి తెల్లబోయిన అమెరికా అమ్మడు.. ఇండియాకు, యూఎస్‌కు ఇంత తేడా ఉందా!

గాలి లీకేజులను గుర్తించాలి:

Advertisement

గది తలుపుల కింద లేదా కిటికీల సందుల నుంచి చల్లటి గాలి బయటకు లీక్ అవుతుంటే.. ఏసీ ఎంత తిరిగినా వేస్టే. తలుపు కింద చిన్న గ్యాప్ ఉన్నా కూడా ఏసీ గాలి పక్క బయటకు వెళ్లిపోతుంది. అందుకే ఒక పాత టవల్‌ను చుట్టి ఆ సందుల్లో పెట్టేయండి లేదా డోర్ బాటమ్ సీల్స్ వాడండి. అలాగే పగటిపూట ఎండ నేరుగా గదిలోకి రాకుండా లావుపాటి తెరలు (కర్టెన్లు) వేస్తే, ఎండ వేడికి లోపల ఫ్లోరింగ్ వేడెక్కకుండా ఉంటుంది.

స్టెబిలైజర్ వోల్టేజ్‌పై ఓ కన్నేయండి:

కొన్నిసార్లు ఏసీ ఆన్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కానీ చల్లదనం రాదు. ఎండలు ముదిరినప్పుడు మాత్రమే అందరూ ఏసీలు ఆన్ చేయడం వల్ల వోల్టేజ్ పడిపోతుంటుంది. తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు ఏసీలోని కంప్రెషర్ ఆన్ కాదు. అది కేవలం ఫ్యాన్ లాగా మాత్రమే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి స్టెబిలైజర్‌లో అవుట్‌పుట్ లైట్ స్థిరంగా ఉందో లేదో వోల్టేజ్ తక్కువగా చూపిస్తోందో ఒకసారి చెక్ చేసుకోండి. ఏసీకి మంచి క్వాలిటీ స్టెబిలైజర్ ఉండటం చాలా ముఖ్యం.

ఫ్యాన్ స్పీడ్‌లో పెడుతున్నారా?

చాలామంది ఏసీ టెంపరేచర్ 18 డిగ్రీల్లో పెట్టేసి, ఫ్యాన్ స్పీడ్‌ను మాత్రం తక్కువలో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల చల్లటి గాలి గది మొత్తం స్ప్రెడ్ అవ్వదు. రూం అంతా సమానంగా చల్లబడాలంటే ఫ్యాన్ స్పీడ్‌ను ఎప్పుడూ హైలో ఉంచాలి. అలాగే ఏసీ రెక్కలను నేరుగా మొహం మీదికి కాకుండా పైకప్పు (సీలింగ్) వైపునకు తిప్పాలి. చల్లటి గాలి బరువుగా ఉండి సహజంగానే కిందకు దిగుతుంది కాబట్టి.. గది అంతా త్వరగా కూల్ అవుతుంది.

రిమోట్ మోడ్ వెరిఫికేషన్:

ఒక్కోసారి ఇంట్లో పిల్లలు తెలియక రిమోట్‌లో వేరే బటన్ నొక్కడం వల్ల కూలింగ్ ఆగిపోవచ్చు. అందుకే రిమోట్ స్క్రీన్ మీద ఎప్పుడూ Snowflake గుర్తు లేదా Cool మోడ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పొరపాటున డ్రై (వాటర్ డ్రాప్ గుర్తు) లేదా ఫ్యాన్ మోడ్‌లో పడితే కంప్రెషర్ ఆగిపోతుంది. ఒకవేళ ఏసీ సాఫ్ట్‌వేర్ ఏవైనా హ్యాంగ్ అయినట్టు అనిపిస్తే.. రిమోట్‌లోని బ్యాటరీలను ఒక 30 సెకన్ల పాటు తీసి మళ్లీ వేయాలి. అప్పుడు రిమోట్ రీసెట్ అయ్యి ఏసీ పాత పద్ధతిలో కూలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది.

Also Read: ఎండల ధాటికి పేలుతున్న ఫ్రిడ్జ్‌లు.. ఈ సౌండ్స్ వస్తే జాగ్రత్త, లేదంటే బ్లాస్టే!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×