E-Paper
Advertisement

లక్షల టన్నుల వరి కుప్పలు.. వాతావరణం మారితే రైతుల పరిస్థితి ఏంటి..?

లక్షల టన్నుల వరి కుప్పలు.. వాతావరణం మారితే రైతుల పరిస్థితి ఏంటి..?
Advertisement

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: జిల్లాలోని రా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని దించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని రా రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి వారి మిల్లులలో వరి ధాన్యాన్ని దించుకోవడంపై సమీక్షించారు.

గ్రామాల వారీగా..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈసారి రబీ సీజన్లో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరిధాన్యం పండిందని వాటిలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇప్పటికే 1లక్షా 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని రేపట్లోగా మరొక 20 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని తెలిపారు. వాతావరణం అనుకూలించి అధికంగా ధాన్యం దిగుబడి వచ్చిందని అన్నారు. గ్రామాల వారీగా రైస్ మిల్లుల వారిగా ధాన్యాన్ని కేటాయిస్తామని జిల్లాలోని రా రైస్ మిల్లర్లు వారి మిల్లులో 40 శాతం కెపాసిటీతో మొత్తం 1లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని సూచించారు.

Advertisement

Also read: బెంగాల్‌లో బీజేపీ సంచలనం.. ఇమామ్‌ల వేతనాలు రద్దు.. దీదీ అవినీతిపై విచారణ!

సన్న రకం వరి..

రానున్న ఖరీఫ్ సీజన్లో జిల్లాలో అధిక శాతం సన్న రకం వరి ధాన్యాన్ని రైతులతో పండించేందుకు ప్రభుత్వ ఆదేశాలు మేరకు రైతులను మోటివేట్ చేస్తున్నామని మిల్లర్లు కూడా రైతులకు సన్న రకం వరి ధాన్యాన్ని పండించడంపై చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ గోపికృష్ణ, రా రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారి జారీ చేయనైనది.

Advertisement

Also read: మెదక్ జిల్లాలో తుది ఓటర్ల జాబితా విడుదల

Related News

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

Big Stories

Advertisement
×