E-Paper
Advertisement

Amazon Echo Show: మాట్లాడక్కర్లేదు.. సైగ చేయక్కర్లేదు.. మీ రాకను గుర్తించి చక చకా పనులు చేసే అమెజాన్ కొత్త డివైజ్!

Amazon Echo Show: మాట్లాడక్కర్లేదు.. సైగ చేయక్కర్లేదు.. మీ రాకను గుర్తించి చక చకా పనులు చేసే అమెజాన్ కొత్త డివైజ్!
Advertisement

Amazon Echo Show: ఇల్లు కేవలం నాలుగు గోడల మధ్య ఉండే ఓ ప్రపంచం మాత్రమే కాదు.. అది మన సౌకర్యానికి, మనసుకి దొరికే ప్రశాంతతకు నిలయం. ఇప్పుడు ఆ ప్రశాంతతను, సౌకర్యాన్ని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన అద్భుతమైన స్మార్ట్ డిస్‌ప్లేలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. Echo Show 11, నాలుగో తరం Echo Show 8 అనే ఈ డివైజ్‌లు కేవలం గ్యాడ్జెట్లు మాత్రమే కాదు.. ఇంటి పనులను చక్కబెట్టే మంచి నేస్తాలు కూడా.

ఈ డివైజ్‌లలో అధునాతన ఓమ్నీసెన్స్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణ నిలుస్తోంది. దీనిలో వాడిన AZ3 ప్రో కస్టమ్ సిలికాన్ చిప్ సహాయంతో పరికరాలు మన ఉనికిని పసిగట్టగలవు. అంటే.. మీరు గదిలోకి రాగానే.. ఆటోమేటిక్‌గా లైట్లు ఆన్ చేయడం లేదా గది ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దానంతట అదే ఏసీని ఆన్ చేయడం వంటి స్మార్ట్ పనులను చేస్తాయన్నమాట. వినియోగదారుడు చెప్పకపోయినా.. గదిలోని పరిస్థితులకు అనుగుణంగా ఈ గ్యాడ్జెట్స్ స్పందిస్తాయి.

Advertisement

Also Read: ఎట్టకేలకు వాట్సాప్ వెబ్ యూజర్ల కోరిక నెరవేరబోతోంది.. ఇక బ్రౌజర్ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!

ప్రీమియం డిజైన్, అద్భుతమైన విజువల్స్ కలిగి ఉన్న వీటి డిజైన్ విషయానికి వస్తే.. ఎకో షో 11లో 11 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్ ఉండగా, ఎకో షో 8లో 8.7 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్ ఇచ్చారు. ఎడ్జ్‌ టు ఎడ్జ్ గ్లాస్ డిజైన్, 3D నిట్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ వీటిని చూడగానే ఆకట్టుకునేలా చేస్తాయి. రూంలోని లైటింగ్‌కు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను మార్చుకునే అంబియంట్ విజువల్స్ ఫీచర్ వల్ల కళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రైమ్ వీడియో లేదా నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

Advertisement

అమెజాన్ ఈసారి ఆడియో క్వాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫ్రంట్ ఫైరింగ్ స్టీరియో స్పీకర్లు, కస్టమ్ వూఫర్ సహాయంతో స్పేషియల్ ఆడియో అనుభూతిని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే వీడియో కాలింగ్ కోసం 13 మెగాపిక్సెల్ కెమెరాను ఈ డివైజుల్లో అమర్చారు. అలాగే ఆటో ఫ్రేమింగ్ టెక్నాలజీ వల్ల మీరు కదులుతున్నా కెమెరా మిమ్మల్ని స్క్రీన్ మధ్యలోనే ఉంచుతుంది. ప్రైవసీ కోరుకునే వారి కోసం ఫిజికల్ కెమెరా షట్టర్, మైక్ ఆఫ్ బటన్లు కూడా ఉన్నాయి.

ఇకపోతే.. ఎకో షో 11 ధర రూ.26,999 ఉండగా, ఎకో షో 8 ధర రూ.23,999గా నిర్ణయించారు. ఇవి గ్రాఫైట్, గ్లేసియర్ వైట్ రంగుల్లో లభిస్తాయి. ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్లతో పాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి ప్రముఖ రిటైల్ స్టోర్లలోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు. భవిష్యత్తులో రాబోయే అమెజాన్ Alexa+ ఏఐ అసిస్టెంట్‌కు కూడా ఇవి పూర్తిస్థాయిలో సపోర్ట్ ఇస్తాయని అమెజాన్ చెబుతోంది.

Also Read: ఛార్జింగ్‌ కష్టాలకు చెక్.. ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్‌నూ ఛార్జ్ చేసే ఉగ్రీన్ పవర్ బ్యాంక్ ఫీచర్లు ఇవే!

 

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×