E-Paper
Advertisement

Attack On Karate Kalyani: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల భారీ మోసం…. కరాటే కళ్యాణిపై దాడి.. ఎందుకంటే?

Attack On Karate Kalyani: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల భారీ మోసం…. కరాటే కళ్యాణిపై దాడి.. ఎందుకంటే?
Advertisement

Attack On Karate Kalyani: హైదరాబాద్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పేరుతో సాగుతున్న భారీ మోసాన్ని బట్టబయలు చేసే క్రమంలో సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణిపై దాడి యత్నం జరిగింది. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది.

టీటీడీలో లక్కీ డ్రా పేరుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భారీ మోసానికి తెరలేపారు. కేవలం ₹399 కడితే ఫార్చ్యూనర్ కార్, ఐఫోన్, టీవీ, బైక్ వంటివి గెలుచుకోవచ్చంటూ సామాన్య ప్రజల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

ఆదిభట్ల వండర్లా సమీపంలో నిందితులు ఈ లక్కీ డ్రా ప్రచారం నిర్వహిస్తుండగా, కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసుల సహాయంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. నిందితులను పట్టుకునే క్రమంలో వారు కళ్యాణిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. ఈ పెనుగులాటలో నిందితులు ఆమె చున్నీని లాగడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తమ మోసపూరిత ప్రచారం కోసం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు నిందితులు టీటీడీ ఆలయ పరిసరాలను, పేరును వాడుకోవడం గమనార్హం. ఈ ఘటనపై కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ అనే ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ 318(4) (మోసం) మరియు ఐటీ చట్టం 2008 సెక్షన్ 66 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Read Also: కేటీఆర్‌కు లొట్టపీసు తప్ప ఏమీ తెలియదు..  పీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!

Tags

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×