E-Paper
Advertisement

Ugreen MagFlow Qi2: ఛార్జింగ్‌ కష్టాలకు చెక్.. ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్‌నూ ఛార్జ్ చేసే ఉగ్రీన్ పవర్ బ్యాంక్ ఫీచర్లు ఇవే!

Ugreen MagFlow Qi2: ఛార్జింగ్‌ కష్టాలకు చెక్.. ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్‌నూ ఛార్జ్ చేసే ఉగ్రీన్ పవర్ బ్యాంక్ ఫీచర్లు ఇవే!
Advertisement

Ugreen MagFlow Qi2: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా గడవదు. కానీ, బయటకు వెళ్లినప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంటే వచ్చే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు మన ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను ఫాస్ట్‌గా ఛార్జ్ చేసే ఒక మంచి పవర్ బ్యాంక్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంటుంది కదా. అందుకే ప్రముఖ యాక్సెసరీస్ బ్రాండ్ Ugreen మార్కెట్లోకి ‘MagFlow Qi2 పవర్ బ్యాంక్’ ను తీసుకొచ్చింది. ఇప్పుడీ సూపర్ గ్యాడ్జెట్ యొక్క ఫీచర్లు, ధర, పూర్తి వివరాలు తెలుసుకుందాం.

20,000mAh బ్యాటరీ సామర్థ్యం:

సాధారణంగా పవర్ బ్యాంకులు అంటే.. స్లోగా ఛార్జ్ అవుతాయని మనందరికీ తెలుసు. కానీ ఉగ్రీన్ తెచ్చిన ఈ కొత్త మోడల్ ఏకంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీంతో ఫోన్‌నే కాదు, ఏకంగా మ్యాక్‌బుక్ ఎయిర్‌ను కూడా చాలా త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. 20,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న ఈ పవర్ బ్యాంక్‌తో మీ ఐఫోన్ 17ను ఏకంగా 3.7 సార్లు, మ్యాక్‌బుక్ ఎయిర్‌ను 1.2 సార్లు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చన్నమాట.

Advertisement

Also Read: డీఎస్‌ఎల్‌ఆర్ క్వాలిటీ ఫోన్ కావాలా? వివో X300 సిరీస్‌పై క్రేజీ డిస్కౌంట్, కెమెరా లవర్స్‌కు పండగే!

వైర్లు ఉండవు.. స్లాండ్ అక్కర్లేదు:

ఈ పవర్ బ్యాంక్ స్పెషాలిటీ ఏంటంటే.. దీనిలో Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. దీనివల్ల వైర్లు లేకుండానే 25W వేగంతో మీ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే బిల్ట్ ఇన్ మాగ్నెట్స్ ఉండటం వల్ల ఫోన్‌ను గట్టిగా పట్టుకుంటుంది. దీంతో పడిపోతుంది, జారుతుంది అనే దిగులు ఉండదు. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే.. దీనికి ఒక చిన్న మడతపెట్టే స్టాండ్ కూడా ఉంది. ఫోన్ ఛార్జ్ అవుతుండగానే మీరు సినిమా లేదా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.

స్టైలిష్ డిజైన్.. స్మార్ట్ డిస్‌ప్లే:

Advertisement

ఈ MagFlow Qi2 పవర్ బ్యాంక్ చూడటానికి చాలా సన్నగా, స్టైలిష్‌గా ఉంటుంది. దీనిలో ఒక స్మార్ట్ డిస్‌ప్లే కూడా ఇచ్చారు. మీ పవర్ బ్యాంక్‌లో ఇంకా ఎంత ఛార్జింగ్ మిగిలి ఉంది? మీ డివైజ్ ఎంత స్పీడ్‌తో ఛార్జ్ అవుతోంది? వంటి వివరాలన్నీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తాయి. దీనికి ఇన్‌బిల్ట్ USB-C కేబుల్ కూడా ఉండటంతో వైర్లను విడిగా క్యారీ చేయాల్సిన అవసరం లేదు.

ధర ఎంతంటే?

ఇంత రేంజ్ ఫీచర్లు ఉన్న ఈ Ugreen MagFlow Qi2 ధర సుమారు రూ.5,838. దీనిని మీరు ఉగ్రీన్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమేజాన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. క్వాలిటీ, స్పీడ్ కోరుకునే వారికి MagFlow Qi2 పవర్ బ్యాంక్ మంచి ఎంపిక అనే చెప్పాలి.

Also Read: ఎట్టకేలకు వాట్సాప్ వెబ్ యూజర్ల కోరిక నెరవేరబోతోంది.. ఇక బ్రౌజర్ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!

 

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×