E-Paper
Advertisement

రూ.8,999 నుంచే స్మార్ట్‌‌ఫోన్లు.. Amazon Saleలో ఏఐ ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్లు!

రూ.8,999 నుంచే స్మార్ట్‌‌ఫోన్లు.. Amazon Saleలో ఏఐ ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్లు!

Amazon Mega Deal Days 2026: ఎప్పటినుంచో తక్కువ బడ్జెట్‌లో మంచి గ్యాడ్జెట్ కొందామనుకునే వారికి అమెజాన్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. Mega Deal Days పేరుతో సరికొత్త సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. జూన్ 9వ తేదీ వరకు నడిచే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్స్‌పై ఊహకు అందని తగ్గింపులు లభిస్తున్నాయి. టాప్ బ్రాండ్ల ప్రొడక్టులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ ఫోన్లు:

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పుడు సరికొత్త మోడళ్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఫోన్ కావాలనుకునే వారి కోసం Lava Bold N2
కేవలం రూ.8,899కే అందుబాటులో ఉంది. అలాగే పెద్ద బ్యాటరీని ఇష్టపడే వారి కోసం Realme Narzo 90X ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఇవే కాకుండా iQoo Z11X, Samsung Galaxy M56 మోడల్స్ కూడా ఆకర్షణీయమైన ధరలకే దొరుకుతున్నాయి.

మిడ్ రేంజ్, ప్రీమియం మొబైల్స్:

కొంచెం ఎక్కువ ఫీచర్లు, మంచి కెమెరా ఆశించే వారికి OnePlus Nord Series ఫోన్లు మంచి ఆప్షన్‌గా మారాయి. ముఖ్యంగా OnePlus Nord CE6 Lite, Oppo F31 వంటి మోడళ్లు మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో సూపర్ ఫీచర్లతో లభిస్తున్నాయి. ఇక ప్రీమియం ఫోన్ల విషయానికొస్తే.. Samsung Galaxy S25 Ultra, S26 Ultra వంటి ఖరీదైన ఫోన్లపై కూడా అమెజాన్ క్రేజీ ఆఫర్లను ఇస్తోంది. దీంతో పాటు IQOO 15R ఫోన్ కూడా స్లిమ్ డిజైన్‌తో తక్కువ ధరకే వస్తోంది.

Also Read: యూజర్లకు షాకిచ్చిన షియోమీ.. భారత్‌లో పెరిగిన Xiaomi Pad 8 ధరలు, కొత్త రేట్లు ఇవే!

ఆఫీస్, గేమింగ్ లాప్‌టాప్‌లు:

విద్యార్థులకు, ఆఫీస్ ఉద్యోగులకు ఉపయోగపడేలా Dell, Acer, HP బ్రాండ్ల లాప్‌టాప్‌లు డిస్కౌంట్ ధరకు దొరుకుతున్నాయి. Asus VivoBook, HP OmniBook వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్న ఏఐ లాప్‌టాప్‌లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. గేమింగ్ ప్రియుల కోసం Asus Tough A15, Dell G-Series లాప్‌టాప్‌లు పవర్‌ఫుల్ గ్రాఫిక్స్ కార్డులతో ప్రత్యేకమైన ఆఫర్ ధరల్లో అందుబాటులో ఉంచారు.

పెద్ద డిస్‌ప్లేతో సరికొత్త టాబ్లెట్లు:

ఆన్‌లైన్ క్లాసులు వినడానికి లేదా సినిమాలు చూడటానికి టాబ్లెట్ కొనాలనుకునే వారికి కూడా ఈ సేల్ లో మంచి డీల్స్ ఉన్నాయి. OnePlus Pad Lite, Redmi Pad 2 వంటివి బడ్జెట్ ధరలోనే పెద్ద స్క్రీన్‌తో లభిస్తున్నాయి. వీటితో పాటు OnePlus Pad Go 2, Xiaomi Pad 8 వంటి మోడళ్లు మంచి బ్యాటరీ లైఫ్‌తో ఆఫర్‌లో ఉన్నాయి. మరింత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం OnePlus Pad 4ను కూడా కొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్‌వాచ్‌లు, ఆడియో గ్యాడ్జెట్లు:

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారి కోసం Pebble Core Fitness Band, Huawei Band 10, Samsung Galaxy Watch 6 Classic వంటివి ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నాయి. ఇక సంగీత ప్రియుల కోసం బోట్ నిర్వాణ Zenith Pro, Realme Buds Air 8 earbudsతో పాటు JBL, Philips బ్రాండ్ల బ్లూటూత్ స్పీకర్లు, సౌండ్‌బార్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ ద్వారా కొనేవారికి అదనంగా రూ.6,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Also Read: డేగ కళ్లతో రక్షణ కల్పించే AI కెమెరాలు.. మనుషులు, వాహనాలను ఇట్టే గుర్తించే స్మార్ట్ టెక్నాలజీ!

Related News

యూజర్లకు షాకిచ్చిన షియోమీ.. భారత్‌లో పెరిగిన Xiaomi Pad 8 ధరలు, కొత్త రేట్లు ఇవే!

బస్ స్టాప్‌లలో ఇక ఏసీ ఫీలింగ్.. సరికొత్త టెర్రాకోట టెక్నాలజీ వచ్చిందోచ్!

డేగ కళ్లతో రక్షణ కల్పించే AI కెమెరాలు.. మనుషులు, వాహనాలను ఇట్టే గుర్తించే స్మార్ట్ టెక్నాలజీ!

రోబోట్ క్లీనర్ నుండి స్మార్ట్ ప్లగ్ వరకు.. ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన బెస్ట్ అలెక్సా డివైజెస్!

ఐఫోన్ Vs ఆండ్రాయిడ్.. ప్రైవసీ విషయంలో ఏది సేఫ్? కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు!

Galaxy S25 సిరీస్ ఫోన్లలో అండ్రాయిడ్ 17, One UI 9 టెస్టింగ్ షురూ చేసిన శాంసంగ్!

Tecno Pova 8 లాంచ్ డేట్ లీక్.. 8000mAh బ్యాటరీతో బడ్జెట్ ఫోన్లకు టఫ్ కాంపిటీషన్!

Big Stories

×