E-Paper
Advertisement

ఇంగ్లీష్ ఇర‌గ‌దీసిన రేవంత్‌! త‌డ‌బ‌డ‌కుండా.. సూటిగా! పాల‌న‌పై త‌న‌దైన మార్కును వివ‌రించిన సీఎం!

ఇంగ్లీష్ ఇర‌గ‌దీసిన రేవంత్‌! త‌డ‌బ‌డ‌కుండా.. సూటిగా! పాల‌న‌పై త‌న‌దైన మార్కును వివ‌రించిన సీఎం!
Advertisement

మ‌న సీఎంకు ఇంగ్లీష్ రాదు.. రాదు..! అని గేలి చేసే బీఆరెస్ టీం ఓసారి ది హిందూ హ‌డిల్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం చూస్తే బాగుంటుంది. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల పాలన: తెలంగాణకు మంచి పాలన‌.. అనే అంశంపై ఆయ‌న‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. చాలా అంశాలు మ‌నం విన్న‌వే. ప‌లు వేదిక‌ల మీద ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు ఆయ‌న వివ‌రించిన‌వే. కానీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఇంగ్లీష్‌లో ఆయనిచ్చిన స‌మాధానాలు చాలా క్లారిటీగా ఉన్నాయి. చిన్న‌గా, సుతిమెత్త‌గా, అర్థ‌వంతంగా ఆయ‌న మాట్లాడిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది.

అంద‌రికీ అర్థ‌మ‌య్యే విధంగా ఆయ‌న వివ‌రించిన తీరు కూడా బాగుంది. నాకు బాగా ఇంగ్లీషు వ‌చ్చు.. అనే డాంబికం ఆయ‌న మాట‌ల్లో, వ్య‌వ‌హార శైలిలో క‌నిపించ‌లేదు. నిమ్మ‌ళంగా, నిశ్చ‌లంగా .. న‌వ్వు ముఖంతో ఆయ‌న త‌న‌ను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సూటిగా జవాబిచ్చారు. అతిథుల చేత చ‌ప్ప‌ట్లు కొట్టించుకున్నారు. త‌ను గ‌త పాల‌కుల మాదిరిగా సీఎం అనే అహంకారాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేద‌ని, సేవ‌కుడిగానే ప‌నిచేస్తూ వ‌స్తున్నాన‌నే త‌న‌దైన మార్కు డైలాగులు కూడా చెప్పారు సీఎం రేవంత్‌. ప్ర‌భుత్వ స్కీముల‌ను వివ‌రించారు.

Advertisement

మోడీ విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. మ‌హిళా రిజర్వేష‌న్ విష‌యంలో మొన్న మోడీ అనుస‌రించిన విధానంలో ఉన్న లోపాయికారి రాజ‌కీయ కుట్రను మ‌రోసారి ఈ వేదిక‌గా వివ‌రించారు. త‌న ప్ర‌స్థానాన్ని క్షుప్లంగా వివ‌రించిన ఆయ‌న‌.. అప్ప‌టికే బీఆరెస్ పాల‌న‌పై, కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తితో జ‌నం ఉన్నార‌ని తెలుసుకున్నాన‌న్నారు. ఎల్ల‌ప్పుడూ జ‌నంలో ఉండే త‌న‌కు ఇక్క‌డి యువ‌త ఏం కోరుకుంటున్న‌దో బాగా తెలుసున‌న్నారు.

ప్ర‌ధానంగా అప్పుడు, ఇప్పుడు తెలంగాణ ఉద్య‌మం వ‌చ్చిందే ఉద్యోగాల కోస‌మ‌ని త‌ను గ్ర‌హించాన‌న్నారు. బీఆరెస్ పాల‌న ఇందులో విఫ‌ల‌మైంద‌ని, తాను సీఎంగా అయిన త‌రువాత ప్ర‌ధానంగా దీనిపైనే దృష్టి పెట్టాన‌ని వివ‌రించారు. హైడ్రా ఉద్దేశ్య‌మేందో.. దాని పనిత‌నం.. ఫ‌లితం ఎలా ఉందో వివ‌రించారు. మొత్తంగా సీఎం ఇంగ్లీష్‌లో ఇచ్చిన ఈ సుధీర్ఘ‌మైన ఇంట‌ర్వ్యూ ద్వారా…. సంక్షిప్తంగానే అన్ని విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. ప్ర‌భుత్వ పాల‌న ఎలా ఉందో అంద‌రికీ వివ‌రించేందుకు చేసే ప్ర‌య‌త్నం బాగుంద‌నే ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

Related News

ఆరునూరైనా కేసీఆర్ సీఎం.. పోలీసుల తోలుతీసే ప‌నిపైనే మొద‌టి సంత‌కం..!

రైతుబీమా ప‌థ‌కం ఉందా? లేదా? హ‌రీశ్‌, కేటీఆర్ త‌లోమాట‌..!

వెల‌మ‌- రెడ్ల పంచాది.. నీదే జాతన్న సీఎంకు కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్‌!

56 ఇంచుల ఛాతి.. 56 ఏళ్ల యువ‌కుడు… మ‌ధ్య‌లో జెన్‌-జీ కాక్రోచ్‌!

భేష్‌.. ఫండ్ పైస‌లు పంపిణీ.. బీఆరెస్ పార్టీ ఫండ్ నుంచి బాధిత రైతుల‌కు భ‌రోసా..

తెగేదాక లాగ‌క‌పోవ‌డ‌మే మేలు..70వేల ఉద్యోగాల‌పై కేటీఆర్ వ్యూహంలో చిక్కుకున్న‌ కాంగ్రెస్!

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

Big Stories

Advertisement
×