E-Paper
Advertisement

యూజర్లకు షాకిచ్చిన షియోమీ.. భారత్‌లో పెరిగిన Xiaomi Pad 8 ధరలు, కొత్త రేట్లు ఇవే!

యూజర్లకు షాకిచ్చిన షియోమీ.. భారత్‌లో పెరిగిన Xiaomi Pad 8 ధరలు, కొత్త రేట్లు ఇవే!
Advertisement

Xiaomi Pad 8 Price Hike: భారతదేశంలో టాబ్లెట్ ప్రియులకు ప్రముఖ టెక్ సంస్థ షియోమీ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నెలలో మార్కెట్లోకి తీసుకొచ్చిన తన సరికొత్త Xiaomi Pad 8 ధరలను కంపెనీ సైలెంట్‌గా పెంచేసింది. మార్కెట్లోకి వచ్చిన కొన్ని నెలల్లోనే దీనిపై ఏకంగా రూ.2,000 వరకు ధర పెరగడం గమనార్హం. అన్ని వేరియంట్లపై ఈ పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో చిప్స్ కొరత, విడిభాగాల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

కొత్త ధరల వివరాలు ఇలా..

ధరల పెంపు తర్వాత ఈ టాబ్లెట్ కొనుగోలు చేయాలనుకునే వారు మరింత అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రారంభ మోడల్ అయిన 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.33,999 ఉండగా, ఇప్పుడు దాని ధర రూ.35,999కి చేరింది.

Advertisement

అలాగే టాప్ ఎండ్ మోడల్ అయిన 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999 నుండి రూ.38,999కి పెరిగింది. ఒకవేళ ఈ టాప్ వేరియంట్‌ను షియోమీ ఫోకస్ పెన్ ప్రో స్టైలస్‌తో కలిపి తీసుకోవాలనుకుంటే.. పాత ధర రూ.41,999కి బదులుగా ఇప్పుడు రూ.43,999 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: డేగ కళ్లతో రక్షణ కల్పించే AI కెమెరాలు.. మనుషులు, వాహనాలను ఇట్టే గుర్తించే స్మార్ట్ టెక్నాలజీ!

నానో టెక్స్చర్ డిస్‌ప్లే మోడల్స్ ధరలు:

Advertisement

Xiaomi Pad 8లో ప్రత్యేకంగా తీసుకొచ్చిన నానో టెక్స్చర్ డిస్‌ప్లే (యాంటీ గ్లేర్) వేరియంట్ ధరలు కూడా పెరిగాయి. దీని 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.38,999 నుండి రూ.40,999కి పెరిగింది.

ఇదే మోడల్‌ను ఫోకస్ పెన్ ప్రో యాక్సెసరీతో కలిపి కొనుగోలు చేస్తే.. ఇప్పుడు దాని ధర రూ.45,999గా మారింది. ఈ పెరిగిన కొత్త ధరలన్నీ ఇప్పటికే షియోమీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

టాబ్లెట్ అదిరిపోయే ఫీచర్లు ఇవే:

ధర పెరిగినప్పటికీ ఈ టాబ్లెట్ ఫీచర్లు మాత్రం యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇది షియోమీ హైపర్‌ఓఎస్ 3 పై పనిచేస్తుంది. దీనిలో 11.2 అంగుళాల పెద్ద స్క్రీన్, 144Hz రీఫ్రెష్ రేట్ వంటి అధునాతన డిస్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి.

పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో వచ్చే ఈ టాబ్లెట్‌లో 9,200mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక ఫొటోల కోసం 13MP బ్యాక్ కెమెరా, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. దీనికి కీబోర్డ్ కనెక్ట్ చేసుకుని ల్యాప్‌టాప్‌లా కూడా వాడుకోవచ్చు.

Also Read: రోబోట్ క్లీనర్ నుండి స్మార్ట్ ప్లగ్ వరకు.. ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన బెస్ట్ అలెక్సా డివైజెస్!

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×