E-Paper
Advertisement

Amazon Offers: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. ఏకంగా రూ.20వేల తగ్గింపుతో శామ్‌సంగ్ ఫోన్ మీ చేతిలోకి..

Amazon Offers: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. ఏకంగా రూ.20వేల తగ్గింపుతో శామ్‌సంగ్ ఫోన్ మీ చేతిలోకి..
Advertisement

Amazon Offers: అమెజాన్ భారతదేశంలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉపయోగించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, మొబైల్ ఫోన్ల విషయంలో అమెజాన్ తరచూ మంచి ఆఫర్లు ప్రకటిస్తుంది. సాధారణంగా 5 వేల, 10 వేల తగ్గింపులు కనిపిస్తాయి కానీ ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. కొన్ని ఫోన్లపై ఏకంగా 20 వేల వరకు ధర తగ్గించడంతో వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది. మొబైల్ కొనాలనుకునే వారు ఇప్పుడు ఈ ఆఫర్లు నిజంగా ఎంతవరకు ప్రయోజనకరమో తెలుసుకోవడానికి అమెజాన్‌ను చెక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శామ్‌సంగ్ ఎ55 5జి, ఎ35 5జి ఫోన్ల ధరల్లో వచ్చిన మార్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ55 5జి ఫోన్‌ పై ఆఫర్ ..

Advertisement

మొదటిగా శామ్‌సంగ్ గెలాక్సీ ఎ55 5జి ఫోన్‌ను తీసుకుంటే, అమెజాన్‌లో ఈ ఫోన్ యొక్క అసలు ధరను 45,999 రూపాయలుగా చూపిస్తున్నారు. ఇదే ధరకు పక్కనే వారు ఆఫర్ ధరను 25,999 రూపాయలుగా హైలైట్ చేస్తున్నారు. అంటే నేరుగా చూసుకున్నా ఈ ఫోన్ మీద దాదాపు 20,000 రూపాయలకు పైగా తగ్గింపు చూపిస్తున్నారు. అమెజాన్‌లో 43శాతం అని చూపించే తగ్గింపు కూడా అదే ఆధారంగా. ముఖ్యంగా 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్ ఉన్న వేరియంట్‌కి మాత్రమే ఈ భారీ తగ్గింపు వర్తిస్తుంది. అన్ని పన్నులతో సహా అని రాసి ఉండటం వలన ఇది ఫైనల్ అమౌంట్ అని నమ్మకంగా చెప్పొచ్చు.

బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయా?

Advertisement

ఇంకా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ఉన్న వాళ్లకి అదనంగా 779 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. అంటే ఆఫర్ ధర 25,999 రూపాయలే అయినా, నీ మొత్తం ఖర్చు ఇంకా కొంచెం తగ్గుతుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా 1,260 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఇలా కనిపించే అన్ని ధరలు ప్రధానంగా ఈ ఒకే వేరియంట్‌కి వర్తిస్తాయి. ఈ నెలలో ఈ ఫోన్‌ను 3,000 మందికి పైగా కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అంటే ఆఫర్ ఎక్కువ మంది వాడుకున్నారని అర్థం.

Also Read: Jio Offer: రూ.35వేల విలువైన జెమినీ ప్రో ప్లాన్ ఫ్రీ… జియో యూజర్లు ఈ ఆఫర్‌ మిస్ కావొద్దు..

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ35 5జి ఆఫర్ ఎంత?

ఇప్పుడు రెండో ఫోన్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎ35 5జి వద్దకు వస్తే, ఇది అమెజాన్‌లో అసలు ధరగా 33,999 రూపాయలు చూపిస్తుంది. కానీ ప్రస్తుత ఆఫర్ ధర మాత్రం 18,299 రూపాయలు. అంటే ఈ ఫోన్ మీద కూడా దాదాపు 15,700 రూపాయల తగ్గింపు పడుతోంది. అమెజాన్ దీనిని సుమారు 46శాతం డిస్కౌంట్‌గా చూపిస్తుంది. ఈ ఆఫర్ ముఖ్యంగా 8జిబి రామ్, 128జిబి స్టోరేజ్ వేరియంట్‌కి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఫోన్‌ను కూడా అన్ని పన్నులతో సహా అని రాసి ఉండటం వలన ధర పూర్తిగా కన్‌ఫర్మ్ అవుతుంది.

887 రూపాయల ఈఎంఐ అందుబాటులో

ఎ35 5జి ఫోన్ మీద కూడా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ వాడితే 548 రూపాయల క్యాష్‌బ్యాక్ వస్తుంది. అలాగే 887 రూపాయల ఈఎంఐ మొదలు పెట్టవచ్చు. ఇదీ బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి ఆఫర్ గా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్‌ని కూడా ఈ నెలలో 1,000 మందికి పైగా కస్టమర్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్?

ఇపుడు ఈ రెండు ఫోన్‌లను పోల్చుకుంటే, ఎ55 5జి మంచి వేరియంట్ కావడంతో తగ్గింపు ఎక్కువగా ఉంది. ఎ35 5జి మాత్రం మధ్య బడ్జెట్ రేంజ్‌లో వాడే ఫోన్ కాబట్టి తగ్గింపు కొంచెం తక్కువగా ఉన్నా, 18,299 రూపాయల వరకు తగ్గడం చాలా విలువైన డీల్ అనాలి. అమెజాన్ ఇచ్చే ధరలు హిస్టరీలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంటుందా?

అవును మీరు విన్నది నిజమే.. ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అమెజాన్ ఆఫర్ లో వున్నాయి. ఎవరైనా పాత ఫోన్ ఇచ్చి మరింత తగ్గింపు పొందాలని అనుకుంటే, ఎ55 కి 24,300 రూపాయల వరకూ, ఏ35 కి 17,000 రూపాయల వరకూ ఎక్స్‌చేంజ్ వాల్యూ అమెజాన్ చూపిస్తుంది. అయితే ఇది మీ పాత ఫోన్ మోడల్ ఇంకా దాని కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఎక్స్‌చేంజ్ లేకపోయినా ఆఫర్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. మొత్తం మీద ఈ రెండు ఫోన్ల అమెజాన్ ఆఫర్లు బాగా తగ్గించడంతో, కస్టమర్లు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×