E-Paper
Advertisement

Amazon Transformer Phone: మళ్లీ వచ్చేస్తోంది అమెజాన్ ట్రాన్స్‌ఫార్మర్.. ఈ ఏఐ ఫోన్‌లో యాప్స్ అక్కర్లేదు!

Amazon Transformer Phone: మళ్లీ వచ్చేస్తోంది అమెజాన్ ట్రాన్స్‌ఫార్మర్.. ఈ ఏఐ ఫోన్‌లో యాప్స్ అక్కర్లేదు!
Advertisement

Amazon Transformer Phone: దాదాపు పదేళ్ల క్రితం ‘ఫైర్ ఫోన్’తో మొబైల్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు సరికొత్త వ్యూహంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతతో మరో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘ట్రాన్స్‌ఫార్మర్’ అనే కోడ్ నేమ్‌తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించాలని అమెజాన్ భావిస్తోంది. ప్రముఖ టెక్ నిపుణుడు జె.అలార్డ్ నేతృత్వంలోని ‘జీరో వన్’ బృందం ఈ ఫోన్ బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: రూ.12 వేలకే 32 ఇంచుల TCL స్మార్ట్ టీవీ.. ఆఫర్ అయ్యేలోపే కొనేయండి భయ్యా!

అలెక్సా వాయిస్ మ్యాజిక్..

Advertisement

ఈ ఫోన్ పూర్తిగా అమెజాన్ ఎకోసిస్టమ్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఇందులో కీలక పాత్ర పోషించనుంది. స్టార్ ట్రెక్ సినిమాలో చూపించే కంప్యూటర్ లాగా, మనం చెప్పే పనులన్నింటినీ చిటికెలో చేసేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

యాప్స్ డౌన్లోండింగ్ అక్కర్లేదు..

అమెజాన్ తీసుకొస్తున్న ఈ సరికొత్త ఫోన్‌లో సాధారణ ఫోన్ల లాగా యాప్ స్టోర్ల నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదట. నేరుగా ఏఐ ద్వారానే పనులు పూర్తయ్యేలా ఈ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

షాపింగ్ మరింత సులభం..

Advertisement

ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వారికి ఈ అమెజాన్ ట్రాన్స్‌ఫార్మర్ ఫోన్ ఎంతో ఉపయోగకరం అని కంపెనీ చెబుతోంది. షాపింగ్ చేయడం, ప్రైమ్ వీడియో చూడటం, మ్యూజిక్ వినడం వంటి పనులను మరింత సులభతరం చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.

లాంచింగ్ ఎప్పుడంటే?

మినిమలిస్ట్ డిజైన్‌తో ఉండబోయే ఈ ఫోన్, అతి తక్కువ సమయంలో ఆర్డర్లు ఇచ్చేలా, అమెజాన్ సేవలను వేగంగా పొందేలా సహాయపడుతుంది. అయితే ఈ ఫోన్ ధర, విడుదల తేదీ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read: ఐఫోన్ రేంజ్ డిజైన్, పరవ్‌ఫుల్ బ్యాటరీ.. ‘రెడ్‌మి 15A 5G’ లాంచ్ ఎప్పుడంటే?

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×