E-Paper
Advertisement

Amazon offer: శామ్‌సంగ్ ఎం17 5జిపై రూ.4వేలు తగ్గింపు.. ఈఎంఐ కూడా కేవలం రూ.600 మాత్రమే

Amazon offer: శామ్‌సంగ్ ఎం17 5జిపై రూ.4వేలు తగ్గింపు.. ఈఎంఐ కూడా కేవలం రూ.600 మాత్రమే

Amazon offer: ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో కొత్త 5జీ ఫోన్ కొనాలి అంటే ధర కంటే ఆఫర్లు ముఖ్యంగా మారాయి. అమెజాన్‌లో ప్రస్తుతం శామ్‌సంగ్ గెలాక్సీ ఎం17 5జిపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సాధారణ ధర రూ.16,499 ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ.12,499కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.4,000 వరకు తగ్గింపు. అంతేకాదు నో కాస్ట్ ఈ ఎం ఐ సౌకర్యం కూడా ఉంది. నెలకు సుమారు రూ.600 నుంచి ఈ ఫోన్‌ని సులభంగా కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. అమెజాన్ పే ఐ సి ఐ సి ఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే అదనంగా క్యాష్‌బ్యాక్ కూడా వస్తోంది. బిజినెస్ కొనుగోలు దారులకు జి ఎస్ టి ఇన్వాయిస్ సౌకర్యం ఉండటంతో దాదాపు 18 శాతం వరకు సేవింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ధర రేంజ్‌లో ఇన్ని ఆఫర్లు కలసి రావడం నిజంగా పెద్ద ప్లస్ పాయింట్.

డిజైన్ – స్లిమ్ లుక్‌తో ప్రీమియం ఫీల్

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 17 ఫైవ్ జీ డిజైన్ చూస్తే ఇది మిడ్ రేంజ్ ఫోన్ అనిపించదు. కేవలం 7.5 ఎం ఎం మందంతో ఇది సామ్‌సంగ్ ఎం సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన అతి స్లిమ్ ఫోన్‌గా నిలుస్తుంది. మూన్‌లైట్ సిల్వర్ కలర్‌లో వచ్చే ఈ ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలా లైట్‌గా ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ముందు వైపు గోరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల రోజువారీ వాడకంలో స్క్రాచ్‌లు పడే టెన్షన్ తగ్గుతుంది. ఐపి 54 రేటింగ్ ఉండటంతో తేలికపాటి నీటి చుక్కలు, దుమ్ము వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ ధరలో ఇలాంటి డ్యూరబిలిటీ ఇవ్వడం సామ్‌సంగ్ నుంచి మంచి ప్రయత్నమే.

డిస్‌ప్లే – సూపర్ అమోలెడ్ మాయాజాలం

ఈ ఫోన్‌లో ఉన్న 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్‌తో 1080 x 2340 పిక్సెల్స్ క్లారిటీ కనిపిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. సినిమాలు చూడటం, యూట్యూబ్ స్ట్రీమింగ్ చేయడం, సోషల్ మీడియా వాడటం అన్నీ కూడా బ్రైట్ కలర్స్‌తో కళ్లకు హాయిగా ఉంటాయి. ఈ ధరలో ఎల్ సి డీ కాకుండా సూపర్ అమోలెడ్ ఇవ్వడం అంటే నిజంగా పెద్ద అడ్వాంటేజ్.

కెమెరా – ఓఐఎస్‌తో 50 మెగాపిక్సెల్ పవర్

కెమెరా విషయానికి వస్తే సామ్‌సంగ్ గెలాక్సీ ఎం17 5జీ మామూలుగా ఉండదు. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఓఐఎస్ సపోర్ట్‌తో వస్తుంది. దీని వల్ల ఫోటోలు షేక్ లేకుండా క్లియర్‌గా వస్తాయి. తక్కువ లైట్‌లో కూడా డీటెయిల్స్ బాగా క్యాప్చర్ అవుతాయి. దీనితో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. గ్రూప్ ఫోటోలు, ల్యాండ్‌స్కేప్ షాట్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా చిన్న డీటెయిల్స్‌ను దగ్గర నుంచి చూపిస్తుంది. ముందు వైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వీడియో రికార్డింగ్ ఫుల్ హెచ్ డీ 1920 x 1080 రిజల్యూషన్‌లో 30 ఎఫ్‌పిఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ఓ ఐ ఎస్ ఉండటం అంటే కెమెరా లవర్స్‌కు ఇది మంచి డీల్.

పర్‌ఫార్మెన్స్ – ఎక్సినోస్ ప్రాసెసర్‌తో స్టేబుల్ స్పీడ్

ఈ ఫోన్‌లో సామ్‌సంగ్ ఎక్సినోస్ 1330 ప్రాసెసర్ ఉపయోగించారు. ఆక్టా కోర్ సెటప్‌తో 2.4 గిగాహెర్ట్జ్ స్పీడ్ వరకు ఇది పని చేస్తుంది. 4 జీబి ర్యామ్, 128 జీబి స్టోరేజ్ కలయిక రోజువారీ వాడకానికి సరిపోతుంది. సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, లైట్ గేమింగ్ లాంటి పనుల్లో ఎలాంటి ల్యాగ్ అనిపించదు. అండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో 1యుఐ 7.0 అందుబాటులో ఉండటంతో సాఫ్ట్‌వేర్ అనుభవం క్లీన్గా ఉంటుంది.

Also Read: Jio Recharge Plan: వచ్చే ఏడాది వరకు రీఛార్జ్ అవసరం లేదు.. జియో కొత్త లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ఇదే

ఏఐ ఫీచర్స్ – స్మార్ట్‌గా వాడుకునే సౌలభ్యం

శామ్‌సంగ్ ఈ ఫోన్‌లో కొత్త తరం ఏ ఐ ఫీచర్స్ ఇచ్చింది. సర్కిల్ టు సెర్చ్ ద్వారా స్క్రీన్ మీద కనిపించే ఏ విషయాన్నైనా వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేయవచ్చు. జెమిని లైవ్ సపోర్ట్ ఉండటంతో వాయిస్ ఆధారంగా సమాచారం తెలుసుకోవడం మరింత ఈజీ అవుతుంది. ఇవన్నీ రోజువారీ వాడకాన్ని స్మార్ట్‌గా మార్చే ఫీచర్స్.

బ్యాటరీ – రోజు మొత్తం నడిచే పవర్

ఈ ఫోన్‌లో 5000mah బ్యాటరీ ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో సులభంగా ఒక రోజు పూర్తిగా నడుస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నా బాక్స్‌లో ఛార్జర్ ఇవ్వడం లేదు. అయినా టైప్ సి పోర్ట్ ద్వారా ఛార్జింగ్ స్పీడ్ బాగానే ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ – 6 ఏళ్ల భరోసా

ఈ సెగ్మెంట్‌లో అరుదుగా కనిపించే విషయం ఏంటంటే 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్, ఓ ఎస్ అప్‌డేట్స్ సపోర్ట్. దీని వల్ల ఈ ఫోన్ చాలా కాలం వరకు సేఫ్‌గా, అప్‌డేటెడ్‌గా వాడుకోవచ్చు. శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ, శామ్‌సంగ్ వాలెట్ ట్యాప్ అండ్ పే సపోర్ట్ లాంటి ఫీచర్స్ అదనపు భద్రతను ఇస్తాయి.

ఈ ఫోన్ మిస్ చేసుకోవద్దు

రూ.12,499 ధరలో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ఓఐ ఎస్ కెమెరా, గోరిల్లా గ్లాస్ విక్టస్, ఐపి 54 రేటింగ్, 6 ఏళ్ల అప్‌డేట్స్ లాంటి ఫీచర్స్ కలసి రావడం నిజంగా అరుదు. అమెజాన్ ఆఫర్లు, నో కాస్ట్ ఈ ఎం ఐ సౌకర్యంతో ఈ ఫోన్ ఇంకా ఆకర్షణీయంగా మారింది. మిడ్ రేంజ్‌లో నమ్మకమైన బ్రాండ్ ఫోన్ కావాలి అనుకునే వాళ్లకు సామ్‌సంగ్ గెలాక్సీ ఎం17 5జీ మంచి ఎంపికగా నిలుస్తుంది.

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×