E-Paper
Advertisement

Shamshabad Crime: శంషాబాద్‌లో దారుణం.. బైక్‌పై వెళ్తున్న యువకుడిపై కత్తితో దాడి..

Shamshabad Crime: శంషాబాద్‌లో దారుణం.. బైక్‌పై వెళ్తున్న యువకుడిపై కత్తితో దాడి..
Advertisement

Shamshabad Crime: శంషాబాద్‌లో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శంషాబాద్ మండలంలోని కవేలిగూడ సమీపంలో  అర్ధరాత్రి ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. బైక్‌పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడి చేసి హత్య చేసి పరారయ్యారని సమాచారం.

మృతుడిని మొయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మహేష్‌గా పోలీసులు గుర్తించారు. మహేష్ వ్యక్తిగత పనిమీద శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేష్‌కు ఒక వివాహిత మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి, కోపంతో హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తరువాతే వెల్లడిస్తామని తెలిపారు.

ఘటనా స్థలంలో క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం, నిందితుల కదలికలు వంటి అంశాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు శంషాబాద్ పోలీసులు తెలిపారు.

Advertisement

ఈ ఘటనతో వెంకటాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరుతున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ALSO READ:CP Sajjanar: తాగి దొరికితే 6 నెలలు జైలు శిక్ష.. మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×