E-Paper
Advertisement

Tata Harrier Petrol vs Diesel: టాటా హారియర్ పెట్రోల్ vs డీజిల్.. ఏది బెస్ట్? ఎందుకు?

Tata Harrier Petrol vs Diesel: టాటా హారియర్ పెట్రోల్ vs డీజిల్.. ఏది బెస్ట్? ఎందుకు?
Advertisement

వినియోగదారులను ఆకట్టుకునేలా అద్భుతమైన కార్లను తీసుకురావడంలో టాటా మోటార్స్ ముందుంటుంది. తమ కంపెనీ విడుదల చేసే కార్లు ప్రస్తుతం హైబ్రిడ్ వెర్షన్లలో అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా హారియర్ SUVకి పెట్రోల్ వేరియంట్‌ను పరిచయం చేసింది. ఇప్పటి వరకు డీజిల్ వెర్షన్ లో మాత్రమే ఉన్న ఈ ఫ్లాగ్‌ షిప్ SUVకి కొత్త 1.5L టర్బో పెట్రోల్ ఇంజన్ (Hyperion TGDi) యాడ్ చేసింది. మరింత స్మూత్, లో సౌండ్ తో క్రేజీ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తుంది. సిటీ డ్రైవింగ్‌ కు బెస్ట్. కొత్త ఫీచర్లతో పాటు ధర కూడా డీజిల్ కంటే కొంచెం తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది.

టాటా హారియర్ పెట్రోల్ vs డీజిల్ తేడాలు

⦿ ఇంజన్

పెట్రోల్ వెర్షన్:1.5లీటర్ హైపరియన్ టర్బో-GDI పెట్రోల్

Advertisement

డీజిల్ వెర్షన్: 2.0లీటర్ క్రయోటెక్ టర్బో డీజిల్

⦿ పవర్, టార్క్

పెట్రోల్ వెర్షన్:168-170 PS , 280 Nm

Advertisement

డీజిల్ వెర్షన్: 170 PS,350 Nm (70 Nm ఎక్కువ)

⦿ ట్రాన్స్‌ మిషన్

పెట్రోల్ వెర్షన్: 6-స్పీడ్ మాన్యువల్ లేదంటే ఆటోమేటిక్

డీజిల్ వెర్షన్: 6-స్పీడ్ మాన్యువల్ లేదంటే ఆటోమేటిక్

⦿ పెర్ఫార్మెన్స్

పెట్రోల్ వెర్షన్:  మరింత స్మూత్, రిఫైన్డ్, సిటీ డ్రైవ్‌కు బెస్ట్, క్విక్ థ్రాటిల్ రెస్పాన్స్

డీజిల్ వెర్షన్: ఎక్కువ టార్క్ వల్ల హైవే, ఓవర్‌ టేకింగ్‌ లో స్ట్రాంగ్. డీజిల్ పంచ్ ఎక్కువ

⦿ మైలేజ్ (అంచనా)

పెట్రోల్ వెర్షన్:  12-14 kmpl. డ్రైవింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది.

డీజిల్ వెర్షన్: 16-17 kmpl. ఎక్కువ ఎఫిషియెంట్.

⦿ ధర (అంచనా)

పెట్రోల్ వెర్షన్:  డీజిల్ కంటే సుమారు రూ.50,000-80,000 తక్కువ

డీజిల్ వెర్షన్: రూ. 14- రూ.25 లక్షల వరకు(ఎక్స్ షోరూమ్) ఉంటుంది.

⦿ ఫీచర్స్

పెట్రోల్ వెర్షన్:  టాప్ వేరియంట్లలో (Fearless Ultra) 14.53-ఇంచ్ QLED స్క్రీన్, డాల్బీ అట్మాస్ ఆడియో ఉంటుంది.

డీజిల్ వెర్షన్: స్టాండర్డ్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి.

Read Also: సియోర్రా To అవిన్యా.. 2026లో లాంచ్ కాబోతున్న టాటా ఈవీలు ఇవే!

ఇతర కీలక తేడాలు

పెట్రోల్ అడ్వాంటేజెస్: సిటీ డ్రైవింగ్, ట్రాఫిక్‌లో సులభం. కోల్డ్ స్టార్ట్ ఈజీ  మెయింటెనెన్స్ తక్కువ. టాప్ ట్రిమ్‌లలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్రీమియం ఆడియో ఎక్స్ పీరియెన్స్ ఉంటుంది.

డీజిల్ అడ్వాంటేజెస్: లాంగ్ డ్రైవ్స్, హైవేలకు బెస్ట్. ఎక్కువ మైలేజ్ వల్ల రన్నింగ్ కాస్ట్ తగ్గుతుంది.

కామన్ ఫీచర్స్: రెండింటికీ సేమ్ డిజైన్, సేఫ్టీ (7 ఎయిర్‌బ్యాగ్స్, ADAS), పనోరమిక్ సన్‌రూఫ్, 360° కెమెరా ఉంటాయి.

సిటీ డ్రైవ్, రిఫైన్‌మెంట్ అయితే టాటా హారియర్ పెట్రోల్ వెర్షన్ బెస్ట్. లాంగ్ డ్రైవ్స్, మైలేజ్ కావాలంటే డీజిల్ వేరియెంట్ బెస్ట్. రెండూ సేఫ్టీ, ఫీచర్స్‌ లో టాప్ క్లాస్ గా ఉంటాయి.

Read Also: సియోర్రా To అవిన్యా.. 2026లో లాంచ్ కాబోతున్న టాటా ఈవీలు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×