E-Paper
Advertisement

Earbuds offer: రూ. 10 వేల ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ. 4 వేల లోపే.. అమెజాన్‌లో టాప్ 3 బెస్ట్ డీల్స్

Earbuds offer: రూ. 10 వేల ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ. 4 వేల లోపే.. అమెజాన్‌లో టాప్ 3 బెస్ట్ డీల్స్

Earbuds offer: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా, ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రేమికుల కోసం ‘మెగా ఎలక్ట్రానిక్స్ డేస్’ సేల్‌ను లైవ్ చేసింది. స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, హెడ్‌ఫోన్‌లపై ఏకంగా 80 శాతం వరకు తగ్గింపుతో సేల్ ప్రారంభించి,  టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో లభించే ఇయర్‌బడ్స్ నుంచి ప్రీమియం ల్యాప్‌టాప్‌ల వరకు అన్నింటిపై భారీ ధరల తక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో చాలామందికి సహజంగా వచ్చే సందేహం ఒక్కటే, ఈ తక్కువ ధరకు నిజంగా క్వాలిటీ వస్తుందా, లేక ఆఫర్ పేరుతో సాధారణ ప్రాడక్టే అమ్ముతున్నారా అన్నది. అమెజాన్‌లో ప్రస్తుతం లైవ్‌గా ఉన్న ఇయర్‌బడ్స్ ఆఫర్లు ఏంటి, అసలు ధర ఎంత, ఆఫర్‌లో ఎంత తగ్గించారు, నిజంగా ఇవి కొనదగినవేనా అనే విషయాన్ని పూర్తిగా క్లియర్‌గా వివరంగా చూద్దాం.

శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ కోర్ (Samsung Galaxy Buds Core)

శామ్‌సంగ్ నుంచి వచ్చే గెలాక్సీ బడ్స్ కోర్ ప్రీమియం ఫీల్ ఇచ్చే ఇయర్‌బడ్స్. వీటి అసలు ధర రూ.9,999గా చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.3,899కే లభిస్తున్నాయి. అంటే సుమారు రూ.6,100 వరకు తగ్గింపు. ఈ ఇయర్‌బడ్స్‌లో ఆక్టివ్ నాయిస్ కాన్సలేషన్ ఉంటుంది. బయట శబ్దాన్ని చాలా వరకు తగ్గించి, మ్యూజిక్ గానీ కాల్స్ గానీ క్లియర్‌గా వినిపిస్తాయి. ఒక్కో ఇయర్‌బడ్‌లో 3 మైక్స్ ఉన్నాయి, మొత్తం 6 మైక్స్‌తో కాల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఐపి54 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల రోజువారీ వాడకానికి సేఫ్. బ్యాటరీ బ్యాకప్ సుమారు 35 గంటల వరకు వస్తుంది. శామ్‌సంగ్ ఫోన్ వాడేవాళ్లకు ఇది ఇంకా మంచి ఎంపిక.

పిట్రోన్ బస్సుబుడ్స్ ట్రెండ్స్ ఓపెన్ ఎఆర్ (pTron Bassbuds Trendz Open Ear)

పిట్రోన్ నుంచి వచ్చే బస్సుబుడ్స్ ట్రెండ్స్ ఓపెన్ ఇయర్ డిజైన్‌తో వస్తాయి. వీటి అసలు ధర కూడా రూ.9,999గా చూపించి, ఇప్పుడు ఆఫర్‌లో రూ.3,899 దగ్గర లభిస్తున్నాయి. ఈ ఇయర్‌బడ్స్ చెవిలో పూర్తిగా లోపలికి వెళ్లకుండా బయటే ఫిట్ అవుతాయి. అందువల్ల బయట వాతావరణం కూడా కొంచెం వినిపిస్తుంది. రోడ్డు మీద నడుస్తూ, ఆఫీస్‌లో పనిచేస్తూ కాల్స్ మాట్లాడేవాళ్లకు ఇది ఉపయోగపడుతుంది. 14.2mm డ్రైవర్లు ఉండడం వల్ల సౌండ్ క్లియర్‌గా ఉంటుంది. డ్యూయల్ హెచ్‌డి మైక్స్‌తో పాటు ఏఐ-ఈఎన్‌సి సపోర్ట్ ఉంది. బ్యాటరీ బ్యాకప్ మొత్తం 45 గంటల వరకు ఇస్తుంది. టైప్ సి ఛార్జింగ్, బ్లూటూత్ 6.0 సపోర్ట్ కూడా ఉన్నాయి.

Also Read: Amazon Year End Offers: షాపింగ్ అలర్ట్.. అమెజాన్‌లో బ్రాండెడ్ గాడ్జెట్లపై క్రేజీ డీల్స్.. ఇవి నిజమైన ఆఫర్లేనా?

పిట్రాన్ ప్రిజం టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్ (pTron Prism TWS Earbuds)

పిట్రాన్ ప్రిజం టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్ పూర్తిగా బడ్జెట్ రేంజ్‌లో వస్తాయి. వీటి అసలు ధర రూ.1,999గా చూపించి, ఇప్పుడు రూ.598 నుంచి రూ.698 మధ్యలో ఆఫర్‌లో లభిస్తున్నాయి. ఈ ధరకు వచ్చే ఫీచర్లు చూసుకుంటే మంచి డీల్ అని చెప్పొచ్చు. 13mm డ్రైవర్లు ఉండటం వల్ల డైలీ మ్యూజిక్ వినడానికి సరిపోతాయి. డ్యూయల్ మైక్‌తో ట్రూటాక్ ఏఐ-ఈఎన్‌సి సపోర్ట్ ఉంది. కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ క్లియర్‌గా ఉంటుంది. మొత్తం బ్యాటరీ బ్యాకప్ సుమారు 45 గంటల వరకు వస్తుంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, 50ms లేటెన్సీ ఉండడం వల్ల వీడియోలు చూసేటప్పుడు సింక్ బాగుంటుంది. ఐపిఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది.

అసలు ధర – ఆఫర్ ధర ఎంత తేడా

ఈ మూడు ఇయర్‌బడ్స్‌లో శామ్‌సంగ్ గాలక్సీ బడ్స్ కోర్, పిట్రోన్ బస్సుబుడ్స్ ట్రెండ్స్ రెండింటికీ అసలు ధర రూ.9,999 చూపించి, ఇప్పుడు రూ.3,899కే ఇస్తున్నారు. ప్రిజం టిడబ్ల్యుఎస్ మాత్రం అసలు ధర రూ.1,999 నుంచి నేరుగా ర.598 వరకు తగ్గింది. అంటే ప్రతి మోడల్‌లోనూ భారీ డిస్కౌంట్ ఉంది.

చివరిగా ఏది ఎవరికీ సరిపోతుంది

పూర్తి ఏఎన్‌సి, ప్రీమియం కాల్ క్వాలిటీ కావాలంటే శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ కోర్ సరిపోతాయి. బయట కూడా వాతావరణం వినిపిస్తూ, సేఫ్‌గా వాడాలంటే పిట్రాన్ బాస్‌బడ్స్ ట్రెండ్జ్ ఓపెన్ ఇయర్ మంచి ఎంపిక. చాలా తక్కువ బడ్జెట్‌లో డైలీ యూజ్ కోసం కావాలంటే పిట్రాన్ ప్రిజం టిడబ్ల్యుఎస్ సరిపోతాయి.

Related News

యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

Big Stories

×