E-Paper
Advertisement

Samsung Galaxy M17 5G Offer: అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. రూ.12,499 కే సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం17 5జి

Samsung Galaxy M17 5G Offer: అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. రూ.12,499 కే సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం17 5జి
Advertisement

Samsung Galaxy M17 5G Offer: అమెజాన్‌లో ఫోన్ కొనాలనుకునే వాళ్లకి సరైన సమయం మొదలైంది. రోజూ కనిపించే సాధారణ డిస్కౌంట్లు కాకుండా, ఈసారి నిజంగా విలువ ఉన్న ఆఫర్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ రేంజ్‌లో మంచి బ్రాండ్ కావాలి, లాంగ్ టైమ్ వాడుకోవాలి అనుకునే వాళ్లకి శామ్‌సంగ్ గెలాక్సీ ఎం17 5జి పై వచ్చిన ఆఫర్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. శామ్‌సంగ్ పేరు చెప్పగానే నమ్మకం, క్వాలిటీ గుర్తుకొస్తాయి. అదే శామ్‌సంగ్ ఫోన్ ఇప్పుడు తక్కువ ధరకి అమెజాన్‌లో అందుబాటులోకి రావడం చాలా మందికి సర్‌ప్రైజ్‌గా ఉంది.

డిజైన్ లుక్

Advertisement

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం17 5జి డిజైన్ చూస్తే మొదటగా స్లిమ్ లుక్ కనిపిస్తుంది. ఈ ఫోన్ మందం (Thickness) కేవలం 7.5 mm మాత్రమే ఉండడంతో చేతిలో పట్టుకుంటే లైట్‌గా ఫీల్ అవుతుంది. బ్యాక్ సైడ్ క్లిన్ ఫినిష్‌తో ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. రోజూ వాడే ఫోన్ కావడంతో ఎక్కువ బరువు లేకుండా కంఫర్ట్‌గా ఉంటుంది. ఐపి54 రేటింగ్ ఉండటం వల్ల చిన్న నీటి చినుకులు, ధూళి వల్ల భయం అవసరం లేదు.

డిస్‌ప్లే అనుభవం

Advertisement

ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. స్క్రీన్ చాలా బ్రైట్‌గా ఉంటుంది. గరిష్టంగా 1100 నిట్స్ బ్రైట్‌నెస్ రావడం వల్ల బయట ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. రిజల్యూషన్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ అంటే 1080 x 2340 పిక్సెల్స్. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. వీడియోలు చూడటం, సోషల్ మీడియా వాడటం చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. స్క్రీన్ మీద కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉండటం ఈ ధరలో పెద్ద ప్లస్ పాయింట్.

కెమెరా సామర్థ్యం

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం17 5జిలో 50 మెగా పిక్సెల్ మైన్ కెమెరా ఉంది. ఇందులో ఓఐఎస్ సపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ విషయం. చేతులు కొంచెం కదిలినా ఫోటోలు క్లియర్‌గా వస్తాయి. 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా గ్రూప్ ఫోటోలు, ల్యాండ్‌స్కేప్ షాట్స్‌కి ఉపయోగపడుతుంది. 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా క్లోజ్ షాట్స్ కోసం ఉంది. ముందు వైపు 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వీడియో రికార్డింగ్ గరిష్టంగా ఎఫ్‌హెచ్‌డీ రిజల్యూషన్‌లో 30 ఎఫ్‌పీఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది. సోషల్ మీడియా కోసం ఫోటోలు, వీడియోలు తీసేవాళ్లకి ఈ కెమెరా సెటప్ సరిపోతుంది.

Also Read: Meesho offers: మీషో అంటే కేవలం బట్టలే కాదండోయ్.. ఇకపై మొబైల్స్ కూడా.. రూ.7వేలలోపే స్మార్ట్‌ఫోన్ డీల్స్

పర్‌ఫార్మెన్స్ అనుభవం

ఈ ఫోన్‌లో ఎక్సైనోస్ 1330 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. రోజువారీ వాడకానికి అంటే కాల్స్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, బ్రౌజింగ్ లాంటివి ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్‌గా నడుస్తాయి. ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది. వన్ యూఐ 7.0 ప్లాట్‌ఫామ్ వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ క్లిన్‌గా ఉంటుంది. అనవసర యాడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంకో పెద్ద హైలైట్ ఏంటంటే, ఈ ఫోన్‌కి 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్, ఓఎస్ అప్‌డేట్స్ ఇస్తామని శామ్‌సంగ్ చెప్తోంది. ఈ ధరలో ఇది నిజంగా అరుదైన విషయం.

5000mah బ్యాటరీ

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం17 5జిలో 5000mah బ్యాటరీ ఇచ్చారు. నార్మల్ యూజ్‌లో ఒక రోజు సులభంగా వస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. సీ టైప్ చార్జింగ్ ఉంటుంది. బాక్స్‌లో చార్జర్ ఇవ్వరు అనే విషయం గుర్తుంచుకోవాలి. అయినా చార్జింగ్ స్పీడ్ డీసెంట్‌గా ఉంటుంది. శామ్‌సంగ్ వాలెట్, ట్యాప్ అండ్ పే సపోర్ట్, నాక్స్ సెక్యూరిటీ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

అసలు ధర.. అమెజాన్ ఆఫర్ ధర.. ఎంత తగ్గింది?

ఇప్పుడు అసలు మేటర్ ధర గురించి మాట్లాడితే, ఈ ఫోన్ అసలు అసలు ధర రూ.16,499. కానీ అమెజాన్‌లో ప్రస్తుతం 24 శాతం డిస్కౌంట్‌తో రూ.12,499 కి లభిస్తోంది. ఈ ధరకి శామ్‌సంగ్ బ్రాండ్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఓఐఎస్ కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్ అంటే నిజంగా మంచి డీల్. నో కాస్ట్ ఈఎంఐ రూ.606 నుంచి స్టార్ట్ అవుతుంది. పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే ఇంకా ఎక్కువ సేవింగ్ రావచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఆఫర్ ఎప్పటి వరకు

ఈ అమెజాన్ ఆఫర్ లిమిటెడ్ టైమ్ కోసం మాత్రమే. స్టాక్ ఉన్నంతవరకు లేదా అమెజాన్ ఆఫర్ పీరియడ్ ముగిసే వరకు ఈ ధర ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్‌లో శాంసంగ్ 5జీ ఫోన్ కావాలనుకునే వాళ్లు ఆలస్యం చేయకుండా అమెజాన్‌లో చెక్ చేయడం మంచిది. ఈ ధరకి ఇలాంటి ఫీచర్లు మళ్లీ ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అందుకే వెంటనే ఆర్డర్ పెట్టేయండి.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×