E-Paper
Advertisement

Chandrababu-Pawan With Modi: ఈ బంధం బలమైంది.. కేంద్రంలో కీలకపాత్ర, ఇక జనసేన వంతు?

Chandrababu-Pawan With Modi: ఈ బంధం బలమైంది.. కేంద్రంలో కీలకపాత్ర, ఇక జనసేన వంతు?
Advertisement

Chandrababu-Pawan With Modi: ఏపీలో కూటమిని విడగొట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది.. చేస్తోంది కూడా. తొలుత చంద్రబాబు-పవన్ మధ్య ప్లాన్ చేసింది. వైసీపీ ఎత్తులను ముందుగానే పసిగట్టిన నేతలు ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు పార్టీల అధినేతలు.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. ఎలాంటి గొడవలు లేకుండా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వైసీపీ చిన్నఆశ మాత్రం పెట్టుకుంది.

టీడీపీకి ప్రయార్టీ ఇస్తున్న మోదీ సర్కార్

Advertisement

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో టీడీపీ-జనసేన కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆ రెండు పార్టీలు తప్పుకుంటే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఏపీలో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవడంతో ఆ ధర్మాన్ని ఆ రెండు పార్టీలు కంటిన్యూ చేస్తున్నాయి. ఏపీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మూడు పార్టీల కీలక నేతలు చర్చించుకుంటున్నారు కూడా.  అంతేకాదు పదవుల విషయంలో అదే పంథాను అనుసరిస్తున్నారు.

ఈ క్రమంలో టీడీపీ రెండు కేంద్రమంత్రి పదవులు ఇచ్చింది.  దీని తర్వాత గవర్నర్ పదవి ఇచ్చింది. తాజాగా  కీలకమైన పదవి టీడీపీకి ఇచ్చింది మోదీ సర్కార్. సుప్రీంకోర్టులో కేంద్రప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్‌గా సీనియర్ అడ్వకేట్, టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ను నియమించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు.

Advertisement

సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా రవీంద్రకుమార్‌

దీనిపై కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన న్యాయ పదవుల్లో ఇది కూడా ఒకటి.  రవీంద్రకుమార్‌కు ఈ పదవి వస్తుందని పార్టీల నేతలు ఎవరూ ఊహించలేదు. సడన్‌గా కేంద్రం నుంచి ప్రకటన రావడంతో ఎవరికీ నోటి మాట రాలేదు. ఒకవిధంగా చెప్పాలంటే పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం చేస్తామని చెప్పకనే చెప్పింది టీడీపీ. 

రవీంద్రకుమార్‌కు ఆ పదవి దక్కడంతో వైసీపీలో చిన్నపాటి చర్చ లేకపోలేదు.  మోదీ-చంద్రబాబు-పవన్ మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని,  వాటిని విడగొట్టడం సాధ్యం కాదంటూ చర్చించుకోవడం కనిపించింది. ఇదే కంటిన్యూ అయితే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి కష్టాలు తప్పవనే చిన్నవాదన మొదలైంది.

ALSO READ: కుర్చీలతో కొట్టుకున్న జనసేన నేతలు, మేటరేంటి?

ఇక జనసేన విషయానికి వద్దాం. మోదీ సర్కార్ ఇలా వరుసగా టీడీపీకి ప్రయార్టీ ఇవ్వడంతో జనసేన నేతల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి మొదలైనట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి. నార్మల్‌గా అయితే తొలుత మోదీ కేబినెట్ లో జనసేనకు కేంద్రమంత్రి పదవి దక్కుతుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు.

మొన్నటికి మొన్న రాజ్యసభ సీటు వస్తుందని ఆ పార్టీలో కొందరు నేతలు లెక్కలు వేసుకున్నారు.  తాజాగా టీడీపీకి  అదనపు సొలిసిటర్ జనరల్‌ పదవి ఇవ్వడంతో, రాబోయే రోజుల్లో తమకు ఏదో ఒక పదవి ఖాయమనే వాదన జనసేన నేతల్లో మొదలైంది. మోదీ మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారా? రాజ్యసభ సీటు ఇస్తారా? అంటూ కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×