Big Stories

Amazon Great Summer Sale 2024: 12GB RAM ఫోన్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు.. ఏకంగా..

Huge Discount on Amazon Great Summer Sale 2024: మనలో ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్లకు బాగా అలవాటు పడిపోయారు. చిన్న పిలల్ల నుంచి పెద్దల వరకు చేతిలో ఫోన్ లేనిదే ముద్ద దిగడం లేదు. ఫోన్లను విపరీతంగా వాడేస్తున్నారు. కొత్తకొత్త యాప్స్ వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకోసం భారీ  మొత్తంలో డబ్బులు చెల్లించి ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు.  అయితే ఇటువంటి వారికి ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేట్ సమ్మర్ సేల్‌లో 12GB RAM స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉంచింది.

- Advertisement -

మీరు 12GB RAMతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఈ అవకాశం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో Redmi Note 13 5G, Motorola G84 5G, POCO X6 నియో 5G, Vivo V29 Pro 5G, Realme 12 Pro+ 5G ఫోన్లు ఉన్నాయి. 12GB RAM ఉన్న స్మార్ట్‌ఫోన్‌లపై లభించే ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

Redmi Note 13 5G
రెడ్ మీ Note 13 5G 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 20,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపు రూ. 1000 వరకు పొందవచ్చు. ఆ తర్వాత ఫోన్ ధర రూ. 19,999గా ఉంటుంది.

Also Read: ఈ ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు భయ్యా.. టాప్ సెల్లింగ్ ఫోన్‌ను చీప్‌గా కొనేయండి!

Motorola G84 5G
మోటో G84 5G స్మార్ట్‌ఫోన్ 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ 19,179 రూపాయలకు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపు రూ. 1000 వరకు పొందవచ్చు. దీని ప్రకారం ఫోన్‌ను రూ. 18,179లకే కొనుగోలు చేయవచ్చు. అవుతుంది.

POCO X6 నియో 5G
POCO X6 నియో 5G ఫోన్‌ 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ 16,499 రూపాయలకు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపు రూ. 1000 వరకు పొందవచ్చు. ఆ తర్వాత ఫోన్ ధర రూ. 15,499 అవుతుంది.

Also Read: కిక్కిచ్చే ఆఫర్.. రూ.3500 ఇయర్‌బడ్స్ రూ.1000 లోపే!

Realme 12 Pro+ 5G
రియల్ మీ 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,870లగా ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపు రూ. 1000 వరకు పొందవచ్చు. దీని ప్రకారం ఫోన్‌ను రూ. 30,870లకే కొనుగోలు చేయవచ్చు.

Vivo V29 Pro 5G
Vivo V29 Pro 5G ఫోన్ 12GB RAM +256GB స్టోరేజ్ వేరియంట్ 39,990 రూపాయలకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపు రూ. 1000 వరకు పొందవచ్చు. దీని ప్రకారం ఫోన్‌ను రూ. 38,990లకే కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News