BigTV English

Hardik Pandya on MI Failures: ఫెయిల్యూర్స్‌కి కారణాలు ఇప్పుడే చెప్పలేను: పాండ్యా!

Hardik Pandya on MI Failures: ఫెయిల్యూర్స్‌కి కారణాలు ఇప్పుడే చెప్పలేను: పాండ్యా!

MI Captain Hardik Pandya on Mumbai Failures in IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ ముంబై ఇండియన్స్‌‌కి కలిసి రాలేదని కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఓటముల నుంచే సీజన్ ప్రారంభమైందని అన్నాడు. ఏ దశలో కూడా కోలుకోలేకపోయామని అన్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి ఉంటే, కథ మరోలా ఉండేదని అన్నాడు. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోతే ఫలితం ఇలాగే ఉంటుందని అన్నాడు. తక్కువ స్కోరు మ్యాచ్ ని కూడా గెలవలేకపోవడం నిజంగా ఇబ్బందికరమే అన్నాడు.


టాస్ గెలిచి మ్యాచ్ ఓడిపోవడం బాధగా ఉందని అన్నాడు. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ పై తేమ ఉంటుంది. అప్పుడు బ్యాటింగ్ చేయడం సులువే, కానీ మావాళ్లు చాలా సులువుగా అవుట్ అయిపోయారని అన్నాడు. ఈసారికింతే, వచ్చేసీజన్ లో లోటుపాట్లను సరిచేసుకుని దిగుతామని అన్నాడు.

Also Read: ఐపీఎల్ 2024.. ఈ ఏడాది వివాదాస్పద అంపైరింగ్ సంఘటనలు ఇవే..!


ఈ సీజన్ వైఫల్యాలకి ఇప్పుడప్పుడే కారణాలు చెప్పలేనని అన్నాడు. దానికి ఒక టైమ్ వస్తుంది అప్పుడే చెబుతానని అన్నాడు. ఈ కామెంట్‌పై నెట్టింట జనం స్పందిస్తున్నారు. అంటే ఎప్పుడు వస్తుంది పాండ్యా భయ్.. నువ్వు రిటైర్ అయ్యాక తీరిగ్గా కూర్చుని.. ఆరోజు ఇలా జరిగింది.. ఈరోజు ఇలా జరిగింది అని చెబుతా ఉంటావా? అని కామెంట్లు పెడుతున్నారు.

ఈ మాట కూడా అనకుండా ఉండాల్సింది నువ్వు.. ఎందుకంటే ఐపీఎల్ నీకు బోనస్ లాంటిది.. టీమ్ ఇండియా అనేది కీలకం. అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. తనతో పాటు ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ తోక జాడిస్తే, అక్కడ తోక కత్తిరిస్తాడు. టీ 20 ప్రపంచకప్ లో ఒకట్రెండు మ్యాచ్ లు చూసి పక్కన పెట్టారనుకో.. అంతే, మళ్లీ తిరిగి జాతీయ జట్టులోకి వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు.

Also Read: Virat Kohli’s strike rate Debate: విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై చర్చ.. స్టార్ స్పోర్ట్స్‌పై మాజీ క్రికెటర్ సీరియస్

హార్దిక్ పాండ్యా ఇంకా మాట్లాడుతూ ప్రస్తుతం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం, మాకూ మంచిరోజులు వస్తాయని అన్నాడు. మిగిలిన మూడు మ్యాచ్ లు కూడా కష్టపడి గెలుస్తాం. సవాళ్లను ఎదుర్కోవడానికి ఎళ్లవేలలా సిద్దంగా ఉన్నామని అన్నాడు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×