Samsung Galaxy A55 Discount Republic Day Sale| అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 నుండి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఆర్లీ డీల్స్ ఆన్‌లైన్‌లో వచ్చాయి. ఈ సేల్‌లో అతి పెద్ద ఆకర్షణగా శాంసంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్ ఉంది. గత సంవత్సరం ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్‌గా లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు దాదాపు సగం ధరకు లభిస్తోంది. వాల్యూ కోసం చూసే కస్టమర్లకు ఇది చాలా ఆకర్షణీయమైన ఆఫర్.
గెలాక్సీ A55 5G మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తోంది. 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.42,999. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఇప్పుడు అమెజాన్‌లో ఈ ఫోన్ రూ.24,999కి లభిస్తోంది. ఎలిజిబుల్ బ్యాంక్ కార్డ్‌లతో అదనంగా రూ.1,000 డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ తర్వాత ఎఫెక్టివ్ ధర రూ.23,999కి దిగివస్తుంది. ఈ ధర పరిమిత సమయం మాత్రమే ఉంటుంది.
గెలాక్సీ A55 5Gలో పెద్ద 6.6 ఇంచ్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. విజన్ బూస్టర్ టెక్నాలజీ వల్ల బయటి ప్రకాశంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్ ప్రీమియం డిజైన్, బలమైన బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. స్టైలిష్‌గా, దీర్ఘకాలిక వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.
ఈ ఫోన్ లో Exynos 1480 ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులు స్మూత్‌గా జరుగుతాయి. గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్ ఉంది. గేమింగ్, స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ సులభంగా చేయవచ్చు.
గెలాక్సీ A55 5Gలో 5,000mAh బ్యాటరీ ఉంది. రెగ్యులర్ యూజ్‌తో ఒక రోజు పూర్తిగా ఉపయోగించవచ్చు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. USB Type-C పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. ఫోన్ One UI 8తో Android 16 ఆధారంగా రన్ అవుతుంది. AI ఫీచర్లు, మోడరన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
Also Read: మీ యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ పెరగడం లేదా? ఈ టిప్స్ తప్పనిసరిగా పాటించండి
గెటప్ A55 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్ ఉంది. 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోటోలు క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా వస్తాయి.
రిపబ్లిక్ డే సేల్‌లో గెలాక్సీ A55 5G మిడ్ రేంజ్‌లో మంచి ఆప్షన్‌గా మారింది. ధర తగ్గింపు వల్ల ఫోన్య వాల్యూ మరింత పెరిగింది. బలమైన పర్‌ఫామెన్స్, ప్రీమియం డిస్‌ప్లే కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. 12GB RAM వేరియంట్ మరింత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఆఫర్ పరిమిత సమయం మాత్రమే ఉంటుంది.