E-Paper
Advertisement

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!
Advertisement

Android Power Button: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ పవర్ బటన్‌ను రోజుకు పదుల సార్లు నొక్కుతుంటారు. స్క్రీన్ ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, ఫోన్ స్విచ్ఛాఫ్ లేదా రీస్టార్ట్ చేయడానికి మాత్రమే దీన్ని వాడుతుంటాం. కానీ, ఆధునిక ఆండ్రాయిడ్ ఫోన్లలో.. ముఖ్యంగా శాంసంగ్ డివైజ్‌లలో దీని పేరును ‘సైడ్ కీ’గా మార్చేశారు. ఇప్పుడు ఈ బటన్‌ను కేవలం ఫోన్ ఆఫ్ చేయడానికే కాకుండా.. మనకు నచ్చిన పనుల కోసం రకరకాలుగా సెట్ చేసుకోవచ్చు. ఆ అద్భుతమైన 5 ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆపదలో ఆదుకునే ఎమర్జెన్సీ అలర్ట్:

మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ ఫీచర్ ప్రాణాలు కాపాడుతుంది. ఫోన్ లాక్ చేసి ఉన్నా సరే, పవర్ బటన్‌ను వరుసగా ఐదు సార్లు వేగంగా నొక్కుతే చాలు, వెంటనే ఎమర్జెన్సీ SOS యాక్టివేట్ అవుతుంది. ఇది పెద్దగా సైరన్ మోగించడమే కాకుండా.. మన లైవ్ లొకేషన్‌ను, కొన్ని ఫొటోలను మనం ముందుగానే సేవ్ చేసుకున్న అత్యవసర కాంటాక్ట్స్‌కు పంపుతుంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అప్‌డేట్ అవుతూ 24 గంటల పాటు లొకేషన్ వివరాలను షేర్ చేస్తుంది. దీనికోసం సెట్టింగ్స్‌లోని Safety and Emergency ఆప్షన్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలి.

స్మార్ట్ అసిస్టెంట్ కేవలం ఒక్క క్లిక్‌తో:

Advertisement

కొత్త ఫోన్లలో పవర్ బటన్‌ను కాసేపు నొక్కి పడితే పవర్ మెనూ రాకుండా.. గూగుల్ జెమిని వంటి ఏఐ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్‌పై వెతకాల్సిన పనిలేకుండా వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే, మీకు పాత పద్ధతిలోనే ఫోన్ ఆఫ్ చేసే ఆప్షన్ రావాలనుకుంటే.. సెట్టింగ్స్‌లోని Advanced Features లోకి వెళ్లి Side button ఆప్షన్‌లో మార్పులు చేసుకోవచ్చు.

Also Read: 45W ఫాస్ట్ ఛార్జింగ్, 8000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి Realme C100x ఎంట్రీ.. టెక్ లవర్స్ ఫుల్ హ్యాపీ!

ఈజీగా స్క్రీన్‌షాట్ తీయొచ్చు:

Advertisement

ఫోన్ స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని భద్రపరుచుకోవడానికి స్క్రీన్‌షాట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పవర్ బటన్ మరియు వాల్యూమ్ డౌన్ బటన్‌ను ఒకేసారి కలిపి నొక్కితే వెంటనే స్క్రీన్‌షాట్ వచ్చేస్తుంది. చాలా ఫోన్లలో అరచేతిని స్క్రీన్‌పై పక్కకు జరపడం ద్వారా కూడా స్క్రీన్‌షాట్ తీయొచ్చు. కానీ ఒక్కోసారి జేబులో ఉన్నప్పుడు అది తప్పుగా రికార్డ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే పాత పద్ధతి అయిన ఈ బటన్ల కాంబినేషనే చాలా బెస్ట్.

నచ్చిన యాప్‌ను టక్కున తెరవొచ్చు:

మీరు తరచూ వాడే యాప్‌ను పవర్ బటన్‌తోనే ఓపెన్ చేయవచ్చు. సైడ్ బటన్‌ను రెండు సార్లు వేగంగా నొక్కితే మీకు నచ్చిన యాప్ ఓపెన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోని Side button ఆప్షన్‌లో Double press ఆన్ చేసి, అక్కడ మీకు కావాల్సిన యాప్‌ను ఎంచుకోవాలి. దీంతో టార్చ్ ఆన్ చేయడం, నోట్స్ రాయడం వంటి పనులను క్షణాల్లో చేయవచ్చు.

క్షణాల్లో కెమెరా ఆన్ చేయొచ్చు:

మన కళ్లముందు ఏదైనా అద్భుతమైన దృశ్యం కనిపిస్తే.. ఫోన్ అన్‌లాక్ చేసి కెమెరా యాప్ వెతికేలోపు ఆ సమయం దాటిపోతుంది. అందుకే పవర్ బటన్‌ను రెండు సార్లు నొక్కగానే నేరుగా కెమెరా ఓపెన్ అయ్యేలా లేదా నేరుగా వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాల్యూమ్ బటన్లను నొక్కి ఫొటోలు క్లిక్ చేయొచ్చు. చిన్నపిల్లల అల్లరిని, పెంపుడు జంతువుల అరుదైన క్షణాలను క్షణాల్లో బంధించడానికి ఇది సూపర్ ట్రిక్.

Also Read: బడ్జెట్ ధరలో అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు.. Lava Virat V1 సిరీస్ ప్రత్యేకతలు ఇవే!

Related News

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

యూట్యూబ్ యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్ మీ కోసమే!

గెలాక్సీ వాచ్ వాడుతున్నారా? స్క్రీన్‌పై గ్రీన్ లైన్ వస్తే వెంటనే ఇలా చేయండి!

Big Stories

Advertisement
×