E-Paper
Advertisement

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!
Advertisement

Redmi Watch 5 Active: ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్ అనేది కేవలం ఫిట్‌నెస్ ట్రాకర్ మాత్రమే కాదు, మన చేతికి ఒక క్లాసి రౌండ్ లేదా స్క్వేర్ లుక్ ఇచ్చే మోడ్రన్ గ్యాడ్జెట్. బడ్జెట్ ధరలో ప్రీమియం బ్రాండ్ వాల్యూ, అదిరిపోయే లుక్ కోసం వెతికే వారికి షియోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతున్న సరికొత్త వాచ్ ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తోంది. కేవలం రూ.2,799 ఆఫర్ ధరలో 2 ఇంచుల భారీ డిస్‌ప్లే, మెటాలిక్ బాడీ, బ్లూటూత్ కాలింగ్ , 18 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ వాచ్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Redmi Watch 5 Active ఫీచర్లు:

బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్:

ఈ వాచ్‌లో అందరినీ ఆకట్టుకునే మొదటి విషయం దీని డిస్‌ప్లే సైజ్. ఇందులో ఏకంగా 2 ఇంచుల పెద్ద హై-రిజల్యూషన్ టచ్ స్క్రీన్‌ను అందించారు. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంత పెద్ద స్క్రీన్ రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. దీని వల్ల మెసేజ్‌లు చదవడం, నోటిఫికేషన్స్ చూసుకోవడం చాలా ఈజీ అవుతుంది. దీని బ్రైట్‌నెస్ చాలా బాగుండటం వల్ల అవుట్‌డోర్‌లో ఎండలో ఉన్నప్పుడు కూడా స్క్రీన్ పై అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

ప్రీమియం మెటాలిక్ డిజైన్ :

Advertisement

సాధారణంగా బడ్జెట్ వాచెస్ అన్నీ ప్లాస్టిక్ బాడీతో వస్తాయి. కానీ వాచ్ లో ప్రీమియం జింక్ అలాయ్ మెటల్ ఫ్రేమ్‌ను ఇచ్చారు. దీని వల్ల వాచ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండటమే కాకుండా చేతికి పెట్టుకుంటే ఒక లగ్జరీ లుక్ ఇస్తుంది. దీని స్ట్రాప్స్ కూడా చాలా సాఫ్ట్‌గా, ఎక్కువ సమయం పెట్టుకున్నా చేతికి చెమట పట్టకుండా కంఫర్టబుల్‌గా ఉంటాయి.

క్రిస్టల్ క్లియర్ బ్లూటూత్ కాలింగ్ :

ఈ వాచ్‌లో అడ్వాన్స్‌డ్ 3-మైక్ ENC (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌ను అందించారు. దీని వల్ల మీరు బైక్ పై వెళ్తున్నా లేదా ట్రాఫిక్‌లో ఉన్నా సరే, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అస్సలు రాకుండా అవతలి వారికి మీ వాయిస్ చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. వాచ్ నుంచే డైరెక్ట్‌గా కాల్స్ లిఫ్ట్ చేయవచ్చు, అలాగే డయల్ కూడా చేసుకోవచ్చు.

18 రోజుల అద్భుతమైన బ్యాటరీ లైఫ్ :

Advertisement

స్మార్ట్‌వాచ్ కొనేవారికి అతిపెద్ద టెన్షన్ బ్యాటరీ. కానీ రెడ్‌మీ ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇందులోని ఆప్టిమైజ్డ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే నార్మల్ యూసేజ్‌లో ఏకంగా 18 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఒకవేళ బ్లూటూత్ కాలింగ్ కంటిన్యూస్‌గా వాడినా కూడా వారం రోజులకు పైగా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.

Also Read: బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

హెల్త్ ఫీచర్స్ & స్పోర్ట్స్ మోడ్స్ :

ఈ వాచ్ మీ పర్సనల్ హెల్త్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. ఇందులో 24/7 హార్ట్ రేట్ మానిటర్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్) సెన్సార్, స్ట్రెస్ మానిటరింగ్ , స్లీప్ ట్రాకర్ వంటి అన్ని ముఖ్యమైన ఫీచర్స్ పక్కాగా పని చేస్తాయి. ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసం ఇందులో ఏకంగా 140+ పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. పైగా ఇది IPX8 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. కాబట్టి చిన్న చిన్న వర్షపు జల్లులు పడినా, చెమట పట్టినా వాచ్ అస్సలు పాడవదు.

ధరల వివరాలు :

ఫీచర్స్ పరంగా ప్రీమియం వాచ్‌లకు గట్టి పోటీ ఇస్తున్న Redmi Watch 5 Active ప్రస్తుతం ఆన్‌లైన్ స్టోర్స్, అమెజాన్‌లో కేవలం రూ.2,799 ఆఫర్ ధరకే లభిస్తోంది. రూ. 3,000 లోపు బెస్ట్ బ్రాండ్ వాల్యూ, మెటల్ బాడీ , లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే కాలేజీ స్టూడెంట్స్ , యూత్‌కి ఇది ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్‌వాచ్.

Related News

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

యూట్యూబ్ యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్ మీ కోసమే!

గెలాక్సీ వాచ్ వాడుతున్నారా? స్క్రీన్‌పై గ్రీన్ లైన్ వస్తే వెంటనే ఇలా చేయండి!

Big Stories

Advertisement
×