E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు.. Lava Virat V1 సిరీస్ ప్రత్యేకతలు ఇవే!

బడ్జెట్ ధరలో అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు.. Lava Virat V1 సిరీస్ ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Lava Virat V1 5G: స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా.. బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి తెస్తోంది. Lava Virat V1 సిరీస్‌ను జులై 21న లాంచ్ చేస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇందులో Lava Virat V1 5G, Lava Virat V1 4G అనే రెండు మోడల్స్ ఉన్నాయి. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ల కీలక ఫీచర్లను కంపెనీ రివీల్ చేసింది. ఈ మొబైల్స్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.

ఆకట్టుకునే డిజైన్, డిస్‌ప్లే:

ఈ రెండు ఫోన్లలోనూ 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. దీనికి తోడు 120Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రీన్ స్క్రోలింగ్, వీడియోలు చూడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్‌తో ఈ ఫోన్లు వస్తున్నాయి. Virat V1 5G మోడల్ ఆర్య బ్లూ, సోనార్ గోల్డ్ రంగుల్లో.. 4G మోడల్ నీలగిరి బ్లూ, హిమాలయన్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.

Advertisement

Also Read: UPI పేమెంట్స్‌పై కొత్త రూల్.. రూ.2,000 దాటితే ఛార్జీలు వసూలు చేసే అవకాశం?

పవర్‌ఫుల్ బ్యాటరీ, ప్రాసెసర్:

Lava Virat V1 5G మోడల్‌లో 6,000mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది గేమింగ్, స్ట్రీమింగ్‌కు అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ యూనిసోక్ T8200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక 4G మోడల్ విషయానికి వస్తే.. దీనిలో యూనిసోక్ SC9863A ప్రాసెసర్‌తో పాటు 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. ఈ రెండు ఫోన్లలోనూ 4GB RAM, 64GB స్టోరేజ్‌తో పాటు వర్చువల్ RAM ఎక్స్‌పాన్షన్ ఫీచర్ కూడా ఉంది.

ఏఐ కెమెరా ఫీచర్లు:

Advertisement

ఈ ఫోన్లలో కెమెరా సెటప్ చాలా సింపుల్‌గా, యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంది. వెనుక వైపు 13MP ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP కెమెరాను అందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్ల సాయంతో పోర్ట్రైట్ షాట్స్, ఫొటోల క్వాలిటీ మెరుగ్గా వచ్చేలా ల్యావా ప్లాన్ చేసింది.

ధర వివరాలు తెలిసేది అప్పుడే:

ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలను జులై 21న జరిగే లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించనున్నారు. లావా ఎప్పటిలాగే తమ కస్టమర్ల కోసం ఇంటి వద్దకే వచ్చి సేవలందించే ‘డోర్‌స్టెప్ ఆఫ్టర్-సేల్స్ సర్వీస్’ను ఈ ఫోన్లకు కూడా అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ, వేగవంతమైన స్క్రీన్ కోరుకునే వారికి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది.

Also Read: బట్టలు తొడిగే రోబోట్ వచ్చేసింది.. బద్దకస్తులకు భలే వరం!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×