Tollywood:సాధారణంగా థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా కూడా దాదాపుగా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇక్కడ కొన్ని చిత్రాలు నేరుగా థియేటర్లలో కాకుండా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక చిత్రం ఇల్లరికం కాన్సెప్ట్ తో కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. మరి ఆడియన్స్ ను అలరించడానికి తెలుగమ్మాయి నటించిన ఈ కొత్త కామెడీ మూవీ ని ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చూడొచ్చు? ఎప్పటినుంచి ఈ మూవీ అందుబాటులోకి రాబోతోంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
పుష్పక విమానం, ప్రేమ విమానం, పిట్ట కథలు, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ వంటి తెలుగు చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న శాన్వి మేఘన (Saanve megghana) హీరోయిన్ గా, తమిళ నటుడు ఎలన్ (Elon) హీరోగా ఇండస్ట్రీకి పరిచయమవుతూ దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. గత ఏడాది ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
also read:5 కోట్ల మూవీకి 26 కోట్లు ఖర్చు.. మహేంద్రగిరి వారాహి మూవీ బడ్జెట్ పై నిర్మాత రియాక్షన్?
ఆగస్టు 21వ తేదీ నుండి ఈ చిత్రాన్ని నేరుగా తమ అధికారిక ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది .ఈ మేరకు ఒక చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేస్తూ.. ఈ చిత్రం తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని స్పష్టం చేసింది. మొత్తానికైతే థియేటర్లలో కాకుండా ఇప్పుడు ఓటీటీ జమానా నడుస్తున్న నేపథ్యంలో ఇలా నేరుగా ఓటీటీ ఎంట్రీకి రావడం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్యార్ ప్రేమ కళ్యాణం సినిమా స్టోరీ విషయూనికి వస్తే.. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా ఒక అమ్మాయి (శాన్వి మేఘన) తన ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంటుంది. దీంతో ఆమె భర్త (ఎలన్) ఇల్లరికం రావాల్సి వస్తుంది. ఈ కారణంగా ఆ కుటుంబాలలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? శాన్వి అత్తగారింటికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉండాలని ఎందుకు నిర్ణయించుకుంటుంది? చివరికి తమ జీవితాన్ని తాము ఎలా మలుచుకోవాలనే విషయాన్ని ఈ జంట ఎలా తెలుసుకుంటుంది? ఇల్లరికం వచ్చిన ఎలన్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అనేది స్టోరీ అన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటీమణి రాధిక శరత్ కుమార్(Radhika Sarath Kumar) ,ప్రముఖ సీనియర్ కమెడియన్ యోగి బాబు(Yogibabu) తో పాటు గీతా కైలాసం , ఎంఎస్ భాస్కర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరి ఎన్నో అంచనాల మధ్య ఇల్లరికం కాన్సెప్ట్ తో కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి .