E-Paper
Advertisement

ఒకే ప్యాటర్న్ లో వరుస హత్యలు… దిమాక్ కరాబ్ ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్

ఒకే ప్యాటర్న్ లో వరుస హత్యలు… దిమాక్ కరాబ్ ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్
Advertisement

Psychological Crime Thriller: ఓటీటీలో ప్రతి వారం కొత్త కొత్త క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం హత్యలు ఎవరు చేశారు ? అనే ప్రశ్నకు మాత్రమే పరిమితం కావు. మనిషి మానసిక బలహీనతలను, ఒంటరితనాన్ని ఆయుధంగా మార్చుకుని నేరాలు ఎలా జరుగుతాయో చూపిస్తూ ప్రేక్షకుడిని చివరి వరకు ఆలోచింపజేస్తాయి. అలాంటి డార్క్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లరే ‘అనోమి, ది ఈక్వేషన్ ఆఫ్ డెత్’ (Anomie). మలయాళంలో ఇటీవల విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా కథ ఏంటి ? ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి ? ఎక్కడ చూడొచ్చు ? అనే విషయాలపై ఒకసారి లుక్కేద్దాం.

కథలోకి వెళ్తే…

ఒక నగరంలో వరుసగా కొన్ని అనుమానాస్పద మరణాలు జరుగుతుంటాయి. మొదట అవన్నీ సాధారణ ఆత్మహత్యలుగానే కనిపిస్తాయి. పోలీసులు కూడా అదే కోణంలో కేసులను పరిశీలిస్తుంటారు. కానీ ఒక విషయం మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుంది. చనిపోయిన వారంతా మానసికంగా బలహీనంగా ఉన్నవారు, లేదా సమాజానికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్నవారే.

Advertisement

ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేక దీని వెనుక ఇంకేదైనా రహస్యం ఉందా ? అనే అనుమానాలు మొదలవుతాయి. ఇదే సమయంలో ఫొరెన్సిక్ నిపుణురాలు జారా జీవితంలో కూడా ఊహించని సంఘటన జరుగుతుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమె తమ్ముడు ఒక్కసారిగా కనిపించకుండా పోతాడు. అతని కోసం వెతుకుతున్న క్రమంలో జారాకు ఈ వరుస మరణాల వెనుక ఒకే తరహా ప్యాటర్న్ కనిపిస్తుంది. ఒక్కో ఆధారం ఆమెను మరింత పెద్ద మిస్టరీ వైపు తీసుకెళ్తుంది.

మరోవైపు గతంలో జరిగిన ఒక ఘటన కారణంగా సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ మహమ్మద్ జిబ్రాన్ తన కెరీర్‌ను మళ్లీ నిలబెట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. అధికారికంగా పెద్దగా సహకారం లేకపోయినా ఈ కేసును తనే ఛేదించాలని ముందుకు వస్తాడు. ప్రతి ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఒక్కో క్లూను కలుపుకుంటూ అసలు నిజం కోసం వెతుకుతుంటాడు. జారా, జిబ్రాన్ ఇద్దరూ వేర్వేరు దారుల్లో దర్యాప్తు ప్రారంభించినా, చివరకు వారి దర్యాప్తు ఒకే పాయింట్ వద్దకు చేరుతుంది.

Advertisement

అప్పటి వరకు ఆత్మహత్యలుగా కనిపించిన కేసులన్నీ అసలు హత్యలని తెలిసే పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరికీ అనుమానం రాకుండా, మానసికంగా బలహీనమైన వారినే లక్ష్యంగా చేసుకుని ఒక సైకో కిల్లర్ తన ప్లాన్‌ను అమలు చేస్తున్నాడనే అనుమానం బలపడుతుంది. అయితే ఆ హంతకుడు ఎవరు ? అతను ఎందుకు ఇలాంటి వారినే టార్గెట్ చేస్తున్నాడు ? బాధితులను ఎలా తన ఉచ్చులోకి లాగుతున్నాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సినిమా ముందుకు సాగుతుంది. ప్రేక్షకుడు ఒక విషయం అర్థమైందనుకునేలోపే మరో కొత్త ట్విస్ట్‌తో కథ పూర్తిగా మరో మలుపు తిరుగుతుంది.

ఈ సినిమాలో కేవలం హత్యలు, రక్తపాతం చూపించడంపైనే దృష్టి పెట్టలేదు దర్శకుడు. మనిషి మానసిక పరిస్థితిని ఎలా ప్రభావితం చేయొచ్చు ? సైకాలజీని నేరాలకు ఎలా ఆయుధంగా మార్చుకోవచ్చు అనే అంశాలను కథలో బలంగా చూపించారు. అందుకే ఈ సినిమా సాధారణ క్రైమ్ థ్రిల్లర్‌లా కాకుండా కొంచెం భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఫొరెన్సిక్ నిపుణురాలిగా భావన నటన ఆకట్టుకుంటుంది. సస్పెండ్ అయిన పోలీస్ అధికారిగా రెహమాన్ బాగా నటించారు. వీరిద్దరి పాత్రల మధ్య జరిగే ఇన్వెస్టిగేషన్ కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రాత్రి సన్నివేశాల చిత్రీకరణ, ప్రతి ట్విస్ట్‌ను చూపించిన విధానం సినిమాకు మరింత బలం చేకూర్చాయి. చివరికి నిజంగానే ఇవన్నీ ఆత్మహత్యలా ? లేక ఎవరో చాలా తెలివిగా ప్లాన్ చేసిన హత్యలా ? జారా తన తమ్ముడిని కాపాడుకోగలిగిందా ? జిబ్రాన్ అసలు నేరస్థుడిని పట్టుకోగలిగాడా ? ఈ వరుస మరణాల వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏమిటి ? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులో ఉందా లేదా ?

‘అనోమి ది ఈక్వేషన్ ఆఫ్ డెత్’ సినిమాలో భావన, రెహమాన్, షెబిన్ బెన్సన్, విష్ణు అగస్త్య, బిను పప్పు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రియాస్ మారత్ దర్శకత్వం వహించగా, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఇంగ్షీషు సబ్‌టైటిల్స్‌తో వీక్షించవచ్చు. సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్లు, స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు, చివరి వరకు సస్పెన్స్ కంటిన్యూ చేసే సినిమాలు ఇష్టపడే వారికి ‘అనోమి’ తప్పకుండా నచ్చే అవకాశం ఉంది. ఒకసారి సినిమా మొదలుపెడితే చివరి ట్విస్ట్ తెలిసే వరకు ఆపడం కష్టమే.

Read Also: బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Related News

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న తెలుగమ్మాయి ‘ఇల్లరికం’ కామెడీ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

కొత్తగా చేరిన పోలీస్ ఆఫీసర్ కు చెమటలు పట్టించే ఊరు… తెలుగులోనే ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

Big Stories

Advertisement
×