E-Paper
Advertisement

Apple iPhone: ఆపిల్ ఫోల్డ్ డిజైన్‌లో భారీ మార్పు.. ఇక నార్మల్ సిమ్ వాడలేరు

Apple iPhone: ఆపిల్ ఫోల్డ్ డిజైన్‌లో భారీ మార్పు.. ఇక నార్మల్ సిమ్ వాడలేరు
Advertisement

Apple iPhone: ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్‌పై టెక్ ప్రపంచంలో కొంతకాలంగా చర్చ కొనసాగుతోంది. తాజాగా చైనా నుంచి వచ్చిన సమాచారం ఈ విషయాన్ని మరోసారి హాట్ టాపిక్ చేసింది. సిమ్‌కి పూర్తిగా గుడ్ బై చెప్పి, ఓన్‌లీ ఇ-సిమ్ పై పూర్తి ఆధారపడే ఫోన్‌గా వస్తుందనే మాట బలంగా వినిపిస్తోంది. అంటే ఈసిమ్ ఆప్షన్ ఆపిల్ ఫోన్‌లో ఎప్పటినుంచో ఉంది దానితోపాటు సిమ్ స్లాట్ కూడా ఉండేది. ఇప్పుడు సిమ్స్ స్లాట్ లేకుండా ఇ-సిమ్ ఆప్షన్ మాత్రమే ఇస్తున్నారు. అంటే డైరెక్టుగా ఇప్పుడు నార్మల్ సిమ్‌ను ఐఫోన్‌లో పెట్టలేం. ఐఫోన్ 17 సిరీస్ గ్లోబల్‌గా ఇ-సిమ్ ఓన్‌లీ డిజైన్‌తో రావొచ్చని ముందే అంచనాలు ఉన్న సమయంలో, అదే దిశలో ఫోల్డబుల్ మోడల్ కూడా రానున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి.

కన్ఫ్యూజన్ రావొచ్చు కానీ..

Advertisement

ఐఫోన్ ఫోల్డ్‌లో సిమ్ కార్డ్ స్లాట్ ఉండదని, ఓన్‌లీ ఇ-సిమ్ సపోర్ట్‌తోనే రాబోతుందని సమాచారం. టెక్నాలజీ పూర్తిగా సిద్ధంగానే ఉన్నప్పటికీ, చైనా వంటి మార్కెట్లలో ఇ-సిమ్ వినియోగం ఇంకా పూర్తిగా బలపడకపోవడం వల్ల అక్కడ ప్రారంభ దశలో కొంత కన్ఫ్యూజన్ రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇ-సిమ్ సపోర్ట్ స్ట్రాంగ్

Advertisement

భారత మార్కెట్‌లో ఈ మార్పుపై స్పందన పాజిటివ్‌గా కనిపిస్తోంది. ఇక్కడ ఇ-సిమ్ సపోర్ట్ ఇప్పటికే స్ట్రాంగ్ గా ఉంది. జియో, ఎయిర్‌టెల్, విఐ మూడు నెట్‌వర్క్‌లు ఇ-సిమ్ యాక్టివేషన్‌ను పూర్తిగా డిజిటల్‌గా అందిస్తున్నాయి. స్టోర్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే క్యూఆర్ స్కాన్ ద్వారా ఫోన్‌లోనే ఇ-సిమ్ యాక్టివేట్ చేయవచ్చు. కాబట్టి ఇ-సిమ్ ఓన్‌లీ ఐఫోన్ వచ్చినా, యూజర్లకు అలవాటు కావడం ఈజీగా ఉండే అవకాశం ఉంది. స్టార్టింగ్‌లో కొంత కన్ఫ్యూజన్ ఉన్నా, భారత మార్కెట్ ఈ ట్రాన్సిషన్‌కి రెడీగా ఉందని స్పష్టంగా అనిపిస్తోంది.

సింపుల్ రీజన్ 

ఆపిల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే, రీజన్ సింపుల్ అనే చెప్పాలి. సిమ్ స్లాట్ తీసేసిన వెంటనే ఫోన్ లోపల స్పేస్ సేవ్ అవుతుంది. అది పెద్ద బ్యాటరీ పెట్టడానికి లేదా అదనపు హార్డ్‌వేర్ పెట్టడానికి ఆపిల్‌కి ఉపయోగపడుతుంది. అలాగే డిజైన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఆ సిమ్ స్లాట్ తీసేస్తే లోపల స్పేస్ ఫ్రీ అవుతుంది. ఆ స్పేస్ ని ఆపిల్ పెద్ద బ్యాటరీ పెట్టడానికి లేదా లోపలి భాగాలను సరిగ్గా అమర్చడానికి ఉపయోగించగలదు. అలా లోపలి భాగాలు సరిగా అమర్చితే బ్యాటరీ లైఫ్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Also Read: Flipkart offer: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. జెబ్రోనిక్స్ డాల్బీ సౌండ్ బార్ పై 67% తగ్గింపు

కాంపాక్ట్ డిజైన్..

డిజైన్ విషయానికి వస్తే, ఫోన్ మందం (thickness) రెండు ఐఫోన్ ఎయిర్ ఒకదానిపై ఒకటి పెట్టినంతగా ఉంటుందని టాక్. అంటే తేలికగా అనిపించకపోయినా, ఫోల్డ్ సెగ్మెంట్‌లో కాంపాక్ట్ డిజైన్ అవుతుంది. ఈఫోన్‌లో కెమెరా సెక్షన్ కూడా స్పెషల్. 24 మెగాపిక్సెల్స్ అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా వస్తుందని, క్వాలిటీ డ్రాప్ లేకుండా క్లియర్ సెల్ఫీలు ఇస్తుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే ఇతర బ్రాండ్స్ ప్రయత్నించినా సాధించలేని లెవెల్‌కి ఆపిల్ తీసుకెళ్తుంది.

ఫోల్డ్‌లో 5.5 ఇంచెస్ ఔటర్ డిస్‌ప్లే

ఇప్పుడు మేజర్ టాక్ ఐఫోన్ ఫోల్డ్ గురించే. ఐఫోన్ ఫోల్డ్‌లో 5.5 ఇంచెస్ ఔటర్ డిస్‌ప్లే, 7.8 ఇంచెస్ ఇన్నర్ ఫోల్డబుల్ డిస్‌ప్లే రానున్నట్టు లీక్స్ చెబుతున్నాయి. ఫోల్డింగ్ ఫోన్స్ లో మడిచే చోట కనిపించే మడత రేఖ సమస్య ఇప్పటికీ క్రీజ్ మార్క్ గా కొనసాగుతోంది. కానీ ఆపిల్ ఆ క్రీజ్ లైన్‌ను పూర్తిగా తొలగించే టెక్నాలజీని డెవలప్ చేసినట్టు లీక్ సమాచారం చెబుతోంది. క్రీజ్ లేకుండా స్మూత్ డిస్‌ప్లే వస్తే, ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో ఆపిల్ లీడ్ తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం టెక్ వర్గాల్లో పెరుగుతోంది.

ఏ20 ప్రో చిప్ రానున్నట్టు లీక్

పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే ఐఫోన్ ఫోల్డ్‌లో ఏ20 ప్రో చిప్ రానున్నట్టు లీక్ సమాచారం చెబుతోంది. ఈ చిప్ టిఎస్ఎంసి 2nm ప్రాసెస్‌పై తయారవుతున్నట్టు టాక్. అంటే ప్రస్తుత మొబైల్ చిప్స్‌తో పోలిస్తే ఎక్కువ ఎఫిషియెన్సీ, ఎక్కువ పర్‌ఫార్మెన్స్ ఇవ్వగల అవకాశం ఉంది. బ్యాటరీ విషయంలో సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉపయోగించబోతున్నారని రూమర్స్ చెబుతున్నాయి. దీని వల్ల తక్కువ వెయిట్‌లోనే ఎక్కువ కెపాసిటీ అందే అవకాశముంది.

ఎప్పుడు లాంచ్

లాంచ్ విషయానికి వస్తే ఐఫోన్ ఫోల్డ్ 2026 చివర్లో మార్కెట్లోకి రావొచ్చు. డెవలప్‌మెంట్ వేగం చూస్తే ఈ ఫోల్డబుల్ మోడల్ విడుదల దశకు దగ్గరగా వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియా యూజర్లకు ఈ ఫోన్‌లో ప్రధాన మార్పు ఫోల్డింగ్ స్క్రీన్ కాదు, సిమ్ స్లాట్ లేకపోవడమే. భారత నెట్వర్క్‌లు ఇప్పటికే ఆన్‌లైన్ ఇ-సిమ్ యాక్టివేషన్ సపోర్ట్ ఇస్తున్నందున ఈ మార్పు ఎక్కువ కష్టం లేకుండా సులభంగా అలవాటు చేసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో అన్ని ఐఫోన్ మోడల్స్ కూడా ఇ-సిమ్ ఓన్‌లీ డిజైన్ వైపు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×