E-Paper
Advertisement

Gambhir vs Parth Jindal: పార్థ్ జిందల్ కు ఇచ్చిప‌డేసిన గంభీర్‌.. అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఏంటీ?

Gambhir vs Parth Jindal: పార్థ్ జిందల్ కు ఇచ్చిప‌డేసిన గంభీర్‌.. అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఏంటీ?
Advertisement

Gambhir vs Parth Jindal: సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో భారత్ వైట్ వాష్ అయిన తర్వాత అందరి వేళ్ళు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపే చూపించాయి. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. భారత్ వేదికగా జరిగిన చివరి మూడు టెస్ట్ సిరీస్ లలో రెండు వైట్ వాష్ అయ్యింది. న్యూజిలాండ్ పై మూడు, దక్షిణాఫ్రికాపై రెండు టెస్టుల్లో కనీసం డ్రా కూడా చేయలేకపోయింది.

Also Read: Gautam Gambhir: పొర్లు దండాలు పెట్టినా, 2027 వరల్డ్ కప్ లో ఆ ఇద్దరినీ ఆడనివ్వను ?

Advertisement

జట్టులోని సీనియర్ల తొలగింపు, మార్పులు, బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలతో గౌతమ్ గంభీర్ భారత టెస్ట్ ప్రభావాన్ని దెబ్బతీశాడని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌహతి వేదికగా జరిగిన రెండవ టెస్టులో భారత్ ఏకంగా 400కు వైగా పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో.. టీమిండియా అభిమానులంతా గౌతమ్ గంభీర్ ని టార్గెట్ చేశారు.

 

గంభీర్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన పార్థ్ జిందాల్:

Advertisement

గౌహతి వేదికగా జరిగిన టెస్టులో భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయిన తరువాత.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ కో – ఓనర్ పార్థ్ జిందాల్. టీమిండియా టెస్ట్ జట్టుకు స్పెషలిస్ట్ కోచ్ ఉండడంపై బీసీసీఐ ఆలోచన చేయాలని అన్నాడు. ఈ మేరకు గౌహతి టెస్ట్ అనంతరం సోషల్ మీడియా వేదికగా పార్థ్ జిందాల్.. ” సొంత గడ్డపై ఇంతటి భారీ పరాజయం ఎప్పుడూ చూడలేదు. రెడ్ బాల్ స్పెషలిస్టులు లేకపోవడం వల్లే ఈ ఓటమి వచ్చింది. ఇప్పటికైనా టెస్టులకు ప్రత్యేక కోచ్ ని నియమించాలి”. అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

 

జిందాల్ కి ఇచ్చి పడేసిన గంభీర్:

సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ గెలిచిన అనంతరం తనపై వచ్చిన విమర్శలు అన్నింటికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు గౌతమ్ గంభీర్. ” మేము టెస్ట్ సిరీస్ ఓడిపోయిన అనంతరం ఎన్నో విమర్శలు చేశారు. అందులో సగం క్రికెట్ కి సంబంధించినవి కాదు. టెస్ట్ సిరీస్ లో ఎందుకు ఓడిపోవలసి వచ్చింది అనే అంశంపై ఎవరూ మాట్లాడకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితాలు అనుకూలంగా రానప్పుడు చర్చ జరగడం సహజం. కానీ ఏ మీడియాలోనూ మొదటి టెస్ట్ లో ఎలా ఓడిపోయామన్న విషయాన్ని రాయలేదు.

Also Read: Ind vs Sa 3rd Odi: చెత్త బౌలర్ అంటూ ట్రోలింగ్.. బంతితో ప్రసిద్ అదిరిపోయే కౌంటర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

గాయం కారణంగా కెప్టెన్ గిల్ రెండు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఆ మ్యాచ్ లో అదే వ్యత్యాసం కనిపించింది. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లలో ఓటమికి సాకులు చెప్పడం నాకు రాదు. నిజాన్ని ప్రపంచానికి తెలియజేయవద్దని నేను అనను. జట్టు మార్పు దశలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎదురవుతాయి. ఈ విషయాల గురించి ఎవరూ ప్రస్తావించలేదు. క్రికెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా పిచ్ పై విమర్శలు చేశారు. ఐపీఎల్ లో ఓ ఫ్రాంచైజీ ఓనర్ ఒకరు ఏకంగా కోచింగ్ వ్యవస్థనే విభజించాలని మాట్లాడారు. ఎవరైనా సరే తమ హద్దుల్లో తాము ఉంటే మంచిది. విమర్శించేటప్పుడు మాటలు అదుపులో పెట్టుకోవాలి” అని జిందాల్ ని ఉద్దేశించి గౌతమ్ గంభీర్ ఘాటు రిప్లై ఇచ్చాడు.

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×