E-Paper
Advertisement

Right to Disconnect Bill: ఆఫీసు తర్వాత ఫోన్లు, ఇమెయిల్స్ తో ఉద్యోగులు విసిగించొద్దు.. లోక్‌సభలో కొత్త బిల్లు

Right to Disconnect Bill: ఆఫీసు తర్వాత ఫోన్లు, ఇమెయిల్స్ తో ఉద్యోగులు విసిగించొద్దు.. లోక్‌సభలో కొత్త బిల్లు
Advertisement

Right to Disconnect Bill: డ్యూటీ తర్వాత ఆఫీసు నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్, ఈ-మెయిల్‌లను స్వీకరించకుండా ఉండేందుకు లోక్‌సభలో కొత్త బిల్లు వచ్చింది. రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు పేరుతో ప్రైవేట్ మెంబర్ లోక్‌సభలో దీన్ని ప్రవేశపెట్టారు. ఇది ఉద్యోగుల సంక్షేమ అథారిటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు అంటే ఏంటి?

Advertisement

డ్యూటీ తర్వాత ఇంటికి చేరుకున్న ఉద్యోగులకు వారి వారి కార్యాలయ పనుల నిమిత్తం పైస్థాయి అధికారులు ఫోన్లు చేస్తుంటారు. లేకుంటే మెయిల్స్‌ పెడతారు. ఆయా ఉద్యోగుల విశ్రాంతికి భంగం కలిగించకుండా ఉండే ప్రైవేటు బిల్లు శుక్రవారం లోక్‌సభ ముందుకు వచ్చింది. దీన్ని రైట్‌ టు డిస్‌కనెక్ట్‌ బిల్లు-2025 పేరుతో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు.

దీని ప్రకారం  అధికారిక పని గంటలు, సెలవు దినాలలో పని సంబంధిత కాల్స్, ఇ-మెయిల్‌ల నుండి డిస్‌కనెక్ట్ చేసే హక్కును ప్రతి ఉద్యోగికి కల్పించాలన్నది ఈ బిల్లు ప్రతిపాదన.   లోక్‌సభ లేదా రాజ్యసభలో మంత్రి కాని ఏ సభ్యుడైనా ప్రవేశపెడితే దాన్ని ప్రైవేట్ సభ్యుల బిల్లుగా చెబుతారు.

Advertisement

ఈ బిల్లు పాసయితే కార్మికులకు రిలీఫ్

చట్టం చేయాల్సిన అవసరం ఉందని భావించే అంశాలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడం అన్నమాట. ప్రభుత్వ బిల్లులతో పోలిస్తే.. ప్రైవేట్ మెంబర్ బిల్లులు చట్టంగా మారడం చాలా తక్కువ. ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత ఆ బిల్లును సభ్యులు ఉపసంహరించుకోవచ్చు.

పూణే ఓ ఉద్యోగి మరణం, పరిశ్రమల భిన్నమైన అభిప్రాయాల తర్వాత దేశంలో ఎక్కువ పని గంటలు ఉండటంపై ఆందోళనలు పెరిగాయి. దేశంలో పని-జీవిత సమతుల్యతను సాధించడం అన్నమాట. డిజిటల్ యుగంలో ఉద్యోగి రక్షణకు కీలకమైనది చెబుతున్నారు.

గ్లోబల్ జాబ్ ప్లాట్‌ఫామ్ ఇండీడ్ గతేడాది చేపట్టిన సర్వేలో దేశంలో‘అధికారిక రైట్ టు డిస్‌కనెక్ట్’ విధానానికి బలమైన మద్దతు లభించినట్టు తేలింది. 79 శాతం మంది దీన్ని సమర్థించారు. పనివేళల తర్వాత ఆఫీసు నుంచి కమ్యూనికేషన్ అధికంగా ఉందని ఆ సర్వే తేల్చింది. 88 శాతం మంది ఉద్యోగులు పని సమయాల వెలుపల క్రమం తప్పకుండా సంప్రదించబడుతున్నారని తేలింది.

ALSO READ: గోవాలో భారీ అగ్నిప్రమాదం.. సీఎం కీలక ఆదేశాలు

అనారోగ్య సెలవు లేదా సెలవు రోజుల్లో కూడా సందేశాలు అందుతున్నట్లు తేలింది. 79 శాతం మంది అలాంటి కమ్యూనికేషన్‌ను విస్మరించడం వల్ల కెరీర్ అవకాశాలపై ప్రభావం చూపింది. పని ఆలస్యం వల్ల భవిష్యత్తులో ప్రమోషన్‌లను ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారట.

ఇటీవలకాలంలో చాలామంది వారానికి 70 గంటల నుంచి 90 గంటలు అవసరమని వాదించారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టి సిఇఒ సుబ్రహ్మణ్యన్ వంటి ప్రముఖుల వ్యాఖ్యల తర్వాత చర్చ మొదలైంద. ఈ నేపథ్యంలో రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు ప్రవేశపెట్టినట్టు చెబుతున్నారు కొందరు ఎంపీలు.

తొలిసారిగా 2019లో ఆ తరహా ప్రతిపాదనను తీసుకొచ్చారు ఎన్‌సీపీ ఎంపీ సుప్రియ సూలే. డిజిటల్ కమ్యూనికేషన్ తీవ్రతరం నేపథ్యంలో కార్మికుల శ్రేయస్సు కోసం ఈ బిల్లు ప్రతిబింబిస్తుంది.  ఆఫీసు కాల్స్ కారణంగా నిద్ర లేమి, ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించవచ్చని అంటున్నారు. ఊబకాయం కూడా తగ్గుతుందని ఓ అంచనా. ఆ తరహాలు చట్టాలు ఇప్పటికే చాలా దేశాల్లో ఉన్నాయి. దాదాపు ఏడేళ్ల కిందట అంటే 2017లో ఈ హక్కును చట్టబద్ధం చేసిన మొట్టమొదటి దేశం ఫ్రాన్స్. గతేడాది ఆస్ట్రేలియా డిస్‌కనెక్ట్ హక్కు చట్టం అమల్లోకి వచ్చింది.

 

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×