E-Paper
Advertisement

Apple Holiday Deals: యాపిల్ ప్రొడక్ట్స్‌పై ఆఫర్ల సునామీ.. ఐఫోన్ల నుండి మ్యాక్‌బుక్‌ల వరకు చౌకైన ధరలకే కొనేయొచ్చు!

Apple Holiday Deals: యాపిల్ ప్రొడక్ట్స్‌పై ఆఫర్ల సునామీ.. ఐఫోన్ల నుండి మ్యాక్‌బుక్‌ల వరకు చౌకైన ధరలకే కొనేయొచ్చు!
Advertisement

Apple Holiday Deals: యాపిల్ ఇండియా హాలిడే సీజన్‌ షురూ.. ఈ సందర్భంగా యాపిల్ సంస్థ తమ ప్రొడక్ట్స్ మీద ప్రత్యేక పండగ ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ల ద్వారా ఐఫోన్లు, మ్యాక్‌బుక్‌‌లు, ఐప్యాడ్‌లు, ఆపిల్ వాచ్‌లపై ఆకర్షణీయమైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ డీల్స్‌ను పొందవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను Apple India వెబ్‌సైట్‌లో చూడవచ్చు. సంస్థ ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొత్త మోడల్స్ మీద కూడా ఆఫర్లు అందుబాటులో ఉంది. యాపిల్ హాలిడే సీజన్‌లో ఏయే డివైజ్‌లపై డీల్స్, డిస్కౌంట్స్ అందుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మ్యాక్‌బుక్‌ ఎయిర్ & ప్రోపై రూ.10వేల తగ్గింపు:

యాపిల్ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. 13-అంగుళాల మోడల్ లాంచ్ ధర రూ.99,900. అయితే ఇప్పుడిదీ ప్రత్యేక ఆఫర్ ద్వారా రూ.89,900 ధరకే లభిస్తోంది. ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఐసిఐసిఐ, యాక్సిస్, అమెరికాన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ హోల్డర్లకు రూ10 వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఇక M4 సిరీస్ చిప్‌లతో వచ్చిన మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ కూడా అదే రూ10వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లో ఉన్నాయి. దీనికి ఎలాంటి కూపన్ కోడ్ అవసరం లేదు. అర్హత కలిగిన కార్డ్‌తో పర్చేస్ చేస్తే డిస్కౌంట్ ఆటోమాటిక్‌గా కనిపిస్తుంది. ఇకపోతే 14-అంగుళాల మాక్‌బుక్ ప్రో M4 రూ1,59,900 ధరకి, 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో M4 ప్రో రూ2,39,900 ధరకి అందుబాటులో ఉంది.

Advertisement

Read Also: ఫ్లిప్‌కార్ట్ షాకింగ్ ఆఫర్.. రూ.1.10 Samsung Galaxy Z Flip ఇప్పుడు రూ.58వేలకే పొందొచ్చు!

ఐఫోన్ 17 సిరీప్‌పై భారీ డిస్కౌంట్:

ఐఫోన్ 17 సిరీప్‌పై రూ.5వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 17 ప్రో కొనుగోలు చేస్తే.. ఐసిఐసిఐ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ కార్డ్ యూజర్లకు రూ5వేల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఎలాంటి కార్డు లేనివాళ్లకి రూ.1,000 తగ్గింపు మాత్రమే ఉంటుంది. ఇకపోతే పాత మోడల్స్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మీద కూడా రూ.4వేల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైలర్లు కొన్ని మోడల్స్‌పై రూ9వేల వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌ల‌ మీదా డీల్స్:

Advertisement

ఇక యాపిల్ వాచ్ సిరీస్ 11 మీద రూ.4వేల తగ్గింపు, యాపిల్ వాచ్ SE 3 మీద రూ.2వేల తగ్గింపు అందిస్తుంది. అలాగే ఎయిర్‌పాడ్స్ ప్రో 3, ఎయిర్‌పాడ్స్ 4పై రూ.1,000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. టాబ్లెట్ కొనుగోలుదారులకు కొత్త ఐపాడ్ ఎయిర్‌పై రూ.4వేల తగ్గింపు, స్టాండర్డ్ ఐపాడ్, ఐపాడ్ మిని మీద రూ.3వేల తగ్గింపు లభిస్తుంది. అదనంగా.. యాపిల్ వాచ్ కొనుగోలుదారులకు 3 నెలల ఫ్రీ యాపిల్ మ్యూజిక్, అలాగే ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఏ యాపిల్ డివైజ్ కొనుగోలు చేసినా 3 నెలల యాపిల్ టీవీ+ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

Read Also: కాకరేపే ఫీచర్స్‌తో రియల్‌మీ కొత్త ఫోన్ ఎంట్రీ.. ధర, స్పెసిఫికేషన్స్, కీలక వివరాలు లీక్!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×