E-Paper
Advertisement

Top 20 News: ఎమ్మెల్యే వెంకటప్రసాద్ సంచలన వ్యాఖ్యలు, జాతీయ రహదారిపై రైతుల నిరసన

Top 20 News: ఎమ్మెల్యే వెంకటప్రసాద్ సంచలన వ్యాఖ్యలు, జాతీయ రహదారిపై రైతుల నిరసన

1. స్టాల్స్ ఏర్పాటు

గ్లోబల్ సమ్మిట్‌లో హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న ఇన్నోవేషన్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడానికి తాము స్టాల్ ఏర్పాటు చేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. సెల్ఫ్ డైవింగ్ వెహికల్స్, డ్రోన్స్ ఏర్పాటు చేసి విజిటర్స్‌కి వివరిస్తున్నారు.

2. ఎర్రకుంట సందర్శన: రంగనాథ్

సైదాబాద్ ఎర్రగుంటను బతుకమ్మ కుంట స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సైదాబాద్ ఎర్రకుంటను పరిశీలించారు రంగనాథ్. స్థానికుల ఫిర్యాదుతో ఎర్రకుంట సందర్శించామనీ అన్నారు. త్వరలోనే ఈ చెరువు విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు.

3. ఆటో యానియన్లు మహాధర్నా

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయం ఎదుట ఆటో యూనియన్లు మహా ధర్నా చేశాయి. మహాలక్ష్మి పథకం, రాపిడో, ఊబర్ దోపిడీ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడి, ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి నెలకొందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

4. వాదనలు ముగిశాయి

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై తీర్పును ఈ నెల 11వ తేదీన వెల్లడించనున్నట్లు కోర్టు ప్రకటించింది.

5. నేతలు ఆగ్రహం

నిజామాబాద్‌లో కేసీఆర్ దీక్ష విజయ్ దివస్ సందర్భంగా బీఆర్‌ఎస్‌లో బీసీ నినాదం మొదలైంది. వేదికపై ఓసీ నేతలు మాత్రమే కూర్చుని, పార్టీ కోసం కష్టపడిన బీసీ సీనియర్ నాయకులను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తమైంది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీరుపై బీసీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు.

6. తెప్పోత్సవం పై సమీక్ష

భద్రాచలంలో ఈనెల 29న తెప్పోత్సవం, 30న ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సమీక్షించారు. గోదావరి తీరాన్ని పరిశీలించి, ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

7. ముమ్మరం తనిఖీలు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. రూ. 50 వేలకు మించి నగదు తీసుకువెళ్తే తప్పనిసరిగా ఆధారాలు చూపాలని, లేదంటే నగదు సీజ్ చేస్తామని సీఐ నాగరాజు తెలిపారు.

8. శిక్షణ పూర్తి

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం ద్వారా తెలంగాణలో కృషి సఖిలు, బ్యాంక్ బీమా, శిక్షణ వివరాలపై లోక్‌సభలో ప్రశ్నించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానమిస్తూ, తెలంగాణలో 9,778 మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు.

9. కూలర్ షాప్‌లో అగ్ని ప్రమాదం

మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ పరిధిలోని అన్నోజిగూడ NTPC చౌరస్తా వద్ద గల లీల కూలర్ షాప్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. వంట చేస్తుండగా చిన్న సిలిండర్ పేలడంతో కర్ణాటకకు చెందిన రాజేష్ స్వల్ప గాయాలపాలయ్యాడు.

10. జాతీయ రహదారిపై రైతుల నిరసన

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన రైతులు విద్యుత్ సరఫరా సరిగా లేదని జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. విద్యుత్ లేక మోటార్లు పాడై, పంటలు ఎండిపోతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

11. న్యాయం చేయాలి

అగ్రిగోల్డ్ బాధితులు, సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు నేతృత్వంలో హోంమంత్రి వంగలపూడి అనిత సచివాలయంలో సమావేశమయ్యారు. 8 రాష్ట్రాల నుంచి రూ.7,386 కోట్లు కొల్లగొట్టిన ఈ కేసులో, బాధితులకు త్వరగా న్యాయం చేయాలని వారు కోరారు.

12. రాజకీయ నిబద్ధత

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ నిబద్ధతను, చిత్తశుద్ధిని ప్రశంసించారు. సినిమాల్లో ఉన్నట్టే రాజకీయాల్లో కూడా పవన్ ఎవరికీ తలవంచలేదన్నారు.

13. భారీ ర్యాలీ

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని రైల్వే కోడూరు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహశీల్దార్ అమర్ నాథ్‌కు వినతి పత్రం అందజేశారు.

14. ఫెన్పింగ్ పోటీలు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం కళాశాలలో 69వ రాష్ట్రస్థాయి U-14 ఫెన్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో 13 జిల్లాల బాల బాలికలు పాల్గొంటున్నారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వస్తాయని ముఖ్య అతిథులు తెలిపారు.

15. ఎమ్మెల్యే వెంకటప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో మురళీకృష్ణ ఆభరణాలు కాజేస్తూ దొరకడంపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈవోను సస్పెండ్ చేశారు.

16. జెలెన్‌స్కీ భేటీ

లండన్‌లో జెలెన్‌స్కీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ నాయకులతో భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపునకు ట్రంప్‌ ప్రతిపాదించిన ట్రంప్ శాంతి ప్రణాళికపై రెండు గంటలు చర్చించారు. రాబోయే రోజులు శాంతికి ముఖ్యమని జర్మనీ ఛాన్స్‌లర్ మెర్జ్‌ అన్నారు.

17. భారత పర్యటనపై సానుకూల స్పందన: పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటనపై చైనా సానుకూలంగా స్పందించింది. పటిష్ఠమైన త్రైపాక్షిక సహకారానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. స్థానిక, ప్రపంచ శాంతి స్థిరత్వానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది.

18. మరోసారి అడ్డంకి

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖాలిదా జియా ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆమెను చికిత్స కోసం బ్రిటన్‌లోని లండన్‌కు తరలించడానికి చేసిన ఏర్పాట్లలో మరోసారి అడ్డంకి ఏర్పడింది. ఆమె లండన్‌ ప్రయాణం వాయిదా పడటం ఇది మూడోసారి.

19. ఏకైక ఆటగాడు

భారత యువ చెస్ సంచలనం ప్రజ్ఞానంద 2026 క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధించాడు. ఫిడే సర్క్యూట్ టోర్నీ విజేతగా నిలవడం ద్వారా ఈ బెర్త్ దక్కింది. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ప్రజ్ఞానంద, భారత్ నుంచి ఓపెన్ విభాగంలో పోటీపడుతున్న ఏకైక ఆటగాడు.

20. బాలీవుడ్ నటి.. మరో ప్రాజెక్ట్

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ తాజాగా లగ్‌ జా గాలే అనే కొత్త ప్రాజెక్ట్‌లో నటించనుంది. కిల్‌ఫేం లక్ష్య హీరోగా, రాజ్ మెహతా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ప్రేమ, ప్రతీకారం అంశాలతో యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో జాన్వీ కనిపించనున్నట్లు సమాచారం.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×