E-Paper
Advertisement

iPhone 16 Price Cut: యాపిల్ కొత్త స్కెచ్ మాములుగా లేదుగా.. ఆండ్రాయిడ్ ఫోన్ ధరకే iPhone 16!

iPhone 16 Price Cut: యాపిల్ కొత్త స్కెచ్ మాములుగా లేదుగా.. ఆండ్రాయిడ్ ఫోన్ ధరకే iPhone 16!
Advertisement

iPhone 16 Price Cut: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి తగ్గట్టే ప్రతిఏటా యాపిల్ మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు తగ్గట్టు తమ ప్రొడక్టులను విడుదల చేస్తుంటుంది. అయితే భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచిన iPhone 16పై యాపిల్ ఇప్పుడు క్రేజీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. ఐఫోన్ను 16కు డిమాండ్ పెరుడుతున్న తరుణంలో యూజర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ ధరల సవరణ చేపట్టినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 సామాన్యులు సైతం కొనగలిగేలా..

యాపిల్ ఆఫర్ ప్రకటించిన తర్వాత iPhone 16 బేస్ మోడల్ ధర ఇప్పుడు రూ.69,900గా ఉంది. గతంలో దీని ధర రూ.77,900గా నిర్ణయించారు. అంటే.. ఇప్పుడు ఏకంగా రూ.8,000 మేర తగ్గింపు లభించింది. కేవలం బేస్ మోడల్ మాత్రమే కాకుండా.. ఎక్కువ స్టోరేజ్ కలిగిన ఇతర వేరియంట్ల ధరలను కూడా యాపిల్ తగ్గించింది. దీనివల్ల ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వారి కల నెరవేరినట్లైంది.

Advertisement

Also Read: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. వీవో నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్, ప్రైస్ కూడా తక్కువే!

డిమాండ్ పెరుగుతుండంతో..

గతేడాది విడుదలైన iPhone 15 ప్రారంభ ధర రూ.79,900గా ఉంది. దీంతో పోలిస్తే ఇప్పుడు iPhone 16ను తక్కువ ధరకే అందించడం గమనార్హం. మార్కెట్లో ఇతర బ్రాండ్ల నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి యాపిల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్‌లో ఐఫోన్‌కు ఉన్న డిమాండ్‌‌కు తగ్గట్టుగా ఈ తగ్గింపు కంపెనీకి బాగా కలిసివచ్చే అవకాశం ఉంది.

అద్భుతమైన ఫీచర్లు..

Advertisement

ముఖ్యంగా యువత, ఉద్యోగస్తులు ఈ ధర తగ్గింపు సద్వినియోగం చేసుకునేలా కనిపిస్తోంది. రానున్న పండుగ సీజన్‌లో ఐఫోన్ల విక్రయాలు భారీగా పెరుగుతాయని రిటైల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఏ17 చిప్, మెరుగైన కెమెరా, బ్యాటరీ లైఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్, ఇప్పుడు మరింత తక్కువ ధరకు లభిస్తుండటంతో మార్కెట్లో ఇతర ప్రీమియం బ్రాండ్లకు గట్టిపోటీ తప్పేలా లేదు. వచ్చే రోజుల్లో ఈ ధరల మార్పు ఐఫోన్ అమ్మకాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.

Also Read: రూ.8,000 లోపే అదిరిపోయే స్మార్ట్ టీవీలు.. ఈ ఆఫర్‌ను మిస్ చేసుకుంటే తర్వాత మీరే బాధపడతారు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×