E-Paper
Advertisement

iPhone 16 Design Revealed: మైండ్ బ్లోయింగ్.. ఐఫోన్ 16 డిజైన్ లీక్.. మామూలుగా లేదు.. వీడియో చుసేయండి మరీ!

iPhone 16 Design Revealed: మైండ్ బ్లోయింగ్.. ఐఫోన్ 16 డిజైన్ లీక్.. మామూలుగా లేదు.. వీడియో చుసేయండి మరీ!
Advertisement

iPhone 16 Design Revealed: భారతీయ మార్కెట్‌లో ఐఫోన్లకు సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. ఫోన్ అంటే ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. మార్కెట్‌లోకి కొత్త సిరీస్ వస్తుందంటే చాలు ఎగబడి కొనేస్తుంటారు. ఇందులో భాగంగానే యాపిల్ కంపెనీ కూడా కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తూ ఐఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది.

ఇక ఇప్పటికే ఐఫోన్ 15 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన యాపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ 16 సిరీస్‌ను ఫోన్ ప్రియులకు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ కొత్త Apple iPhone 16 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఎందుకంటే యాపిల్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఐఫోన్ సిరీస్‌లన్నీ సెప్టెంబర్‌లో విడుదల చేసినవే.. అందువల్లనే ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ సెప్టెంబర్‌లో పరిచయం చేయనుంది.

Advertisement

ఇక త్వరలో రాబోయే ఈ iPhone 16 గురించి చాలా వార్తలు ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ ఫోన్ ఫీచర్లు, డిజైన్‌కు సంబంధించి మరికొన్ని లీక్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లీకైన వార్తల ప్రకారం.. ఈసారి ఐఫోన్ 16 డిజైన్‌లో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఐఫోన్ 16 డిజైన్‌కు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది.

Also Read: బిగ్ అప్‌డేట్.. ఐఫోన్ 16 ప్లస్ ధర, ఫీచర్లు లీక్.. ఏముంది రా నాయనా..!

Advertisement

ఐస్ యూనివర్స్ అనే ప్రసిద్ధ టిప్‌స్టర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఐఫోన్ 16 బ్యాక్ కవర్‌ను చూపించాడు. ఈ లీకైన కవర్ ప్రకారం.. కొత్త ఐఫోన్ 16లోని కెమెరాలు ఐఫోన్ 12లోని కెమెరాల మాదిరిగానే వెనుకవైపు నిలువుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కొత్త కవర్ డిజైన్‌లో ఫోన్ రైట్ సైడ్ కొత్తగా చిన్న కన్నం కనిపిస్తుంది. ఇది ఐఫోన్ 16 ప్రో మోడల్‌లలో మాత్రమే వచ్చే ప్రత్యేక కెమెరా బటన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ బటన్ ఫోటోలు తీయడానికి మాత్రమే ఉపయోగించబడుతుందని తెలుస్తోంది. దానిని ఒకసారి నొక్కితే ఫోకస్ అవుతుంది. రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నొక్కితే ఫోటో తీస్తుంది. దీని ద్వారా అది కెమెరాను ఉపయోగించిన అనుభవాన్ని ఇస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ బటన్ కంపెనీ ప్రత్యేక టెక్నాలజీ (హాప్టిక్ ఇంజిన్) నుండి శక్తిని పొందుతుంది.

Also Read: ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 15 ప్రో మ్యక్స్‌.. స్పెసిఫికేషన్స్ ఎందులో బాగున్నాయంటే?

ఇది iPhone 15 Pro వంటి ప్రత్యేక వీడియో రికార్డింగ్‌ను కూడా చేయగలదు. ఐఫోన్ 16 వాల్యూమ్, పవర్ బటన్‌లు కాకుండా మరిన్ని బటన్‌లను కలిగి ఉండవచ్చని లీకైన కవర్ చూపిస్తుంది. iPhone 15 Pro నుండి ‘యాక్షన్’ బటన్ కూడా iPhone 16లో తిరిగి రావచ్చని తెలుస్తోంది. మొత్తం మీద ఈ లీక్ అయిన సమాచారం నిజమే అయితే.. iPhone 16 లుక్, డిజైన్‌ మరింత మందిని అట్రాక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు.

Tags

Related News

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

Big Stories

Advertisement
×