BigTV English

Fire Accident in Delhi: ఢిల్లీలో విషాదం.. మంటల్లో చిక్కుకుని నలుగురి మృతి!

Fire Accident in Delhi: ఢిల్లీలో విషాదం.. మంటల్లో చిక్కుకుని నలుగురి మృతి!

Fire Accident in Delhi: ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ప్రేమ్ నగర్లో ఓ ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున ఆ ఇంటిలోని ఇన్వర్టర్ లో మంటలు చెలరేగడంతో ఇల్లంతా పొగ కమ్మేసింది. ఆ మంటలు క్రమంగా సోఫాకు వ్యాపించగా.. పొగ మరింత ఎక్కువై.. పై అంతస్తులో నిద్రిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులు ఊపిరాడక మరణించారు. భర్త, భార్య, ఇద్దరు కుమారులు మరణించనట్లు స్థానికులు తెలిపారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని పోస్టుమార్టంకు తరలించారు. మృతులను హీరాసింగ్ (48), భార్య నీతూ సింగ్, కుమారులు రాబిన్ సింగ్ (22), లక్షయ్ (21)లుగా గుర్తించారు. మంటల్లో చిక్కుకున్న వారిని ఫైరింజన్ సిబ్బంది రక్షించి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం


నెలరోజుల వ్యవధిలో ఢిల్లీలో 5 అగ్నిప్రమాదాలు జరిగాయి. గత నెల 26న వివేక్ విహార్ ప్రాంతంలోని న్యూ బోర్న్ బేబీ కేర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరగ్గా.. ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. జూన్ 6న మరో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగ్గా.. 50 మంది తృటిలో తప్పించుకున్నారు. జూన్ 9న నరేలా ప్రాంతంలోని ఒక ఆహారశుద్ధి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. వారంరోజుల క్రితం తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోనూ అగ్నిప్రమాదం జరిగింది. ఇలా ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×