Apple iPhone 17e vs Google Pixel 10a: ప్రముఖ టెక్ దిగ్గజాలు యాపిల్, గూగుల్ సంస్థలు తమ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో Google Pixel 10a ఫిబ్రవరి 18న విడుదల కానుండగా.. ఆ మరుసటి రోజే ఫిబ్రవరి 19న iPhone 17e లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణుల అంచనా. ఈ రెండు ఫోన్లు సామాన్యులను ఆకర్షించేలా అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ బ్రాండ్ల యొక్క పూర్తి విరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 17e మునుపటి మోడల్స్ కంటే చాలా సన్నగా, మరింత స్టైలిష్‌గా ఉండబోతోందని ఇప్పటికే ఫొటోల ద్వారా స్పష్టమైంది. దీనిలో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేతో పాటు Dynamic Island ఫీచర్ ఉండనుంది. అయితే దీనిలో రిఫ్రెష్ రేట్ మాత్రం 60Hzకే పరిమితం కావచ్చు. ఇక పనితీరు విషయానికి వస్తే.. యాపిల్ తన లేటెస్ట్ A19 చిప్‌ను ఈ ఫోన్‌లో అమర్చిందని సమాచారం. 8GB RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉండొచ్చు. అలాగే ఫోన్ వెనుక వైపు 48MP మెయిన్ కెమెరా, ముందు వైపు 18MP సెల్ఫీ కెమెరా ఉండనుంది. 25W మాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్‌కు అదనపు ఆకర్షణగా నిలవనుంది.
Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ ట్యాబ్లెట్ ధర ఇంత తగ్గిందా? యాపిల్ వాచ్‌పై కూడా క్రేజీ డీల్!
ఇక గూగుల్ పిక్సెల్ 10a విషయానికొస్తే.. ఇది 6.3 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో, స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. దీనిలో గూగుల్ సొంత టెన్సర్ G5 ప్రాసెసర్ వాడే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో రానున్న ఈ ఫోన్‌లో జెమినీ AI ఫీచర్లు హైలైట్‌గా నిలవనున్నాయి. అలాగే కెమెరా పరంగా 48MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ను గూగుల్ అందిస్తోంది. ఇక ఈ ఫోన్‌లో 5100mAh భారీ బ్యాటరీ ఉంటుందని అంచనా.
ఇప్పటి వరకు వెలువడిన సమాచారం ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 10a రూ.49,999 ప్రారంభ ధర ఉండొచ్చు. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. మరోవైపు.. ఐఫోన్ 17e బేస్ వేరియంట్ ధర సుమారు రూ.59,900 వరకు ఉండవచ్చని నిపుణుల అంచనా. ప్రీమియం బ్రాండ్ అనుభవం కావాలనుకునే వారికి ఐఫోన్, మెరుగైన డిస్‌ప్లే, కెమెరా ఫీచర్లు కావాలనుకునే వారికి పిక్సెల్ మంచి ఆప్షన్‌గా నిలవనున్నాయి.
Also Read: అమెజాన్‌లో శాంసంగ్ S25 అల్ట్రాపై క్రేజీ డిస్కౌంట్.. ఆఫర్ పూర్తి వివరాలు మీ కోసం..