E-Paper
Advertisement

Swayambhu Teaser Review: నిఖిల్ ‘స్వయంభు’ సినిమా టీజర్ ఎలా ఉందంటే?.. అది ఓకే కానీ..

Swayambhu Teaser Review: నిఖిల్ ‘స్వయంభు’ సినిమా టీజర్ ఎలా ఉందంటే?.. అది ఓకే కానీ..
Advertisement

Swayambhu Teaser Review: నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ‘స్వయంభు’ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? లేదో ఇక్కడ చూద్దాం.

Read also-Sankranti 2027: ఒకేసారి పోటీకి సిద్ధం అవుతున్న సీనియర్ స్టార్స్.. ఇది కదా అసలైన వార్!

కథ

Advertisement

ఈ సినిమా 985 AD కాలం నాటి కథగా కనిపిస్తోంది. ముఖ్యంగా శివుడు శ్రీరాముడికి బహుకరించిన ‘సెంగోల్’ (రాజదండం) చుట్టూ కథ తిరుగుతుంది. ఆ పవిత్ర దండాన్ని దక్కించుకోవడానికి జరిగే యుద్ధాలు, ధర్మాన్ని నిలబెట్టే క్రమంలో హీరో పోరాటం టీజర్‌లో ప్రధానంగా కనిపిస్తోంది.

ఎవరు ఎలా చేశారంటే..

నిఖిల్ ఈ సినిమాలో తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. ఒక పరాక్రమవంతుడైన యోధుడిగా నిఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ఆయన శ్రమ, పోరాట పటిమ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. రాజమౌళి లాంటి దర్శకుడితో దాదాపు తొమ్మిది సినిమాలు పనిచేసిన సినిమాటో గ్రఫర్ సెంధిల్ కుమార్ అందించిన ఫ్రేమింగ్ ప్రేక్షకులను మరో లోకానికి తీసుకుపోతుంది. ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా, రిచ్‌గా ఉండి వీక్షకులకు మంచి విజువల్ ఎక్పీరియన్స్ అందిస్తుంది. కేజీఎస్ లాంటి పాన్ ఇండియా సినిమాలకు సూపర్ హిట్ సంగీతం అందించిన రవి బస్రూర్ నేపథ్య సంగీతం (BGM) యుద్ధ సన్నివేశాల్లో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. వీఎఫ్‌ఎక్స్ 985 కాలం నాటి వాతావరణాన్ని ఎం. ప్రభాకరన్, రవీంద్ర అద్భుతంగా సృష్టించారు. ఇక నటీ నటుల విషయానికి వస్తే.. సంయుక్త మీనన్, నభా నటేష్ కూడా పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపిస్తున్నారు. సుబ్బరాజు, సునీల్ వంటి వారు కీలక పాత్రల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సునీల్ అయితే ఎప్పుడూ చూడని లుక్ లో కనిపించారు.

Advertisement

Read also-Pradeep Ranganathan: నిర్మాతగా మారనున్న ప్రదీప్ రంగనాథన్.. హీరోయిన్గా తొలి అవకాశం ఆమెకే?

ఇవి ఉండాల్సింది..

టీజర్ ను చూస్తుంటే మొత్తం ఒకే టెంపోలో వెళిపోతుంది. దర్శకుడు ఒక స్టోరీని మాత్రమే చెప్పాలి అనుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే సెంగోల్ కోసం రాజకుటుంబంలోనే అంతర్ యుద్ధం జరుగితే గెలిచేవారు. వారిని ఎవరు గెలిపిస్తారు, అన్నదే సినిమా ప్రధాన ధ్యేయంగా కనిసిస్తుంది. ఎక్కడా టీజర్ లో ప్రేక్షకులు ఎందుకు ఈ సినిమా చూడాలి అన్నకు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఉదాహరణకు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇలాంటి కన్ఫ్లిక్ట్ లేకుండా టీజర్ వెళిపొతుంది. డైలాగులు టీజర్ కు మంచి డెప్త్ యాడ్ చేసినా.. ఎక్కడో వాయిస్ లో ఆ పవర్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు కూడా ఎక్కడో చూసినట్లు అనిపిస్తాయి. మొత్తంగా దర్శకుడు చెప్పాలనుకున్నది ఎక్కడా డ్రామా లేకుండా చెప్పేశారు. దీంతో ఈ టీజర్ చూడొచ్చు కానీ ఫీల్ మాత్రం కాలేము. ప్రస్తుతానికి ఇది టీజర్ మాత్రమే కావడంతో ట్రైలర్ వచ్చాకా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×