E-Paper
Advertisement

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రోలో ఊహించని మార్పులు.. యాపిల్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రోలో ఊహించని మార్పులు.. యాపిల్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Advertisement

iPhone 18 Pro: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రతిఏటా తమ ఐఫోన్ డిజైన్‌లో ఏదో ఒక మ్యాజిక్ చేస్తూనే ఉంటుంది. మరి కొద్దిరోజుల్లో రాబోతున్న ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్ మోడల్స్‌‌లో కూడా కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తాజా లీక్స్ ప్రకారం.. ఈసారి ఐఫోన్ స్క్రీన్ పైన ఉండే ఆ డైనమిక్ ఐలాండ్ సైజు తగ్గబోతోందట. ఐఫోన్ 14 ప్రోతో మొదలైన ఈ ఫీచర్‌ను ఇప్పుడప్పుడే తీసేయకుండా, దాన్ని మరింత స్టైలిష్‌గా, చిన్నదిగా మార్చాలని యాపిల్ ప్లాన్ చేస్తోంది.

ఆల్ స్క్రీన్‌గా ఐఫోన్ 18 ప్రో:

సాధారణంగా ఫేస్ ఐడి కోసం వాడే సెన్సార్లు డిస్‌ప్లే పైభాగంలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. కానీ ఐఫోన్ 18 ప్రోలో కొన్ని కీలకమైన సెన్సార్లను స్క్రీన్ కింద సెట్ చేయాలని కంపెనీ చూస్తోంది. దీంతో డైనమిక్ ఐలాండ్ చిన్నదిగా మారిపోతుంది. చూడటానికి స్క్రీన్ చాలా నీట్‌గా, పెద్దదిగా కనిపిస్తుంది. నిజానికి ఈ మార్పు ఎప్పుడో రావాల్సింది. కానీ టెక్నాలజీ పరంగా కొన్ని చిక్కులు ఉండటంతో 2026 చివరి నాటికి ఇది పక్కాగా వస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఐఫోన్‌ను పూర్తి ఆల్ స్క్రీన్ ఫోన్‌గా మార్చాలనే యాపిల్ యోచిస్తోంది.

Advertisement

Also Read: వర్త్ వర్మా వర్త్.. శాంసంగ్ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ AI ఇయర్‌బడ్స్ వచ్చేశాయ్!

లాంచ్ ఎప్పుడు? ధరెంత ఉండొచ్చు?

యాపిల్ సెంటిమెంట్ ప్రకారం.. 2026 సెప్టెంబర్ నెలలోనే ఈ కొత్త ఐఫోన్లు మార్కెట్లోకి వస్తాయి. మరి ధర సంగతేంటి చూసుకుంటే.. ఐఫోన్ 18 ప్రో సుమారు రూ.1,00,000 నుంచి మొదలవ్వచ్చు. ఇక ప్రో మాక్స్ ధర అంతకంటే ఎక్కువే ఉంటుంది. కొత్త ఫీచర్లు, విడిభాగాల ఖర్చును బట్టి ధరల్లో అటు ఇటుగా మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఫాన్స్ వెయింటింగ్ ఇక్కడ:

Advertisement

ప్రస్తుతం ఐఫోన్ వాడుతున్న వారికి ఈ చిన్న డైనమిక్ ఐలాండ్ అప్‌డేట్ కచ్చితంగా నచ్చుతుంది. మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు ఇది పెద్దగా అడ్డు రాకుండా ఉంటుంది. అయితే అసలు స్క్రీన్ మీద ఏ గీతలూ, చుక్కలూ లేకుండా క్లీన్‌గా ఉండాలనుకునే వారు మాత్రం 2027 వరకు ఆగాల్సిందే. అప్పుడే యాపిల్ తన యానివర్సరీ మోడల్‌లో సెన్సార్లన్నింటినీ స్క్రీన్ కింద పూర్తిగా సెట్ చేయనుంది. ఏదేమైనా.. ఐఫోన్ 18 ప్రో పాత మోడల్స్ కంటే చాలా కొత్తగా, స్టైలిష్‌గా ఉండబోతోందని మాత్రం అర్థమవుతోంది.

Also Read: మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా? ఆ ఒక్క యాప్ చేసే పనే ఇదంతా!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×