చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు, సేవా రంగంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం (DW&CW&EO) ఆధ్వర్యంలో నడుస్తున్న వన్ స్టాప్ సెంటర్ లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలన్నీ పూర్తిస్థాయిలో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను నేరుగా కార్యాలయానికి వెళ్లి సమర్పించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (1), పారా లీగల్ పర్సనల్/లాయర్ (1), పారామెడికల్ పర్సనల్ (1), సైకో-సోషల్ కౌన్సిలర్ (1), ఆఫీస్ అసిస్టెంట్ (1) పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు కేస్ వర్కర్స్ విభాగంలో 3 పోస్టులు, మల్టీ పర్పస్ స్టాఫ్ (హెల్పర్) విభాగంలో 3 పోస్టులు, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ విభాగంలో 3 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో పని చేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
జీతం:
జీతభత్యాల విషయానికి వస్తే సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుకు నెలకు రూ.34,000 వేతనం చెల్లిస్తారు. మిగిలిన పోస్టులకు ఎంపికైన వారికి వారి హోదాను బట్టి రూ.13,000 నుండి రూ.20,000 వరకు గౌరవ వేతనం ఉంటుంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆసక్తి ఉన్న వారు ఆఫ్ లైన్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు పత్రాలను అవసరమైన సర్టిఫికెట్లతో కలిపి ‘జిల్లా స్త్రీ శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయము, 2వ అంతస్తు, అంబేడ్కర్ భవనం, కలెక్టరేట్, చిత్తూరు’ అనే చిరునామాలో అందజేయాలి.
చివరి తేది: 2026 మార్చి 9
గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను అధికారులు పరిగణనలోకి తీసుకోరు. చిత్తూరు జిల్లా పరిధిలోని అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://chittoor.ap.gov.in/