E-Paper
Advertisement

Top EV Cars Under Rs.20 Lakh: టాటా నెక్సాన్ To MG విండ్సర్.. రూ. 20 లక్షల్లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Top EV Cars Under Rs.20 Lakh: టాటా నెక్సాన్ To MG విండ్సర్.. రూ. 20 లక్షల్లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Top EV Cars Under Rs.20 Lakh In India 2026: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. ఇందుకు అనుగుణంగానే టాప్ ఆటో మోబైల్ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తక్కువ ధరలో మెరుగైన రేంజ్ అందించేలా కార్లను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో రూ. 20 లక్షల లోపు ఉన్న టాప్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిలో టాటా నెక్సాన్ EV, టాటా పంచ్ EV, MG విండ్సర్ EV, మహీంద్రా XUV400 EV సహా పలు కార్లు ఉన్నాయి.  దాదాపు రూ. 8 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ మోడళ్లు 300 కిలో మీటర్ల నుంచి 450 కి.మీ రేంజ్ ను అందిస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్, 5 స్టార్ భద్రతను అందిస్తాయి. ఇంతకీ ఆ కార్లు ఏవంటే..

⦿ టాటా నెక్సాన్ EV-: ధర రూ. 12.49 లక్షల నుంచి ప్రారంభం  

ఈ కారు 30 kWh, 40.5 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. 6 ఎయిర్‌ బ్యాగులు, 5 స్టార్ GNCAP భద్రతను కలిగి ఉంది. బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 12.49 లక్షలు ఉంటుంది. టాప్ వేరియంట్ ధర రూ. 17.19 లక్షలు ఉంటుంది. ఒకే ఛార్జ్ తో 465 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.

⦿ MG విండ్సర్ EV: ధర రూ. 11.98 నుంచి ప్రారంభం..

Advertisement

ఈ కారు బేస్ వేరియంట్ ధర రూజ 11.98 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 14 లక్షలు ఉంటుంది. ఒకే ఛార్జ్ తో 332 కి.మీ నుంచి 449 కి.మీ వరకు ఉంటుంది. ఈ కారు విశాలంగా ఉంటుంది. చక్కటి లాంజ్, వెనుక సీటు, 38 kWh బ్యాటరీ సహా హై టెక్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ టాటా పంచ్ EV: ధర రూ. 9.69 లక్షల నుంచి ప్రారంభం

ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షలు ఉంటుంది. ఈ కారు ఒకే ఛార్జ్ తో 260 కి.మీ నుంచి 350 కి.మీ రేంజ్ అందిస్తుంది. 5-స్టార్ భద్రతా రేటింగ్‌తో కూడిన కాంపాక్ట్ SUVగా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. 26 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తి అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

⦿ మహీంద్రా XUV400 EV: ధర రూ. 15 లక్షల నుంచి ప్రారంభం

Advertisement

ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ. 15 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 19.00 లక్షలు ఉంటుంది. శక్తివంతమైన మోటారు, విశాలమైన క్యాబిన్, నమ్మకమైన పనితీరును కలిగి ఉంటుంది.

⦿ టాటా కర్వ్ EV: ధర రూ. 17.49 లక్షలు

ఈ కారు స్టైలిష్ SUV కూపే డిజైన్ ను కలిగి ఉంటుంది. 45–55 kWh బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంటుంది. అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ MG ZS EV: ధర రూ. 17.99 లక్షల నుంచి ప్రారంభం

ఈ కారు ధర బేస్ వేరియంట్‌ రూ. 17.99 లక్షలు ఉంటుంది. టాప్ వేరియంట్ ధర రూ. 19.50 లక్షలు ఉంటుంది. ఈ కారు  50.3 kWh బ్యాటరీతో వస్తుంది. ప్రీమియం పెద్ద SUVగా గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: హ్యుందాయ్ To స్కోడా.. ఈ ఏడాదిలో లాంచ్ కాబోయే క్రేజీ సెడాన్ కార్లు!

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×