E-Paper
Advertisement

Apple iPhone Ads: ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఇప్పుడు ఐఫోన్స్‌లో కూడా యాడ్స్.. ఆదాయం కోసం ఆపిల్ కీలక నిర్ణయం

Apple iPhone Ads: ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఇప్పుడు ఐఫోన్స్‌లో కూడా యాడ్స్.. ఆదాయం కోసం ఆపిల్ కీలక నిర్ణయం
Advertisement

Apple iPhone Ads| మీరెప్పుడైనా ఏదైనా వస్తువు, లేదా సర్వీస్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తే ముందుగా వచ్చే రిజల్ట్స్ గమనించారా? అవి ప్రమోట్ చేసే యాడ్స్ ఉంటాయి. వాటి పక్కనే స్పాన్‌సర్డ్ అని కూడా ఉంటుంది. అలాగే గూగుల్ మ్యాప్స్‌ లాంటి యాప్‌లలో వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు తమ లొకేషన్‌ని ప్రమోట్ చేయడానికి డబ్బులు చెల్లిస్తాయి. ఉదాహరణకు, “స్విమ్మింగ్ పూల్” లేదా “నూడుల్స్” అని సెర్చ్ చేస్తే స్పాన్సర్డ్ లిస్టింగ్స్ ముందుగా కనిపించవచ్చు. ఎక్కువ బిడ్డింగ్ చేసిన వాళ్లు టాప్‌లో వస్తారు. గూగుల్ మ్యాప్స్, Yelp యాప్‌లో ఇలాంటి సిస్టమ్ ఇప్పటికే ఉంది. ఆపిల్ కూడా అదే తరహాలో ఆదాయం పెంచుకోవడానికి పోటీ పడాలనుకుంటోంది.

రిపోర్ట్ వివరాలు, ఇండస్ట్రీ సమాచారం

బ్లూమ్‌బెర్గ్‌ సంస్థకు చెందిన మార్క్ గుర్మాన్ అనే టెక్ నిపుణుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆపిల్ ఈ ప్రకటనల ఫీచర్‌పై చురుకుగా పని చేస్తోందని అతను చెప్పాడు. అయితే ఆపిల్ ఇంకా అధికారికంగా ఏమీ ధృవీకరించలేదు. కంపెనీ సాధారణంగా పెద్ద అప్‌డేట్ల మౌనంగానే అమలు చేస్తుంది.

ఆదాయం పెంపుపై ఆపిల్ సర్వీసెస్ ఫోకస్

Advertisement

ఆపిల్ తన సర్వీసెస్ విభాగాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ విభాగం సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం తెస్తోంది. సబ్‌స్క్రిప్షన్లు, యాప్స్, డిజిటల్ కంటెంట్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ప్రకటనలు కొత్త ఆదాయ మార్గం అవుతాయి. ఇది హార్డ్‌వేర్ సేల్స్‌పై ఆధారపడకుండా సహాయపడుతుంది.

ఆపిల్ ప్రకటనల వ్యాపారం విస్తరణ

ఆపిల్ ప్రకటనల విభాగం ఇంకా చిన్నదే కానీ ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఈ సంవత్సరం సుమారు 8.5 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇప్పటికే యాప్ స్టోర్, ఆపిల్ న్యూస్, పాడ్‌కాస్ట్‌లలో ప్రకటనలు చూపిస్తోంది. మ్యాప్స్‌లో కూడా ఈ యాడ్స్ మోడల్ జోడిస్తే ఈ ఎకోసిస్టమ్ మరింత బలపడుతుంది.

లాంచ్ ఎప్పుడంటే?

Advertisement

రిపోర్టుల ప్రకారం.. ఈ వేసవిలోగా మ్యాప్స్‌లో యాడ్స్ కనిపిస్తాయి. ఐఫోన్‌లు, ఇతర ఆపిల్ డివైస్‌లలో రోల్ అవుట్ మొదలవుతుంది. ఆపిల్ అడ్వర్టైజింగ్ డివిజన్ ఈ ప్రాజెక్ట్‌పై చురుకుగా పని చేస్తోంది.

Also Read:  మీ ఇంట్లోనే ఏఐ డాక్టర్.. పర్‌ప్లెక్సిటీలో కొత్త ఏఐ హెల్త్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే?

యూజర్లపై ప్రభావం

యూజర్లు సెర్చ్ చేస్తున్నప్పుడు స్పాన్సర్డ్ ఫలితాలు ఎక్కువగా కనిపించవచ్చు. కొందరు వాటిని ఉపయోగకరంగా భావించవచ్చు. అయితే మరికొందరు స్వచ్ఛమైన, ప్రకటనలు లేని ఎక్స్‌పీరియన్స్‌ని ఇష్టపడతారు. ఆపిల్ తన యూజర్ల కోసం ఎలా అమలు చేస్తుందనేది ముఖ్యం.

ఆపిల్ తన సర్వీసెస్ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు వెతుకుతోంది. మ్యాప్స్‌లో యాడ్స్ ఒక ముఖ్యమైన మార్గం. సరైన విధంగా అమలు చేస్తే వ్యాపార లక్ష్యాలు, యూజర్ ఎక్స్‌పీరియన్స్ రెండూ బ్యాలెన్స్ అవుతాయి.

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×