Rajasthan Royals Sold: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals) తొలి కెప్టెన్, దివంగత షేన్ వార్న్ ( shane warne ) పేరు మారుమోగుతోంది. అతని ముందు చూపు కారణంగా, తన కుటుంబానికి కోట్ల ఆస్తి సంపాదించిపెట్టాడు షేన్ వార్న్. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టును (Rajasthan Royals sold ) విక్రయించిన నేపథ్యంలో షేన్ వార్న్ పిల్లలకు దాదాపు రూ. 460 కోట్ల ఆస్తి దక్కింది. దీంతో షేన్ వార్న్ మరణించినప్పటికీ కూడా, అతని పిల్లలు కోటీశ్వరులు అయ్యారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి ( son of satyamurthy) సినిమా స్టోరీని క్రికెట్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. త్రివిక్రమ్ రాసుకున్న కథను రాజస్థాన్ మాజీ కెప్టెన్ షేన్ వార్న్ నిజం చేసేసాడని పోస్టులు పెడుతున్నారు.
రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్, దివంగత షేన్ వార్న్ అప్పట్లో తెలివిగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రూ. 460 కోట్లు తీసుకువచ్చి పెట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2008 సమయంలో ప్రారంభమైంది. అయితే అప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన షేన్ వార్న్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. తొలి సీజన్ లోనే రాజస్థాన్ రాయల్స్ కు టైటిల్ కూడా తీసుకువచ్చాడు. అయితే మొదటి సీజన్ లో ఆడేటప్పుడే కొన్ని కండిషన్స్ పెట్టాడు షేన్ వార్న్.
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడినందుకు జీతంతో పాటు, ప్రతి సంవత్సరం జట్టులో 0.75 శాతం వాటా కావాలని తెలివిగా డీల్ కుదుర్చుకున్నాడు. అలా వరుసగా నాలుగు సీజన్ల పాటు ఆడిన షేన్ వార్న్, మూడు శాతం వాటాను రాజస్థాన్ రాయల్స్ జట్టులో దక్కించుకున్నాడు. అటు జీతం రూపంలో రూ.9.35 కోట్లు దక్కించుకున్నాడు. అయితే లేటెస్ట్ గా రాజస్థాన్ రాయల్స్ జట్టు విక్రయానికి రాగా 15,301 కోట్ల రూపాయలు పలికింది. అంటే ఇప్పుడు మూడు శాతం కలిగి ఉన్న షేన్ వార్న్ ఫ్యామిలీకి రూ. 460 కోట్లు దక్కనున్నాయి. ఇక ఈ రూ. 460 కోట్ల రూపాయలను షేన్ వార్న్ పిల్లలు బ్రూక్, జాక్సన్, సమ్మర్ దక్కించుకోనున్నారు.
సుదీర్ఘకాలం పాటు ఆస్ట్రేలియా కు సేవలు అందించిన షేన్ వార్న్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా తన సత్తా చాటాడు. అయితే అలాంటి షేన్ వార్న్ 2022 మార్చి 4వ తేదీన థాయిలాండ్ లో అనుమానాస్పదంగా మృతి చెందారు. తన స్నేహితులతో కలిసి థాయిలాండ్ వెళ్లిన షేన్ వార్న్ అక్కడే గుండెపోటుతో మరణించారు. అయితే అతనిది సాధారణ మరణమా ? ఎవరైనా హత్య చేశారా ? అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కానీ పోలీసులు మాత్రం గుండెపోటుతోనే మరణించారని అప్పట్లో నివేదికలు ఇచ్చారు.
?igsh=NTlrcndwczd3Zmd2