E-Paper
Advertisement

Apple Budget MacBook: బడ్జెట్ ల్యాప్‌టాప్ లాంచ్ చేయనున్న ఆపిల్.. మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే ధర తక్కువ

Apple Budget MacBook: బడ్జెట్ ల్యాప్‌టాప్ లాంచ్ చేయనున్న ఆపిల్.. మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే ధర తక్కువ
Advertisement

Apple Budget MacBook 2026| టెక్ దిగ్గజం ఆపిల్ తయారు చేసే ఐఫోన్స్, ఐప్యాడ్స్, మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్స్ చాలా హై క్వాలిటీ కలిగి ఉంటాయి. అందుకే వాటి ధరలు కూడా చాలా ఎక్కువ. ఖరీదైన టెక్ గాడ్జెట్స్ కొనడం మధ్య తరగతి యూజర్లకు కష్టమవుతుంది. అందుకే ఐఫోన్స్, మ్యాక్‌బుక్స్ కొనాలని కోరిక ఉన్నా మిడ్ రేంజ్ యూజర్లు ఇతర బ్రాండ్స్ తో తృప్తి పడాల్సి ఉంటుంది. అయితే ఆపిల్ ఇప్పుడు మిడ్ రేంజ్ యూజర్ల కోసం బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్స్ తీసుకురాబోతోంది.

కొత్త రిపోర్ట్ ప్రకారం ఆపిల్ 2026లో లో-కాస్ట్ మ్యాక్‌బుక్ లాంచ్ చేయవచ్చు. ఈ మోడల్ ప్రస్తుత మ్యాక్‌బుక్ ఏయిర్ కంటే తక్కువ ధరలో రావచ్చు. లాంచ్ అయితే ఆపిల్ ల్యాప్‌టాప్ స్ట్రాటజీలో పెద్ద మార్పు అవుతుంది. కంపెనీ ఇంతకుముందు బడ్జెట్ ల్యాప్‌టాప్ కొనుగోలుదారులను పట్టించుకోలేదు. ఆపిల్ తాజా నిర్ణయంతో తక్కువ ధరలో లభించే విండోస్, క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లకు తీవ్ర పోటీ నివ్వబోతోంది.

బడ్జెట్ మ్యాక్‌బుక్ లాంచ్ టైమ్‌లైన్

Advertisement

ట్రెండ్‌ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం.. ఆపిల్ స్ప్రింగ్ 2026లో ఈ మ్యాక్‌బుక్ అన్‌వీల్ చేయవచ్చు. లాంచ్ విండో మార్చి నుంచి మే నెల మధ్య ఉండవచ్చు. ఈ మ్యాక్‌బుక్ కీలక విడిభాగాలు మాస్ ప్రొడక్షన్ 2025 చివర్లో ప్రారంభమైంది. ఆపిల్ లాంగ్-టర్మ్ షిప్‌మెంట్స్ ప్లాన్ చేసి ప్రొడక్షన్ కాస్ట్స్ తగ్గించాలనుకుంటోంది. ఈ అప్రోచ్ లాంచ్ తర్వాత లోయర్ ప్రైసింగ్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

ఆ కస్టమర్లే టార్గెట్

ఆపిల్ ఈ మ్యాక్‌బుక్‌ను స్టూడెంట్స్, ఫస్ట్-టైమ్ మ్యాక్ యూజర్ల కోసమే ప్రత్యేకంగా తీసుకురానుంది. బడ్జెట్ ఆలోచించే కొనుగోలుదారులకు ఈ మోడల్ ఆకర్షణీయంగా ఉంటుంది. విండోస్ ల్యాప్‌టాప్‌ల నుంచి మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్స్‌కు స్విచ్ అయ్యేవారిని కూడా ఆకర్షిస్తుంది. ఆపిల్ మరిన్ని యాక్సెసిబుల్ ధరలో macOS ఆఫర్ చేయాలనుకుంటోంది. కొత్త మ్యాక్‌బుక్ ఆపిల్ లైనప్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే తక్కువ ఉండవచ్చు.

డిస్‌ప్లే సైజ్, డిజైన్ అప్రోచ్

Advertisement

ల్యాప్‌టాప్‌లో 12.9 అంగుళాల డిస్‌ప్లే ఉండవచ్చు. ఇది ఆపిల్ ప్రస్తుత చిన్న మ్యాక్‌బుక్ అవుతుంది. మ్యాక్‌బుక్ ఎయిర్.. 13 అంగుళాలతో మొదలవుతుంది. స్క్రీన్ సైజ్ కొన్ని ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో మోడల్స్‌కు మ్యాచ్ అవుతుంది. ఆపిల్ ఎక్సిస్టింగ్ డిస్‌ప్లే కాంపోనెంట్స్ రీయూజ్ చేసి ధర తగ్గించవచ్చు. డిజైన్ సన్నగా, లైట్‌వెయిట్‌గా ఉంటుంది. బ్లూ, సిల్వర్, పింక్, ఎల్లో వంటి బ్రైట్ కలర్స్ ఆఫర్ చేయవచ్చు.

ప్రాసెసర్, పర్‌ఫామెన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ 

ఆపిల్ ల్యాప్‌టాప్‌ను A18 ప్రో చిప్‌తో పవర్ చేయవచ్చు. ఈ ప్రాసెసర్ ప్రస్తుతం ఐఫోన్ 16 ప్రో మోడల్స్‌లో ఉంది. ఇందులో సిక్స్-కోర్ CPU, సిక్స్-కోర్ GPU ఉన్నాయి. 16-కోర్ న్యూరల్ ఇంజిన్ కూడా ఉంది. పనితీరు ఒరిజినల్ M1 మ్యాక్‌బుక్ ఏయిర్‌కు మ్యాచ్ అవుతుంది. బ్రౌజింగ్, డాక్యుమెంట్స్, మీడియా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది.

Also Read: రూ.80లోపు జియో సూపర్ డేటా ప్యాక్స్.. 10GB డేటా కేవలం రూ.11

ధర తగ్గించడానికి లో కాన్ఫిగరేషన్ హార్డ్‌వేర్

మ్యాక్‌బుక్ 8GB RAMతో లాంచ్ కావొచ్చు. ఆపిల్ ప్రైసింగ్ తగ్గించడానికి ప్రీమియం ఫీచర్లను తొలగించే అవకాశం ఉంది. థండర్‌బోల్ట్ సపోర్ట్ లేకపోవచ్చు. ల్యాప్‌టాప్ స్టాండర్డ్ USB టైప్-C పోర్ట్స్ మాత్రమే ఆఫర్ చేయవచ్చు. డేటా స్పీడ్స్ ప్రీమియం మ్యాక్‌బుక్‌ల కంటే స్లోగా ఉంటుంది. ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే సపోర్ట్ ఒక మానిటర్‌కు మాత్రమే పరిమితం కావొచ్చు.

ధర అంచనా, మార్కెట్‌పై ప్రభావం

అమెరికాలో ఈ లో కాస్ట్ మ్యాక్‌బుక్ ధర $699 నుంచి $799 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది మ్యాక్‌బుక్ ఎయిర్ ధర కంటే $300 వరకు తక్కువ. లోయర్ ప్రైసింగ్ క్రోమ్‌బుక్, బడ్జెట్ విండోస్ యూజర్లను ఆకర్షిస్తుంది. ఆపిల్ మ్యాక్ యూజర్ బేస్ గణనీయంగా ఎక్స్‌పాండ్ చేయడానికి ఈ కొత్త లో కాస్ట్ మ్యాక్‌బుక్ కీలకం కానుంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×