E-Paper
Advertisement

All-Screen iPhone: ఐఫోన్ చరిత్రలోనే అతిపెద్ద మార్పు.. 2027లో ఫుల్ స్క్రీన్ డిజైన్‌తో కొత్త ఐఫోన్‌ను తీసుకురానున్న యాపిల్!

All-Screen iPhone: ఐఫోన్ చరిత్రలోనే అతిపెద్ద మార్పు.. 2027లో ఫుల్ స్క్రీన్ డిజైన్‌తో కొత్త ఐఫోన్‌ను తీసుకురానున్న యాపిల్!
Advertisement

All-Screen iPhone: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్.. ఐఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసి త్వరలోనే 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ కీలక మైలురాయిని గుర్తు చేసుకుని, పూర్తిగా భిన్నమైన డిజైన్‌తో ఒక స్పెషల్ ఐఫోన్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టెక్ ప్రపంచంలో గట్టిగానే చర్చ సాగుతోంది. తాజా నివేదికల ప్రకారం.. ఈ ప్రత్యేక ఐఫోన్ 2027 సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది కేవలం సాధారణ అప్‌గ్రేడ్‌గా కాకుండా, యాపిల్ ఎన్నేళ్లుగానో కలగంటున్న ‘ఫుల్ స్క్రీన్ ఐఫోన్’ కాన్సెప్ట్‌ను నిజం చేసే పరికరంగా మారవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.

నాచ్‌, డైనమిక్ ఐలాండ్‌క్ గుడ్‌బై:

మాక్‌రూమర్స్ సహా పలు విశ్వసనీయ టెక్ వేదికల కథనాల ప్రకారం.. ఈ 20వ వార్షికోత్సవ ఐఫోన్‌లో డిస్‌ప్లే మీద ఎలాంటి కటౌట్‌లు ఉండకపోవచ్చు. అంటే.. ఇప్పటివరకు చూసిన నాచ్ లేదా డైనమిక్ ఐలాండ్ ఈ ఫోన్‌లో కనిపించకుండా పోయే అవకాశం ఉంది. ఫ్రంట్ కెమెరా కోసం కూడా హోల్ లేకుండా, ఫోన్ మొత్తం ఫుల్ స్క్రీన్‌ ఉండేలా యాపిల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల వీడియోలు, గేమ్స్, ఇతర కంటెంట్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా ఆస్వాదించవచ్చని చెబుతున్నారు.

కెమెరా సెటప్ కీలకం:

Advertisement

రాబోయే ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌లోనే ఫేస్ ఐడిని డిస్‌ప్లే కిందకు తీసుకురావాలని యాపిల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అదే టెక్నాలజీని 20వ వార్షికోత్సవ ఐఫోన్‌లో మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉపయోగించే అవకాశముందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, అండర్-డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరాపై కూడా యాపిల్ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ సక్సెస్ అయితే.. ఫోన్ ముందు భాగంలో సెన్సార్లు కనిపించకపోవచ్చు.

ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లే డిజైన్:

ఈ మార్పులన్నీ నిజమైతే.. యాపిల్ నుంచి అసలైన ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లే ఐఫోన్ రావడం ఖాయం. అంచుల వద్ద వంపుతిరిగిన గాజు, కళ్లకు దాదాపు కనిపించని బెజెల్స్, బటన్లు ఉన్న చోట మాత్రమే ఉండే సన్నని మెటల్ ఫ్రేమ్‌తో అత్యంత ప్రీమియం లుక్‌పై యాపిల్ పని చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. అయితే డిస్‌ప్లే అంచులు పూర్తిగా వంగి ఉంటాయా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

సంచలనాత్మక నిర్ణయం:

Advertisement

ఇప్పటి వరకు లీకైన సమాచారం ప్రకారం.. ఇది 2017లో వచ్చిన ఐఫోన్ X‌ను గుర్తు చేస్తోంది. అప్పట్లో 10వ వార్షికోత్సవం సందర్భంగా యాపిల్ ఫేస్ ఐడి, నాచ్‌తో ఐఫోన్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు 20వ వార్షికోత్సవం సందర్భంగా కూడా అదే స్థాయిలో సంచలనాత్మక మార్పు తీసుకురావాలని యాపిల్ భావిస్తోందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రారంభ దశలోనే ప్రాజెక్ట్:

అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇవన్నీ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఆలోచనలే. లాంచ్ సమయానికి యాపిల్ తన ప్లాన్‌లలో మార్పులు చేసే అవకాశమూ లేకపోలేదు. అయినప్పటికీ, బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన ప్రముఖ టెక్ జర్నలిస్ట్ మార్క్ గుర్మాన్ గతంలో చేసిన నివేదికలు ఈ అంచనాలకు బలం ఇస్తున్నాయి. యాపిల్ ఈ ప్లాన్‌లను నిజం చేస్తే.. 2027లో వచ్చే ఐఫోన్ కేవలం మరో కొత్త మోడల్‌గా కాకుండా, ఐఫోన్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయంగా నిలిచే పరికరంగా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×