E-Paper
Advertisement

Apple sales in India : దుమ్మురేపిన ఆపిల్ ప్రొడక్ట్స్.. ఇండియాలో అమ్మకాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Apple sales in India : దుమ్మురేపిన ఆపిల్ ప్రొడక్ట్స్.. ఇండియాలో అమ్మకాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

Apple sales in India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ఆల్ టైమ్ రికార్డ్ ను నమోదు చేసింది. ఐఫోన్స్ అమ్మకాల్లో ఎప్పుడూ లేనంతగా భారత్ రికార్డు సృష్టించిందని సీఈవో టిమ్ కుక్ తెలిపారు. గత త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది మరింతగా సేల్స్ పెరిగాయని ఆపిల్ కు భారీ స్థాయిలో లాభం చేకూరిందని చెప్పుకొచ్చారు.

టక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ నుంచి విడుదలయ్యే ఐఫోన్స్, లాప్ టాప్స్, ఐప్యాడ్ కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో మెుబైల్స్ ను తీసుకొస్తున్న ఈ కంపెనీ తాజాగా ఐప్యాడ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఇప్పటికై ఐఫోన్ 16 సిరీస్ విడుదలై హాట్ కేక్స్ లో అమ్ముడయిపోయాయి. ఈ ప్రొడక్ట్స్ భారత్ లో సైతం మంచి డిమాండ్ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఎప్పుడూ లేనంతగా ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని ఆ సంస్థ సీఈవో తెలిపారు.

Advertisement

ఆపిల్ కంపెనీ భారత్ లో ఎప్పుడూ లేనంతగా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసిందని ఆపిల్ సీఈవో టీమ్ కుక్ తెలిపారు. ఇక సెప్టెంబర్ 2024 త్రైమాసికంలో ఐఫోన్స్ ను మించి ఐప్యాడ్ విక్రయాల్లో  అభివృద్ధి కనిపించిందని తెలిపారు. గత ఏడాది ఇదే 3 నెలలతో పోలిస్తే వృద్ధి రేటు పెరిగిందని… మొత్తం నికర విక్రయాలు 89.49 బిలియన్ డాలర్స్ నుంచి 6% పెరిగి 94.93 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. ఇక ఈ మెుత్తం భారతీయ కరెన్సీలో చూస్తే సుమారు రూ. 8 లక్షల కోట్లుగా ఉందని తెలిపారు.

ALSO READ :  పిక్సెల్ 9తో పోలిస్తే పిక్సెల్ 10, పిక్సెల్ 11 బెటరేనా.. అసలు అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయా!

Advertisement

ఇక అమెరికా, ఐరోపాతో పాటు ఇతర ఆసియా ఫసిఫిక్ దేశాల్లో సైతం సెప్టెంబర్ త్రైమాసికంలో ఆపిల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని… ఇప్పటికే ఆ దేశాల్లో అమ్మకాలు రికార్డును క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని టిమ్ కుక్ తెలిపారు. బ్రెజిల్, మెక్సికో, బ్రిటన్, కొరియా, ఫ్రాన్స్, అమెరికా, మలేషియా, సౌదీ అరేబియా, యూఏఈలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉందని.. ఐఫోన్స్ కు ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గటం లేదని అత్యధిక స్థాయిలో అమ్మకాలు నమోదయితున్నాయని తెలిపారు. ఇక భారత్ విషయానికి వస్తే ఆల్ టైం రికార్డ్ ను సృష్టించి ఎప్పుడూ లేనంతగా ఐప్యాడ్, ఐ ఫోన్స్ అమ్మకాలు జరిగాయన్నారు. ఇక ఏది ఏమైనా ఆపిల్ అమ్మకాలు భారత్ లో కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయనే ఈ నివేదికలు చెప్పుకొస్తున్నాయి. త్వరలోనే వీటి వృద్ధి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని.. ఆపిల్ కు మరింత లాభం చేకూర్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక  ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ లో టాప్ సిటీస్ గా ఉన్న ముంబై, ఢిల్లీలలో కొత్త స్టోర్స్ ను ఏర్పాటు చేశామని ఆపిల్ తెలిపింది. ఇక త్వరలోనే నాలుగు కొత్త స్టోర్స్ ను తీసుకు వస్తామని టిమ్ వెల్లడించిన టిమ్ కుక్.. ఈ స్టోర్స్ భారత్ లో టాప్ టెక్ సిటీగా ఉన్న బెంగళూరు, పూణే, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబయిలలో రానున్నాయని ప్రకటించారు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×