BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu Promo: గౌతమ్, యష్మీ మధ్య ‘అక్క’ గొడవపై నాగ్ కామెంట్స్.. మెగా చీఫ్‌గా విష్ణుప్రియా పాసా? ఫెయిలా?

Bigg Boss 8 Telugu Promo: గౌతమ్, యష్మీ మధ్య ‘అక్క’ గొడవపై నాగ్ కామెంట్స్.. మెగా చీఫ్‌గా విష్ణుప్రియా పాసా? ఫెయిలా?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో గతవారం పాత, కొత్త కంటెస్టెంట్స్ అంతా కలిసిపోయారు. కొత్తగా నాలుగు టీమ్స్‌గా ఏర్పడి బీబీ ఇంటికి దారేది అనే ఛాలెంజ్ ఆడారు. అయితే ఈ ఛాలెంజ్ వల్ల పాత కంటెస్టెంట్స్ మధ్య చాలానే గొడవలు జరిగాయి. ఫ్రెండ్‌షిప్స్‌ను పక్కన పెట్టి టాస్కుల్లో విచక్షణ కోల్పోయి మరీ ఆడారు. అందుకే కంటెస్టెంట్స్‌పై ఫైర్ అయ్యారు నాగార్జున. అంతే కాకుండా గౌతమ్‌తో కొందరు అమ్మాయిలకు జరిగిన గొడవల గురించి ఆయన స్పందించారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇందులో విష్ణుప్రియా మెగా చీఫ్‌గా పాసా, ఫెయిలా అనే విషయం గురించి కూడా నాగార్జున మాట్లాడారు.


మెగా చీఫ్‌గా గెలిచాను

‘‘హౌస్ అంతా నిన్ను మెగా చీఫ్‌గా మెచ్చుకుంది. ఆటలో ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టాలని నా ఫీలింగ్’’ అంటూ మాజీ మెగా చీఫ్ అయిన విష్ణుప్రియా గురించి నాగార్జున చెప్పడంతో ఈ ప్రోమో మొదలయ్యింది. ‘‘నేను గెలిచాను. హౌస్ అంతా శుభ్రంగా ఉంచాను’’ అని విష్ణుప్రియా చెప్పబోతుంటే తన చేతిలో ఉన్న ఆయుధంతో ఫోటో పగలగొట్టబోయారు నాగ్. దీంతో విష్ణు.. నారాయణ అని అరవడంతో నాగార్జునతో అందరూ నవ్వారు. ‘‘మెగా చీఫ్ కంటెండర్ రేసులో అవినాష్‌ను ఎందుకు సపోర్ట్ చేశావు? నీ టీమ్‌ను సపోర్ట్ చేయాలి కదా’’ అంటూ నబీల్, అవినాష్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గురించి మాట్లాడారు నాగార్జున.


Also Read: ప్రేరణపై నాగార్జున ఫైర్.. కింగ్‌కే ఛాలెంజ్ విసిరిన గౌతమ్, చివరికి తప్పు తెలుసుకొని..

యష్మీ ప్రాబ్లమ్ ఏంటి

‘‘నాకు ఈమధ్య కొత్తగా రెండు బూతు పదాలు తెలిశాయి. ఒకటి తెలుగులో అక్క, రెండు ఇంగ్లీష్‌లో బ్రదర్’’ అని చెప్తూ యష్మీని లేవమన్నారు నాగార్జున. ‘‘నీ ప్రాబ్లమ్ ఏంటి అక్క? అక్క అంటే ఏంటి ప్రాబ్లమ్’’ అంటూ తనను అడిగారు. ‘‘ఒకసారి క్రష్ అని, సడెన్‌గా అక్క అంటే తీసుకోలేకపోయాను’’ అని సమాధానమిచ్చింది యష్మీ. ‘‘నామినేషన్స్‌లో గౌతమ్.. విష్ణుప్రియాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు మధ్యలో జోక్యం చేసుకుంటున్నావు. తను చెప్పాలనుకుంది పూర్తిగా చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడితే బాగుండేది. అందుకే వెంటనే అక్క అని ఫైర్ అయ్యాడు’’ అంటూ గౌతమ్‌కు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు నాగార్జున.

ఓడిపోయినప్పుడే కారణాలు

నామినేషన్స్‌లో గౌతమ్, యష్మీ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను చూపించారు నాగార్జున. ‘‘గౌతమ్ అక్క అనగానే నువ్వు కూడా వెంటనే తమ్ముడు అన్నావు కదా’’ అని వీడియో చూసిన తర్వాత యష్మీని ప్రశ్నించారు. ‘‘ఆట గెలవడం ముఖ్యమా? ఆడిన తీరు ముఖ్యమా?’’ అని నాగ్ అడగగానే తీరే ముఖ్యమంటూ సైలెంట్‌గా సమాధానమిచ్చింది నయని పావని. ‘‘నేను అడిగింది యష్మీ అక్కని. నిన్ను కాదు నయని అక్క’’ అంటూ నవ్వుతూ చెప్పారు నాగార్జున. యెల్లో టీమ్‌లో ఉన్న రోహిణి, నయని పావని, పృథ్వి ఒక్క టాస్క్ కూడా గెలవలేదని గుర్తుచేశారు. దానికి సమాధానంగా టైమ్ బాలేదు అని చెప్పింది నయని. దీంతో ఓడిపోయినప్పుడు కారణాలు వెతుక్కుంటావంటూ నయనిపై సీరియస్ అయ్యారు నాగ్.

Related News

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Big Stories

×