BigTV English

Google Pixel 10 – Pixel 11 : పిక్సెల్ 9తో పోలిస్తే పిక్సెల్ 10, పిక్సెల్ 11 బెటరేనా.. అసలు అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయా!

Google Pixel 10 – Pixel 11 : పిక్సెల్ 9తో పోలిస్తే పిక్సెల్ 10, పిక్సెల్ 11 బెటరేనా.. అసలు అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయా!

Google Pixel 10 – Pixel 11 : Apple, Samsung వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలు AI, కెమెరా ఫీచర్స్ తో హై స్టాండర్డ్ మెుబైల్స్ ను మార్కెట్లోకి లాంఛ్ చేస్తూ దూసుకుపోతున్న తరుణంలో Google సైతం తన స్పీడ్ ను పెంచినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే పిక్సెల్ 9 ను లాంఛ్ చేసిన గూగుల్.. తాజాగా పిక్సెల్ 10, పిక్సెల్ 11 స్మార్ట్‌ఫోన్స్ ను లేటెస్ట్ అప్డేట్స్ తో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. బెస్ట్ కెమెరా, AI లో ఊహించిన అప్‌గ్రేడ్స్ తో త్వరలోనే వీటిని లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసలు ఇవి బెటర్ గా వస్తున్నాయా? గూగుల్ పిక్సెల్ 9తో పోలిస్తే ఏ ఫీచర్స్ ను ఇందులో అప్డేడ్ చేసిందో తెలుసుకుందాం.


Google ఎంతో ప్రతిష్టాత్మకంగా AI ఫీచర్స్ తో Pixel 9 సిరీస్‌ను ప్రారంభించింది. ఇక తాజాగా ఈ టెక్ దిగ్గజం పిక్సెల్ 10, పిక్సెల్ 11 లను అప్‌గ్రేడ్ చేసిన టెన్సర్ చిప్‌తో లాంఛ్ చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా వీటికి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఎంతో ఆసక్తికరంగా ఉండే నైట్ సైట్ ఫీచర్‌తో వీడియో బూస్ట్‌తో పిక్సెల్ 11 రాబోతుంది. దీంతో చీకటిలో సైతం అద్భుతంగా ఫోటోలు, వీడియోలు తీసే అవకాశం ఉంటుంది. ఇక పిక్సెల్ 9తో పోలిస్తే వాటిలో లేని ఎలాంటి అప్డేట్స్ ఇందులో రాబోతున్నాయో చూద్దాం.

Pixel 9 30fpsకి పరిమితమైతే Google Pixel 11 మెషిన్ లెర్నింగ్ తో 100x జూమ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక ఇది వీడియోలు, ఫోటోలు రెండింటికీ మద్దతు ఇస్తుంది. ఇందులో ఈ రెండింటికి సంబంధించిన అల్గారిథమ్స్ వేరు వేరుగా ఉంటాయని ఫార్మాట్స్ సైతం వేరుగా ఉంటాయని తెలుస్తుంది. అల్ట్రా స్మూత్ స్టెబిలైజేషన్ మోడ్, డైనమిక్ HDR అరేంజ్మెంట్స్ కూడా ఇందులో ఉండనున్నాయి.


పిక్సెల్ 10 నెక్స్ట్ జెన్ టెలిఫోటో కెమెరాతో రాబోతుందని, దీంతో జూమ్‌ను 100x పెంచుకునే అవకాశం ఉందని మరో రూమర్ సైతం చక్కర్లు కొడుతుంది. సినిమాటిక్ బ్లర్ ఫీచర్ కూడా Google Pixel 11లో 4K 30fps సపోర్ట్ చేస్తుందని.. కొత్త ‘వీడియో రిలైట్’ ఫీచర్‌కి సైతం అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఫీచర్ Google Pixel 8 వంటి క్లౌడ్ ఆధారంగా కాకుండా ఆన్ డివైస్ వీడియోలను ప్రాసెస్ చేస్తుందని చెబుతుంది.

AI ఫీచర్స్ – గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 11 మెరుగైన AI ఫీచర్లతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది LLM ఆధారిత స్పీక్ టు ట్వీక్ ఎడిటింగ్ టూల్‌ తో రాబోతుంది. ఇందులో జెమిని ప్రాజెక్ట్ కింద స్కెచ్ టు ఇమేజ్ ఫీచర్‌పై కూడా గూగుల్ పనిచేస్తోంది. ఇక Google Pixel 10 కొత్త సెన్సార్ Tensor G5 చిప్‌సెట్‌తో రాబోతుందని.. ఈ ఫోన్ 4K 60fps HDR వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. ఈ మెుబైల్స్ లో మ్యాజిక్ మిర్రర్ ఫీచర్‌తో కూడా పనిచేసే అవకాశం ఉందని.. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉందని టెక్ వర్గాలు  చెప్పుకొస్తున్నాయి.

ALSO READ : సోదరులకు బెస్ట్ గ్యాడ్జెట్స్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. బెస్ట్ ఆఫ్షన్స్ ఇవే మరి!

Related News

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

Big Stories

×