E-Paper
Advertisement

Apple Watch Burn: స్మార్ట్‌వాచ్‌తో చేతికి గాయాలు.. ఆపిల్ సపోర్ట్‌లో గందరగోళం

Apple Watch Burn: స్మార్ట్‌వాచ్‌తో చేతికి గాయాలు.. ఆపిల్ సపోర్ట్‌లో గందరగోళం
Advertisement

Apple Watch Burn| ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్ నడుస్తోంది. యువత, ప్రొఫెషనల్స్ అందరూ స్మార్ట్‌వాచ్లను ధరించడానికి ఇష్టపడుతున్నారు. అయితే కొన్నిసార్లు ఈ స్మార్ట్‌వాచ్‌లు యూజర్ల ఆరోగ్యానికి హాని జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక యూజర్ తన ఆపిల్ వాచ్ వల్ల చేయి కాలిపోయిందని రెడ్డిట్‌లో ఒక పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

భారతదేశానికి చెందిన ఆ యూజర్ ఆ పోస్ట్‌లో ఇలా రాశఆడు. “సెప్టెంబర్ 24, 2025న ల్యాప్‌టాప్‌తో పని చేస్తుండగా నా చేయిపై ఒక్కసారిగా కాలిపోతున్నట్లు వేడిగా అనిపించింది. వెంటనే వాచ్ తీసేసరికి చేయిపై ఆ ప్రాంతంలో వాచ్ లాగా గుండ్రని ఆకారంలో కాలిన గాయం కనిపించింది. చేయిపై చర్మం కాలిపోయి బొబ్బలు వచ్చాయి. ఆ గాయం కొన్ని రోజుల తరువాత మానిపోయినా ఆ ప్రాంతంలో కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇది చర్మ అలర్జీ కాదు, డివైస్ వల్లే జరిగింది” అని యూజర్ చెప్పాడు.

Apple సపోర్ట్‌కు ఫిర్యాదు

Advertisement

ఘటన జరిగిన వెంటనే యూజర్ Apple సపోర్ట్‌కు సంప్రదించాడు. అయితే ఈ ఫిర్యాదుపై ఆపిల్ సపోర్ట్ స్పందిస్తూ ఇది చర్మ సమస్య కావచ్చని అనుమానించింది. ఆపిల్ వాదనను యూజర్ తిరస్కరించి ఈ స్మార్ట్‌వాచ్ హార్డ్‌వేర్ సమస్య అని నొక్కి చెప్పాడు. తర్వాత సపోర్ట్ డయాగ్నస్టిక్ టెస్టులు చేయమని చెప్పింది. యూజర్ అన్ని టెస్టులు చేసి రిజల్ట్స్ పంపాడు. కానీ ఫైనల్ సమాధానం రాలేదు.

డివైస్ ఇన్‌స్పెక్షన్ ప్రక్రియలో గందరగోళం

ఒక సపోర్ట్ అడ్వైజర్ వాచ్‌ను ఐర్లాండ్‌కు పంపమన్నాడు. అందుకోసం యూజర్‌ని సుదూరంగా ఉన్న సర్వీస్ సెంటర్‌కు వెళ్లమన్నారు. అయితే యూజర్ మాత్రం హోమ్ పికప్ సర్వీస్ అడిగాడు. దానికి ఆపిల్ ఏజెంట్ అంగీకరించాడు. తర్వాత మరొక ఏజెంట్ దాన్ని కంపెనీ పాలసీకి వ్యతిరేకమని తిరస్కరించాడు. ఈ గందరగోళం వల్ల యూజర్ చాలా ఇబ్బంది పడ్డాడు.

Apple స్టోర్ విజిట్‌లో మరింత నిరాశ

Advertisement

ముంబై BKC Apple స్టోర్‌లో అపాయింట్‌మెంట్ ఇచ్చారు. యూజర్ స్టోర్‌కు వెళ్లాడు. అక్కడ స్టాఫ్‌కు అతని కేసు గురించి ఏమీ తెలియదు. మొత్తం విషయం మళ్లీ వివరించాల్సి వచ్చింది. దీంతో ఆలస్యం, నిరాశ పెరిగాయి. సపోర్ట్ సమస్యలు కొనసాగాయి

ఆపిల్ సపోర్ట్ సమస్యలు

సపోర్ట్‌కు కాల్ చేసినప్పుడు చాలా సమయం వెయిట్ చేయాల్సి వచ్చింది. కొన్ని కాల్స్ అకస్మాత్తుగా డిస్‌కనెక్ట్ అయ్యాయి. ముందు ఇచ్చిన సపోర్ట్ లింక్‌లు కూడా పనిచేయడం మానేశాయి. యూజర్ కంపెనీ సరిగా స్పందించలేదని ఆరోపించాడు.

Also Read: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

యూజర్ ఇచ్చిన ఆధారాలు

గాయం ఫోటోలు, కాలిన మచ్చ ఫోటోలు షేర్ చేశాడు. కాల్ రికార్డింగ్స్, ఈమెయిల్స్, చాట్ లాగ్‌లు, అపాయింట్‌మెంట్ డీటెయిల్స్ ఆధారాలుగా ఇచ్చాడు. ఇవన్నీ తన క్లెయిమ్‌కు బలమైన ఆధారాలని చెప్పాడు.

ఘటనపై అధికారికంగా స్పందించని ఆపిల్

ఈ ఘటనపై Apple ఇంకా ఎలాంటి అధికారిక స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. యూజర్ చేసిన క్లెయిమ్‌ను ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు. సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. చాలా మంది స్మార్ట్‌వాచ్ సేఫ్టీ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూజర్ లీగల్ అడ్వైస్ కోరాడు

యూజర్ ఈ విషయంపై లీగల్ అడ్వైస్ అడిగాడు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు. సరైన ఇన్వెస్టిగేషన్, జవాబుదారీతనం కోరుతున్నాడు.

ఈ ఘటన వేరబుల్ డివైస్‌లలో ప్రస్తుతం ఉన్న రిస్క్‌లను చూపిస్తోంది. కస్టమర్ సపోర్ట్ హ్యాండ్లింగ్‌ ప్రక్రియపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. యూజర్ ఇంకా స్పష్టమైన సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ కేస్ స్మార్ట్‌వాచ్ సేఫ్టీపై చర్చలను మరింత పెంచవచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×