E-Paper
Advertisement

Paidi Rakesh Reddy: ఏపీ కూటమి గూటమి మాకొద్దు.. ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఫైర్..!

Paidi Rakesh Reddy: ఏపీ కూటమి గూటమి మాకొద్దు.. ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఫైర్..!
Advertisement

Paidi Rakesh Reddy: స్వేచ్ఛ బ్యూరో: తమది తెలంగాణ అని, ఏపీ రాజకీయంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని, ఏపీ కూటమి గూటమి తమకొద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. బీజేఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర.. రాజకీయాలతో తమకు సంబంధం లేదని, ఆంధ్ర నేతలు వచ్చి ఏదో చేస్తే తమకేంటని ప్రశ్నించారు. డ్రగ్ టెస్ట్ కు తాను రెడీ అని, తాను ఎప్పుడైనా సిద్ధమని స్పష్టంచేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు అసెంబ్లీ సాక్షిగా డ్రగ్ టెస్ట్ కు ముందుకురావాలని రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్ టెస్ట్ చేయించుకునే దుమ్ము ఉందా? అని ప్రశ్నించారు. డ్రగ్ టెస్ట్ కోసం రక్తం తీద్దామని, దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలన్నారు.

ఫామ్ హౌస్ కల్చర్ తెచ్చిందే బీఆర్ఎస్..

ఇదిలా ఉండగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ది నామినేటేడ్ పదవి అని, తమది ఎలెక్టెడ్ పదవి అంటూ రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. యంగ్ ఇండియన్ స్కూల్స్ కు అప్పు ఇప్పించింది కేంద్రమేనని తెలిపారు. యంగ్ ఇండియా స్కూల్ పై దమ్ముంటే మంత్రి శ్రీధర్ బాబు చర్చకు రావాలని రాకేశ్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం కు దమ్ముంటే అక్రమ ఫామ్ హౌస్ లను కూల్చాలని సవాల్ విసిరారు. ఫామ్ హౌస్ లను కూలిస్తేనే డ్రగ్ పార్టీలను అరికట్టొచ్చన్నారు. ఫామ్ హౌస్ కల్చర్ తెచ్చిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. బీఆర్ఎస్ తెచ్చిన ఫామ్ హౌస్ కల్చర్ గాళ్లపై డ్రగ్స్ టెస్ట్ లు చేయాలన్నారు. జన్వాడ ఫాంహౌస్, జైలు జీవితాన్ని సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయారా? అంటూ రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Also Read: Kukatpally Robbery: కళ్ళల్లో కారం కొట్టి ‘కోటి’ దోపిడీ చేసిన గ్యాంగ్ అరెస్ట్..!

కేసీఆర్ ఫాం హౌస్ వృద్ధాశ్రమంగా..

కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ అక్రమమని చెప్పిన సీఎం.. ఇప్పుడెందుకు కూల్చడంలేదని ప్రశ్నించారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటని నిలదీశారు. బీఆర్ఎస్ పతనానికి కవిత చాలని వ్యాఖ్యానించారు. ప్రజాదరణ తగ్గి, కనుమరుగవుతున్న బీఆర్ఎస్ గురించి మాటలు అనవసరమని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని రాకేశ్ రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ అంటే తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకమని, 40 ఏండ్లుగా సీనియర్ నేత జీవన్ రెడ్డి నెత్తురు తాగారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫాం హౌస్ వృద్ధాశ్రమంగా మారిందని చురకలంటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని పైడి రాకేశ్ రెడ్డి తెలిపారు.

Advertisement

Also Read: Kalyana Lakshmi: సర్కార్ సంచలన నిర్ణయం.. తులం బంగారం పథకం అమలు పై బిగ్ అప్డేట్..?

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×