Aroma Delta-16W Soundbar: ఇంట్లో పాటలు వినేటప్పుడు లేదా సినిమాలు చూసేటప్పుడు మంచి సౌండ్ క్వాలిటీ ఉంటే.. ఆ మజాయే వేరు. అయితే.. ఎక్కువ ధర పెట్టి ఖరీదైన హోమ్ థియేటర్లు కొనడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి వారి కోసం మార్కెట్లో చాలా తక్కువ ధరకే అద్భుతమైన ఆడియో డివైజెస్ అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ప్రముఖ బ్రాండ్ నుంచి వస్తున్నఈ సౌండ్ బార్ ఇప్పుడు టెక్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీని ధర కేవలం రూ. 799 మాత్రమే ఉండటంతో సాధారణ యూజర్లు సైతం దీన్ని కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
ఈ సౌండ్‌బార్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడర్న్‌గా ఉంటుంది. ‘డ్యాజ్లింగ్ బ్లాక్’ కలర్ ఫినిషింగ్‌తో.. వస్తున్న ఈ డివైస్ మీ టేబుల్ లేదా టీవీ టేబుల్ పై ఉంచడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది కాంపాక్ట్ సైజులో ఉండటం వల్ల ఈజీగా ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకువెళ్లొచ్చు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ కాలం పనిచేసేలా దీనిని డిజైన్ చేసారు.
చిన్న సైజులో ఉన్నప్పటికీ ఈ సౌండ్ బార్ సౌండ్ విషయంలో అస్సలు రాజీపడదు. ఇది 16 W పవర్ అవుట్‌పుట్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇందులో ప్రత్యేకంగా అందించిన ‘డైనమిక్ థండర్ సౌండ్’, ‘హెవీ బాస్’ టెక్నాలజీ కారణంగా పాటలు వింటున్నప్పుడు బీట్స్ చాలా స్పష్టంగా, దద్దరిల్లిపోయేలా వినిపిస్తాయి. స్టీరియో ఛానెల్ సపోర్ట్ ఉండటం వల్ల ఆడియో ఫీల్ మరింత మెరుగ్గా ఉంటుంది.
మ్యూజిక్ లవర్స్‌ని ఎక్కువగా ఆకట్టుకునే అంశం దీని బ్యాటరీ బ్యాకప్. ఈ సౌండ్‌బార్ ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 6 గంటల వరకు మ్యూజిక్ టైమ్‌ను అందిస్తుంది. మీరు బయట ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు లేదా కరెంట్ లేని సమయాల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా నాన్‌స్టాప్‌గా పాటలను ఎంజాయ్ చేయొచ్చు.
ఇది కేవలం ఒక సాధారణ స్పీకర్ మాత్రమే కాదు.. పలు రకాల కనెక్టివిటీ ఆప్షన్లతో కూడిన మల్టీఫంక్షనల్ డివైస్.
ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ ఉండటం వల్ల మీ స్మార్ట్‌ఫోన్, టాబ్ లేదా ల్యాప్‌టాప్‌ను క్షణాల్లో వైర్‌లెస్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇది బ్లూటూత్ కాకుండా.. ఇతర మోడ్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. తద్వారా యూజర్లు తమకు నచ్చిన విధంగా ఆడియోను ప్లే చేయొచ్చు.
Also Read: ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!
ఈ స్పీకర్ అసలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో.. ఇది భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ. 799 ధరకే లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో మంచి లుక్, పవర్‌ఫుల్ బేస్ , డీసెంట్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది మార్కెట్లో లభించే బెస్ట్ ఆప్షన్లలో ఒకటిగా నిలుస్తుంది.
వేయి రూపాయల కంటే.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ క్వాలిటీ అందించే స్పీకర్ కోసం చూస్తున్నారా? అయితే ఆలోచించకుండా ఈ మోడల్ ఎంచుకోవచ్చు. ఇది మీ ఎంటర్ టైన్మెంట్ పూర్తిగా తీర్చడమే కాకుండా.. మీ బడ్జెట్‌కు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.