GOBOULT Z60 TWS Earbuds: ప్రస్తుతం బడ్జెట్ ధరలో.. లభించే టెక్ గాడ్జెట్‌లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వేల రూపాయలు ఖర్చు చేయకుండా.. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం మార్కెట్లోకి అనేక బ్రాండ్లు పోటీపడుతున్నాయి. అందులోనూ ప్రముఖ ఆడియో బ్రాండ్ అయిన బోల్ట్ అందించిన ఈ మోడల్ ఇయర్‌బడ్స్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా.. ఫ్లెమింగో పింక్ కలర్‌లో ఆకట్టుకునే.. డిజైన్‌తో వస్తున్న ఈ మోడల్, కేవలం రూ. 999 ధరకే లభిస్తుండటంతో టెక్ లవర్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు వెయ్యి రూపాయల లోపు ధరలో లభించే ఈ ఇయర్‌బడ్స్ ఏయే ఫీచర్లతో వస్తున్నాయి ? ఎలా పని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ డివైజ్ మెయిన్ హైలైట్ విషయానికి వస్తే దీని అద్భుతమైన ‘ఫ్లెమింగో పింక్’ కలర్. ఇది చూడటానికి.. చాలా క్యూట్‌గా, ట్రెండీగా, స్టైలిష్‌గా ఉంటుంది. ముఖ్యంగా.. కాలేజీ స్టూడెంట్స్, అమ్మాయిలను దృష్టిలో ఉంచుకుని ఈ కలర్ వేరియంట్‌ను డిజైన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఛార్జింగ్ కేస్ కాంపాక్ట్‌గా, తక్కువ వెయిట్‌తో ఉండటం వల్ల పాకెట్‌లో లేదా హ్యాండ్ బ్యాగ్‌లో ఈజీగా సర్దుకోవచ్చు. అంతే కాకుండా ఈ ఇయర్ బడ్స్ చెవుల్లో.. సరిగ్గా ఇమిడిపోయేలా ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఎంతసేపు పెట్టుకున్నా.. చెవులకు ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగదు. జిమ్ చేసేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు కూడా ఇవి చెవుల నుంచి జారిపోకుండా ఉంటాయి.
బడ్జెట్ ఇయర్‌బడ్స్‌లో చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ లైఫ్. కానీ.. మోడల్ ఈ విషయంలో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇది ఏకంగా 60 గంటల పాటు నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అంటే .. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు వారం రోజుల పాటు మళ్లీ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ బ్యాటరీ అయిపోయినా.. టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. సుమారు 150 నిమిషాల పాటు నాన్ స్టాప్ మ్యూజిక్ లేదా కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.
ఈ ధరలో 4 మైక్రోఫోన్లు కూడా ఉండటం నిజంగా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీతో కూడిన 4 మైక్స్ ఇందులో ఉండటం వల్ల కాల్స్ మాట్లాడేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోడ్లపై వెళ్లేటప్పుడు లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. మాట్లాడినప్పటికీ, చుట్టుపక్కల ఉండే ట్రాఫిక్ సౌండ్స్ ఇది కొంతవరకు తగ్గిస్తుంది. అంతే కాకుండా అవతలి వారికి మీ వాయిస్ స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తుంది.
50ms అల్ట్రా-లో లేటెన్సీ:
మొబైల్ గేమింగ్ ఆడటాన్ని ఇష్టపడేవారికి లేటెన్సీ పెద్ద సమస్యగా ఉంటుంది. అయితే ఈ మోడల్ ఇయర్‌బడ్స్ కేవలం 50ms అల్ట్రా-లో లేటెన్సీ మోడ్‌తో వస్తున్నాయి. దీని వల్ల గేమింగ్ ఆడేటప్పుడు గన్ సౌండ్స్, ఫుట్ స్టెప్స్ లాంటివి ఎలాంటి లాగ్ లేకుండా ఇన్‌స్టెంట్‌గా వినిపిస్తాయి. గేమర్స్‌కు ఇది మంచి ఫీల్ ఇస్తుంది. అలాగే.. బ్లూటూత్ వెర్షన్ 5.3 టెక్నాలజీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు ఇవి క్షణాల్లో కనెక్ట్ అవుతాయి. సిగ్నల్ కట్ అవ్వడం.. లేదా ఆడియో బ్రేక్ కావడం వంటి సమస్యలు రాకుండా స్టేబుల్ కనెక్షన్‌ను మెయింటైన్ చేస్తుంది.
Also Read: బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్
దీనిలో ఉన్న 13mm పవర్ ఫుల్ బామ్ఎక్స్ డ్రైవర్స్ మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. బీట్స్ చాలా క్లియర్‌గా ఉండటంతో.. పాటు డీప్ బేస్ సౌండ్ ఫీల్ కలుగుతుంది. రాక్ మ్యూజిక్, పాప్ సాంగ్స్ లేదా మెలోడీస్ వినేటప్పుడు మంచి ఆడియో క్వాలిటీ లభిస్తుంది. అంతేకాదు.. ఇవి IPX5 వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉన్నాయి. అంటే.. వర్షంలో కొంచెం తడిచినా లేదా వర్కవుట్ చేసే సమయంలో.. చెమట పడ్డా ఇయర్ బడ్స్ లోపలి కాంపోనెంట్స్ పాడవదు.
మార్కెట్లో ఈ మోడల్ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్.. అసలు ధర రూ. 2,999 వరకు ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఈ-కామర్స్ సేల్స్‌లో.. ప్రత్యేక ఆఫర్ల ద్వారా కేవలం రూ.999 ధరకే లభిస్తోంది. వెయ్యి రూపాయల బడ్జెట్‌లో.. 60 గంటల బ్యాటరీ లైఫ్, స్టైలిష్ పింక్ కలర్, 4 మైక్ ENC, గేమింగ్ మోడ్ కోరుకునే వారికి ఇది ఒక పర్‌ఫెక్ట్ ఆప్షన్. బడ్జెట్ ఫ్రెండ్లీగా బెస్ట్ ఫీచర్స్ ఉన్న ఇయర్‌బడ్స్ కొనాలనుకుంటే.. నిస్సందేహంగా దీన్ని ఎంచుకోవచ్చు.