E-Paper
Advertisement

లేటెస్ట్ అప్‌డేట్..మొబైల్ ఫోన్లలో ఏఐ ‘ఆస్క్ యూట్యూబ్’ ఫీచర్ లాంచ్!

లేటెస్ట్ అప్‌డేట్..మొబైల్ ఫోన్లలో ఏఐ ‘ఆస్క్ యూట్యూబ్’ ఫీచర్ లాంచ్!
Advertisement

Ask YouTube AI Feature: ప్రతిరోజూ గంటల తరబడి యూ ట్యూబ్‌లో వీడియోలు చూసే వారికి .. ఇదొక సూపర్ గుడ్ న్యూస్. మనకు కావాల్సిన కంటెంట్‌ను వెతకడానికి ఇప్పటివరకు కేవలం కీవర్డ్స్ పైనే ఆధారపడే వాళ్ళం. కానీ కొన్నిసార్లు మనం వెతికిన సమాచారం సరిగ్గా దొరకకపోవడంతో.. చాలా సమయం వృథా అయ్యేది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి యూట్యూబ్ సరి కొత్తగా ‘ఆస్క్ యూట్యూబ్’ అనే ఏఐ ఆధారిత ఫీచర్‌ను మొబైల్ యూజర్ల కోసం .. అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తిగా మార్చేయనుంది.

1. ‘ఆస్క్ యూట్యూబ్’ ఫీచర్:

ఈ ఫీచర్ పూర్తిగా కాన్వర్జేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై ఆధారపడి పని చేస్తుంది. మీరు మీ మొబైల్‌లోని.. యూట్యూబ్ యాప్‌లో సెర్చ్ ఆప్షన్‌కి వెళ్లి ‘Ask’ బటన్‌ను ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన విషయాన్ని సాధారణ భాషలో ప్రశ్న రూపంలో అడగొచ్చు. ఉదాహరణకు.. ట్రిప్ ప్లానింగ్, వంటల తయారీ లేదా టెక్నాలజీ రివ్యూలకు సంబంధించిన విషయాలను అడిగితే.. ఆ ఏఐ టూల్ మీకు సంబంధించిన వీడియోలతో పాటు సమాచారాన్ని అందిస్తుంది.

2.వీడియోల మధ్యలో  ప్రశ్నలు అడగొచ్చు:

Advertisement

కేవలం సెర్చ్‌లోనే కాకుండా.. మీరు ఏదైనా వీడియో చూస్తున్న సమయంలో కూడా ఈ ఏఐ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏవైనా ఉంటే.. నేరుగా స్క్రీన్ కింద ఉండే ప్రాంప్ట్స్ ద్వారా అడగవచ్చు. దీని వల్ల వీడియో కంటెంట్‌ను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. త్వరలోనే దీన్ని షార్ట్స్ ,లైవ్ స్ట్రీమ్స్‌కి కూడా పొడిగించేందుకు యూట్యూబ్ సన్నాహాలు చేస్తోంది.

3. టైం ఆదా:

సాధారణంగా మనం ఒక టాపిక్ కోసం వెతికినప్పుడు.. చాలా వీడియోలు వస్తాయి. అందులో ఏది చూడాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటాం. కానీ ఈ ‘ఆస్క్ యూట్యూబ్’ ఫీచర్ ద్వారా మన ప్రశ్నకు సరిగ్గా సరి పోయే వీడియో క్లిప్స్, సమ్మరీ, ముఖ్యమైన టైమ్‌స్టాంప్స్‌ నేరుగా కనిపిస్తాయి. దీని వల్ల అనవసరమైన వీడియోలన్నీ వెతుక్కునే పని లేకుండా నేరుగా అసలైన సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు.

4. అన్ని డివైజెస్‌‌లు:

Advertisement

మొదట కొన్ని పరిమిత ప్రాంతాల్లో, టీవీ డివైజెస్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్, ఇప్పుడు ఆండ్రాయిడ్ , ఐఓఎస్ మొబైల్ యూజర్లందరికీ క్రమంగా రోల్ అవుట్ అవుతోంది. యూట్యూబ్ యాప్‌ను లేటెస్ట్ వర్షన్‌కి అప్‌డేట్ చేసుకుంటే ఈ అద్భుతమైన ఫీచర్‌ను మీ మొబైల్‌లో కూడా త్వరగా వాడొచ్చు.

Also Read: రియల్‌మీ నుంచి అద్భుతమైన మినీ ఫ్రిజ్..రూ.8,490కే!

ఈ ఫీచర్ వల్ల లాభాలు ఏంటి?

నావిగేషన్: కీవర్డ్స్ టెన్షన్ లేకుండా .. మనకు కావాల్సిన ప్రశ్నలను నేరుగా అడగొచ్చు.

తెలుసుకోవాలనే కుతూహలం: వీడియో చూస్తున్నప్పుడే డౌట్ క్లియర్ చేసుకోవచ్చు.

ఫ్రీ: యూట్యూబ్ వాడే ప్రతి సాధారణ యూజర్ కూడా ఈ ఏఐ టూల్‌ను ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు.

మొత్తానికి, యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త ఏఐ ఫీచర్ వీడియోలు వెతకడానికి మరింత సరదాగా, ఈజీగగా మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

ఎండ తగలగానే కలర్ మారే లెన్స్.. నథింగ్ AI గ్లాసెస్ ఫీచర్లు చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది!

పండగ సేల్‌లో భారీ షాక్..కొనుగోళ్లకు దూరంగా ఉంటున్న జనాలు!

ఇకపై అనౌన్ కాల్స్ ఉండవు.. ఫోన్‌లో కాలర్ అసలు పేరు చూపే CNAP సేవలు ప్రారంభం!

రియల్‌మీ నుంచి అద్భుతమైన మినీ ఫ్రిజ్..రూ.8,490కే!

పండగ వేళ పిచ్చెక్కించే ఆఫర్లు.. శాంసంగ్ ప్రొడక్ట్స్‌పై ఎంత ఆదా చేయవచ్చంటే?

జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఒక్క రీఛార్జ్‌తో మరో నెల ఉచితం.. అర్హులు ఎవరో తెలుసా?

కరెంట్ బిల్లు సగానికి తగ్గాలా? ఈ BLDC ఫ్యాన్లు వాడితే బెస్ట్

Big Stories

Advertisement
×